హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

New UK PM: చరిత్ర సృష్టించిన లిజ్ ట్రస్... బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా ఎంపిక..

New UK PM: చరిత్ర సృష్టించిన లిజ్ ట్రస్... బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా ఎంపిక..

రిసి సునాక్, లిజ్ ట్రస్ ల అభివాదం

రిసి సునాక్, లిజ్ ట్రస్ ల అభివాదం

Liz Truss: బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్‌ను ఓడించి లిజ్ ట్రస్ కొత్త UK ప్రధానమంత్రి అయ్యారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Karnataka, India

అధికార కన్జర్వేటివ్ పార్టీ అంతర్గత నాయకత్వ పోటీలో గెలుపొందిన తర్వాత జరిగిన అనేక దశల పోటీలో.. గెలిచి లిజ్ ట్రస్ (Liz Truss) గెలుపొందారు. దీంతో..  UK తదుపరి ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ ను ఈ రోజు ప్రకటించారు. జులైలో బోరిస్ జాన్సన్ రాజీనామాతో  పార్టీ నాయకత్వ పోటీ ఏర్పడిన తర్వాత ఆమె తన ప్రత్యర్థి, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్‌పై (Rishi Sunak)  60,399 ఓట్లు సాధించగా, లిజ్ ట్రస్..   81,326 ఓట్లను సాధించారు. రిషి కన్న.. 21 వేల ఓట్ల ఆధిక్యాన్ని సాధించి పీఎంగా ఎంపికయ్యారు.

ఆమె విజయంతో, ట్రస్ 2015 ఎన్నికల నుండి కన్జర్వేటివ్స్ యొక్క నాల్గవ ప్రధాన మంత్రి (New UK PM) అయ్యారు. ఆ కాలంలో దేశం సంక్షోభం నుంచి సంక్షోభానికి మార్పిడి చేయబడింది.  ఇప్పుడు జూలైలో 10.1% తాకిన  ద్రవ్యోల్బణం ద్వారా ప్రేరేపించబడిన సుదీర్ఘ మాంద్యంగా మారింది. కాాాగా,బ్రిటన్ తాాజాగా,  మాంద్యం ప్రభావంకారణంగా ఐదో స్థానం నుంచి ఇంకా దిగజారింది.

ఇదిలా ఉండగా ప్రపంచ దేశాలలో భారత్ మరోసారి తన సత్తా చాటుకుంటుంది.

పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థలతో భారత్ గట్టి పోటీనిస్తుంది. అగ్రదేశాలైన.. అమెరికా, బ్రిటన్,చైనా ల ఆర్థిక వ్యవస్థలు మెల్లగా దిగజారుతుంది. దీంతో అనేక దేశాలలో ప్రస్తుతం మాంద్యం నెలకొంది. అనేక దేశాలు శ్రీలంక బాట పడుతున్నాయి. అయితే.. భారత్ ఆర్థిక వ్యవస్థ గ్రోత్ రేటు 7 శాతానికి మించి ఉంటుందని, ఐఎంఎఫ్ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. బ్లూమ్ బర్గ్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. భారత్, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ ఐదోవ స్థానాన్ని ఆక్రమిస్తుందని తెలుస్తోంది. ఐఎంఎఫ్ జీడీపీ ఆధారంగా ఇండియా మొదటి త్రైమాసికంలో.. తన ఆధిక్యాన్ని పెంచుకున్నట్లు తెలుస్తోంది.

ఆర్థిక సమస్యలు, రాజకీయ మార్పులతో బ్రిటన్ సతమత మవుతుంది. అదే విధంగా యూకేలో కొత్త ప్రధాని ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. లిస్ ట్రస్,రిషి సునక్, ల మధ్య గట్టి పొటి నెలకొంది. అదేవిధంగా.. సత్యవర్థి రాథోడ్ కూడా పోటిని ఇస్తున్నారు . ద్రవ్యోల్బణం, మాంద్యం బ్రిటన్ ను అతలాకుతలం చేస్తున్నాయి. భారత్.. 7 శాతం గ్రోత్ రేట్ ను కల్గి ఉంది. భారత్ ఆర్థిక వ్యవస్థ పరిణామం 854.7 బిలియన్ డాలర్లుగా ఉంది. బ్రిటన్ ఆర్థిక పరిస్థితి 816 డాలర్లుగా ఉంది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం.. భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది. అమెరికా తొలిస్థానంలో, చైనా, జపాన్, జర్మనీ, లు వరుసగా ఇండియా, బ్రిటన్ స్థానంలో.. ఐదవ స్థానంలో ఉండబోతున్నట్లు ఐఎంఎఫ్ వెల్లడించింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Britan, United Kingdom

ఉత్తమ కథలు