Viral Video: రైలును చూడడం ఇదే ఫస్ట్ టైమ్.. ఈ చిన్నారి రియాక్షన్ అదుర్స్.. సంతోషం పట్టలేక..

రైలు చూసిన ఆనందంలో చిన్నారి

చిన్న పాప రైలు కోసం ఎదురుచూస్తూ ఉండగా.. ఎదుటి వ్యక్తి ఏంటది అని ప్రశ్నిస్తాడు. "ఏ ట్రెయిన్" అంటూ ఆత్రుత, ఉత్సాహం కలగలిసిన ఆనందంలో ఆంగ్లంలో ముద్దుముద్దుగా సమాధానం చెప్పింది.

  • Share this:
చిన్నపిల్లల్లో ఆసక్తి, ఏకాగ్రత, ఉత్సుకత చాలా ఎక్కువగా ఉంటుంది. పెద్దలతో పోలిస్తే ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి ఎక్కువ కనబరుస్తారు. వారి చిన్నారి చేష్టలు చూస్తే ఎంతో విచిత్రంగా, ఆనందంగా, నవ్వు తెప్పించేలా అనిపిస్తుంది. ఇలాంటి సంఘటనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రత్యక్షంగా రైలులో తొలిసారి ప్రయాణించబోతున్న ఓ చిన్నారి ఉత్సాహం చూస్తే ఎవ్వరికైనా ముచ్చటేస్తుంది. ప్రపంచాన్ని తొలిసారి తన కళ్లతో చూడబోతున్న ఆ చిన్నారి అమాయకత్వం ఆసక్తి కలిగిస్తుంది. మార్చి 31న పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

42 సెకండ్ల పాటు సాగిన ఈ వీడియోలో చిన్న పాప రైలు కోసం ఎదురుచూస్తూ ఉండగా.. ఎదుటి వ్యక్తి ఏంటది అని ప్రశ్నిస్తాడు. "ఏ ట్రెయిన్" అంటూ ఆత్రుత, ఉత్సాహం కలగలిసిన ఆనందంలో ఆంగ్లంలో ముద్దుముద్దుగా సమాధానం చెప్పింది. పరిపూర్ణ ఆనందం, అమాయకత్వంతో తన ముఖంలో పలికిన భావాలను చూస్తూ సామాజిక మాధ్యమంలో ఔత్సాహికులు విశేషంగా స్పందిస్తున్నారు. అరవై లక్షల వ్యూస్ సాధించిన ఈ వీడియోని 8.5 లక్షల మంది లైక్ చేయగా.. 1300 మంది రీట్వీట్ చేశారు. ఈ వీడియోను వీక్షించిన ప్రతి ఒక్కరూ విభిన్నంగా స్పందిస్తున్నారు. "చిన్నారి కళ్లతో ప్రపంచాన్ని చూస్తున్నా" అని ఓ వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.


"రీపీట్ గా ఈ వీడియోను ప్లే చేస్తున్నా" అని మరో వ్యక్తి ఆనందాన్ని పంచుకున్నారు. "అమాయకత్వం ఎంత అందంగా ఉందో" అని మరో నెటిజన్ వినూత్నంగా ట్వీట్ చేశారు. "బాల్యపు అమాయకత్వం" అని ఇంకోకరు స్పందించారు. " నా చిన్ననాటి అమయాకపు స్పృతులు గుర్తుకు వస్తున్నాయని" చాలామంది నెటిజన్లు కామెంట్ చేశారు.

చిన్నారి రియాక్షన్‌పై ట్విట్టర్లో పోస్టులు పోటెత్తుతున్నాయి. గతంలో ఓ పదేళ్ల చిన్నారి తల్లికి తెలియకుండా ఎస్ యూవీ కారును నడేపేసింది. ఆ తర్వాత తన తల్లి దగ్గర కొట్టేసిన క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేసింది. కారు తీసుకున్న తర్వాత ఆమె బ్లూమింగ్టన్, ఇండియానా, ఈడెన్ ప్రైరీ ప్రాంతాలు మీదు రోడ్డు ప్రయాణం సాగించింది. అయితే మార్కెట్లో క్రెడిట్ కార్డు ఉపయోగించగానే తల్లి ఫోన్ కు సందేశం వెళ్లింది. అప్పటి వరకు తన కూతురు కారు తీసుకెళ్లిన సంగతి ఆమెకు తెలియదు. ఆ మెసేజ్ చూడగానే పోలీసులకు సమాచారం ఇచ్చింది. నెంబర్ తో పాటు క్రెడిట్ కార్డు ఉపయోగించిన వివరాలను పోలీసులకు తెలిపింది. వెంటనే పోలీసులు సంబంధిత ప్రదేశానికి చేరుకొని బాలికను అదుపులోకి తీసుకున్నారు. ఇంత ప్రయాణంలోనూ బాలికకు, కారుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
Published by:Shiva Kumar Addula
First published: