హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Big Python:24 అడుగుల పైథాన్..పొలానికి మేతకొచ్చే కోళ్లు, మేకల్ని మింగేసిన పాము ఇదే

Big Python:24 అడుగుల పైథాన్..పొలానికి మేతకొచ్చే కోళ్లు, మేకల్ని మింగేసిన పాము ఇదే

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Big Python:బీహార్‌లో భారీ సైజు పాముని స్థానికులు పట్టుకున్నారు. వేరుశనగ పొలంలో తలదాచుకొని మేకలు, పెంపుడు జంతువుల్ని తింటున్న పాముని పసిగట్టిన రైతులు పైతాన్‌ని బంధించి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.

సినిమాల్లో మాత్రమే కనిపించే అతి పొడవైన పాము జనం తిరిగే ప్రాంతాల్లో ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి. అంత పెద్ద పాము కంటపడటమే ఆలస్యం ఎంతటి వాళ్లకైనా చేతులు, కాళ్లు వణికిపోయి చెమటలు కూడా పడతాయి. బీహార్‌(Bihar)లో అలాంటి భారీ సర్పం ఒకటి జనం వ్యవసాయ పనులు చేసుకుంటున్న వేరు శెనగ పొలం(Peanut farm)లో తలదాచుకుంది. ఆ భారీ కొండ చిలువ(Big Python)ను చూసిన స్థానికులు పట్టుకొవడానికి పడరాని పాట్లు పడ్డారు. బీహార్‌ రాష్ట్రం రాణిగంజ్‌(Raniganj)ప్రాంతం పచ్చిరలో పాతిక అడుగుల పొడవైన కొండచిలువ ఒకటి జనం కంట్లో పడింది. అంతే అనకొండ సినిమాలో పాముని చూసినట్లుగా స్థానికులు అంత 24అడుగుల పొడవై(24 feet long)న పాముని చూసి భయపడిపోయారు.

24అడుగుల పొడవైన పాము..

పచిర గ్రామ పంచాయతీ అరారియాలోని ఓ రైతు పొలంలో సుమారు 24 అడుగుల పొడవున్న పాము కనిపించింది .శ్రీనగర్ మైనర్ కెనాల్ సమీపంలోని వేరుశనగ పొలంలో సాయంత్రం వేళల్లో పొలంలో పని చేస్తున్న కొందరు కూలీలకు పెద్ద కొండచిలువ పాము కనిపించింది. దాంతో కూలీలు విషయాన్ని గ్రామ సర్పంచ్‌కి సమాచారం చేరవేసారు. స్థానికులు, పొలంలో పని చేస్తున్న కూలీలంతా కలిసి ఆ భారీ కొండచిలువను అతి జాగ్రత్తగా పట్టుకున్నారు. పాముని బంధించే క్రమంలో కొందరు కర్రలతో కొట్టడంతో కొండచిలువకు గాయమైంది.

గంటసేపు శ్రమించి పట్టుకున్నారు..

ఎట్టకేలకు సుమారు గంటపాటు శ్రమించి భారీ సైజు పాముని పట్టుకున్నారు. 24అడుగుల పొడవున్న కొండచిలువను చూసి ఒక్కసారిగా భయపడిపోయారు. వెంటనే స్థానిక ప్రజాప్రతినిధఉలు రాణిగంజ్ ట్రీ గార్డెన్ ఫారెస్ట్ గార్డుకు సమాచారం అందించారు. అయితే ట్రీ గార్డెన్ ఫారెస్ట్ గార్డు ప్రదీప్ సింగ్ కొండచిలువను చెట్లతోటలో ఉంచడానికి నిరాకరించడంతో, కొండచిలువను సిమ్రాహా సమీపంలోని పొలంలో వదిలేశారు.ఇలా గతంలో కూడా భారీ సైజు పాముల్ని పట్టుకున్న స్థానికులు ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన దాఖలాలు ఉన్నాయి.


అనకొండ సైజులో కొండచిలువలు..

రాణిగంజ్ ప్రాంతంలో ఇలాంటి భారీ సైజు పాములు కనిపించడం కొత్తేమి కాదంటున్నారు స్థానికులు. గతంలో కూడా నాలుగైదు పాముల్ని గుర్తించామని...కాకపోతే అవి ఇంత పొడవు లేవని తెలిపారు.

రాణిగంజ్ ట్రీ గార్డెన్‌లో రెండు డజన్లకుపైగా కొండచిలువలు ఉన్నప్పటికీ, అటవీ సిబ్బంది వాటిని పట్టుకొని తీసుకెళ్లి అడవుల్లో వదలకపోవడంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పాములు ఉన్నాయని తెలిసి పొలం పనులకు వెళ్లాంటే ప్రాణభయం కలుగుతోందంటున్నారు.

పొలాల్లో పాముల పుట్టలు..

వేరు శనగ పొలాల్లో మాటు వేసిన కొండచిలువలు మేతకు వెళ్లే మేకలు, ఇతర పెంపుడు జంతువుల్ని పొట్టన పెట్టుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బఘువ తోలా, హసన్‌పూర్, రాణిగంజ్ , బాలు తోలా ప్రాంతాల్లో తరచుగా కొండచిలువలు దర్శనమిస్తున్నాయని ట్రీ గార్డెన్ ఫారెస్టర్ పర్దీప్ కుమార్ సింగ్ తెలిపారు. అయితే త్వరలోనే జంతుప్రదర్శనశాల ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా వాటిని తీసుకెళ్లి అడవిలో వదిలివేయవద్దనే ఆదేశాలు తమకు ఉన్నాయంటున్నారు అధికారులు.

First published:

Tags: Bihar News, Python, Snake

ఉత్తమ కథలు