రోజూ ఇంటికొచ్చి స్నాక్స్ తింటున్న రాచ ఉడుత... వైరల్ వీడియో...

జనరల్‌గా ఉడుతలు ఎక్కడా క్షణం ఉండవు. అత్యంత చురుగ్గా ఉంటాయి. ఆ ఉడుత మాత్రం... రోజూ ఆ ఇంటికి వచ్చి ఆహారం తింటోంది.

news18-telugu
Updated: May 23, 2020, 6:06 AM IST
రోజూ ఇంటికొచ్చి స్నాక్స్ తింటున్న రాచ ఉడుత... వైరల్ వీడియో...
రోజూ ఇంటికొచ్చి స్నాక్స్ తింటున్న రాచ ఉడుత... (credit - reuters)
  • Share this:
మనందరిలోనూ మూగ జీవాల పట్ల ప్రేమ ఉంటుంది. అందుకే వాటి కోసం ఏ బిస్కెట్లో, గింజలో, నీరో పెడుతూ... జాలి చూపిస్తాం. అలా ఆ జర్మనీ ఫ్యామిలీ... రాచ ఉడుత కోసం ఆహారం పెడుతోంది. మొదట ఓ రోజు ఈ ఉడుత... తమ ఇంటి దగ్గర తిరగడాన్ని ఆ ఫ్యామిలీ చూసింది. దానికి నాలుగు పొద్దు తిరుగుడు పువ్వు (సన్‌ఫ్లవర్) గింజలు విసిరింది. అది వాటిని తినేసి ఎంజాయ్ చేసింది. తర్వాద దాని కోసం ప్రత్యేకంగా ఓ చోట చిన్న టేబుల్ పెట్టి... ఆహారం పెట్టడం ప్రారంభించారు. దాంతో ఉడుత ఫుల్ ఖుషీ అయిపోయి... రోజూ ఏదో ఒక టైంలో అలా ఆడుతూ, పాడుతూ వచ్చి... ఆ గింజలు తిని... వాటర్ తాగుతోంది.


మెల్లమెల్లగా ఆ ఫ్యామిలీ... ఆ ఉడుతకు బాగా దగ్గరైంది. ఇప్పుడైతే... వాళ్లు చేతిలో ఆహారం ఉంచుకొని పిలుస్తుంటే... ఆ ఉడుత వచ్చి చక్కగా తింటోంది. ఉడుతను ముట్టుకోకపోయినా అది అలా తమ దగ్గరకు వచ్చి మరీ ఆహారం తింటుండటం ఎంతో ఆనందంగా ఉందని ఆ ఫ్యామిలీ చెబుతోంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. చాలా మంది దీన్ని చూసి... ఆ ఉడుత భలే ముచ్చటగా ఉంది అంటున్నారు.


ఉడుతల్లో చాలా రకాలున్నాయి. మన ఇళ్ల దగ్గర కనిపించే చారల ఉడుతలు మనకు వెంటనే అలవాటు కావు. ఈ రాచ ఉడుతలు చాలా పెద్ద సైజులో ఉంటాయి. ఇవి మనుషులకు ఇట్టే అలవాటు అవుతాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల దగ్గర ఈ ఉడుతల్ని చూడొచ్చు. ముఖ్యంగా తిరుమల కొండల్లో ఇవి చాలా చోట్ల ఉన్నాయి. అరటిపండ్లు, బొప్పాయి, నేరేడుపండ్లు ఇలా రకరకాల ఆహారం భక్తులు ఇవ్వగానే దగ్గరకు వచ్చి మరీ తీసుకొని... చెట్టెక్కి తింటాయి. అందుకే ఈ ఉడుతలంటే అందరికీ ఎంతో ఇష్టం.
Published by: Krishna Kumar N
First published: May 23, 2020, 6:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading