బల్లి టీ తాగడం మీరు ఎప్పుడైనా చూశారా? అసలు కనీసం విన్నారా? మరీ విచిత్రం కాకపోతే అసలు బల్లి టీ తాగుతుందా? అని మీరు అనుమానిస్తున్నారా? మీరు ఏం అనుకున్నా కానీ, ఈ బల్లి మాత్రం కచ్చితంగా టీ తాగుతుంది. రోజూ పొద్దున్నే ఆ బల్లికి కప్పు టీ తాగకపోతే పొద్దు గడవదు. ఔను. రెండు నెలులగా ఆ బల్లి రోజూ వచ్చి ఆ ఇంట్లో టీ తాగి వెళ్తుంది. రాజస్థాన్లోని భరత్పూర్లో ఈ విచిత్రం జరిగింది. భరత్పూర్లోని ఓ ఇంట్లో రోజూ ఆ ఇంటావిడ పొద్దున్నే లేచి కుటుంబం కోసం టీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్తుంది. అయితే, ఆమె టీ పెట్టే సమయంలో రోజూ ఓ బల్లి అక్కడకు రావడం మొదలు పెట్టింది.
ఓ రోజు సరదాగా ఆమె బల్లికి కూడా ఓ కప్పులో టీ పెట్టి పక్కన పెట్టింది. వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంచక్కా టీ తాగి కొంచెం ఉత్సాహం తెచ్చుకున్నాక కిచెన్లోకి వెళ్లి చూస్తూ అక్కడ బల్లి కోసం పెట్టిన టీ కప్పులో టీ తగ్గింది. అంటే బల్లి టీ తాగిందన్నమాట. ఇదేదో విచిత్రంగా ఉందని భావించిన ఆమె అలా రోజూ బల్లికి ఓ టీకప్పులో టీ పెట్టడం మొదలు పెట్టింది. రోజూ ఆ బల్లి కూడా వచ్చి తాగడం ఆరంభించింది. ఇలా రెండు నెలల నుంచి సాగుతోంది. ఈ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:August 26, 2020, 21:54 IST