Little girl from Gujarat recites Aigiri Nandini Stotram to PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం తన సొంత రాష్ట్రం గుజరాత్లో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో నిన్న (మంగళవారం) ఆయన బనస్కాంత జిల్లాలోని డియోదర్‌లో కొత్త డెయిరీ కాంప్లెక్స్, బంగాళదుంప ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అదే విధంగా బనాస్ కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను కూడా జాతికి అంకితం చేశారు. ఈ క్రమంలో.. జామ్‌నగర్‌లో డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ (జిసిటిఎం)కి 100 టన్నుల సామర్థ్యం గల నాలుగు గోబర్ గ్యాస్ ప్లాంట్లకు శంకుస్థాపన చేశారు.
బుధవారం గాంధీనగర్‌లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్‌ను ప్రారంభించి, దాహోద్‌లో జరిగే ఆదిజాతి మహా సమ్మేళనానికి హాజరుకానున్నారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన సమస్యలపై చర్చించడానికి, సమాజ పురోగతికి జనశక్తిని ఉపయోగించుకోవడానికి 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో గుజరాత్‌లోని జిల్లా పంచాయతీ సభ్యులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మోదీ స్థానికులతో ఇంటరాక్ట్ అయ్యారు.
A little girl from South Gujarat recites Aigiri Nandini ..... stotram before Prime Minister Narendra Modi at 7 Lok Kalyan Marg residence of PM in national capital New Delhi during PM Modi's meeting with District Panchayat presidents and members from Gujarat. pic.twitter.com/DmqisWWffn
ఈ క్రమంలో.. గ్రామాల్లో జీవన ప్రమాణాలు, మౌలిక వసతుల కల్పనపై పంచాయతీ సభ్యుల అభిప్రాయాలను మోదీ అభినందించారు. గ్రామాలలో జీవన నాణ్యత, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే మార్గాలపై మరిన్ని చర్యలు తీసుకుంటామని మోదీ అన్నారు. కాగా, గతంతో మోదీ గుజరాత్ పర్యటించినప్పుడు.. ఒక బాలిక మోదీని సమీపించింది. ఆమె ఏమాత్రం భయం, తొణకకుండా అయిగిరి నందిని అనే స్తోత్రాన్ని మోదీకి పాడి వినిపించింది. బాలిక.. ఏమాత్రం పొల్లుపోకుండా, స్పష్టంగా స్తోత్రాన్ని పూర్తి చేసింది. ఈ క్రమంలో.. బాలికను మోదీ అభినందించారు. చిన్నారి పారాయణాన్ని మెచ్చుకున్న ప్రధాని ఆమెకు ఆశీస్సులు అందించారు. బాలిక స్తోత్రం చేసిన సమావేశం గతంలో జరిగింది. తాాజగా, మోదీ గుజరాత్ పర్యటలో భాగంగా మరోసారి వార్తలలో నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అదే విధంగా పీఎం .. తొలిరోజు గాంధీనగర్ లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఫర్ స్కూల్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో ఇంటరాక్ట్ అయ్యారు. అదే విధంగా.. గాంధీనగర్ లో విద్య సమీక్ష కేంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మోడీ.. విద్యార్థులు , వారి తల్లిదండ్రులతో వివిధ అంశాలపై చర్చించారు.
రెండో రోజు ఏప్రిల్ 19న ఉదయం గాంధీనగర్ లో పర్యటించారు. వివిధ అభివ్రుద్ది కార్యక్రమాలలో పాల్గోన్నారు. అదే విధంగా, ఏప్రిల్ 19న ఉదయం 9:40 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ను, జాతికి అంకితం చేశారు. బనస్కాంతలోని డియోదర్‌లోని బనాస్ డెయిరీ సంకుల్లో బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.