మొబైల్ ఫోన్ దొంగతనం కేసు నిందితుడిపై సర్పాన్ని వదిలి చిత్రహింసలు

మొబైల్ ఫోన్ దొంగతనం కేసులో నిందితుడిపై భారీ పామును వదిలి చిత్రహింసలకు గురిచేసిన ఇండోనేషియా పోలీసులు...దీని పట్ల క్షమాపణ చెప్పారు.

news18-telugu
Updated: February 12, 2019, 6:29 PM IST
మొబైల్ ఫోన్ దొంగతనం కేసు నిందితుడిపై సర్పాన్ని వదిలి చిత్రహింసలు
నిందితుడిపై పామును వదిలి చిత్రహింసకు గురిచేస్తున్న ఇండోనేషియా పోలీసులు
  • Share this:
కరడుగట్టిన నేరగాళ్ల నోటి నుంచి నిజానిజాలు కక్కించేందుకు పోలీసులు థార్డ్ డిగ్రీ ప్రయోగించడం చాలా దేశాల్లో జరిగే వ్యవహారమే. అయితే ఇండోనేషియా పోలీసులు ఈ విషయంలో అందరినీ వెనక్కి నెట్టేశారు. మొబైల్ ఫోన్ దొంగతనం కేసులో అరెస్టైన నిందితుడికి థార్డ్ డిగ్రీ పేరుతో చిత్ర విచిత్ర హింసలకు గురిచేసి విమర్శలపాలవుతున్నారు. మొబైల్ ఫోన్ దొంగతనం కేసులో అరెస్టైన ఆ యువకుడి చేత నేరాన్ని ఒప్పించేందుకు ప్రాణాలతో ఉన్న భారీ సర్పాన్ని అతని నోటిలోకి వదిలి వేధింపులకు గురిచేశారు పోలీసులు.

నిందితుడి రెండు చేతులను వెనక్కి కట్టేసి, పామును అతని మెడపై వేసి ఓ పోలీసు అధికారి చిత్రహింసకు గురిచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కళ్లు తెరుచుకోవాలని, లేదంటే పామును నోట్లో, ప్యాంటులో వదులుతామని పోలీసు అధికారి బెదిరిస్తుండడం ఆ వీడియోలో రికార్డు అయ్యింది. ఎన్నిసార్లు మొబైల్ ఫోన్లు దొంగిలించావని పోలీసు అధికారి ప్రశ్నించగా...రెండుసార్లని ఆ నిందితుడు సమాధానమిచ్చాడు.
పోలీసు దర్యాప్తు తీరుపై మానవ హక్కుల సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నాయి. దీనికి బాధ్యులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ ఘటన పట్ల జయవిజయ పోలీస్ చీఫ్ టోన్నీ ఆనంద స్వదయ క్షమాపణ చెప్పారు. నిందితుడి చేత నేరాన్ని అంగీకరింపజేసేందుకు సర్పాన్ని ఉపయోగించినట్లు అంగీకరించిన ఆయన...అయితే అది విష సర్పం కాదని చెప్పుకొచ్చారు. నిందితుడిని ఇలా విచారణ జరపడం పోలీసు నిబంధనలకు విరుద్ధమని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
నిందితుడిపై పాముని వదలి చిత్రహింసకు గురిచేసిన పోలీసులు


తన క్లైంట్‌ను ఇలా చిత్రహింసలకు గురిచేయడాన్ని తేలిగ్గా వదలబోమని నిందితుడి తరఫు న్యాయవాది స్పష్టంచేశారు.
First published: February 12, 2019, 6:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading