మొసళ్లు(crocodiles).. యమ డేంజరస్.. అందులో నీటిలో ఉన్నప్పుడు మొసళ్లను మించిందేది లేదంటున్నారు. పొరపాటున మొసళ్లు ఉన్న నీటి దగ్గరకు వెళ్లామా అంతే సంగతులు.. ప్రాణాలు పోవడం పక్కా.. అలాంటి సంఘటలను చాలానే చూశాం కూడా. అయితే మొసళ్లు ఉన్న కొలనులో ఈత కొడుతున్న చిన్నారిని ఎప్పుడైనా చూశారా..? మొసలి తనపై నుంచి వెళుతున్నా ఏ మాత్రం వణకని పిల్లాడిని చూశారా..? చూస్తే పిల్లాడు కాదు.. పిడుగు అంటారు.. మొసళ్లతో ఈత కొట్టిన బాలిడిని మెచ్చుకోకుండా ఉండలేరు కూడా.. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో ప్రపంచాన్ని చూపించడానికి సోషల్‌మీడియా ఉంది. అందులో కొన్ని వీడియోలో ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
మొసళ్లతో ఈత:
మొసళ్ళు ప్రాణాంతక జీవులు. వేటాడే జంతువులు. మోస్ట్ డేంజరస్. ఎలాంటి హెచ్చరికలు లేకుండా దాడి చేయడం వాటి నైజం. చాలా రహస్యంగా అటాక్ చేస్తాయి. రెప్పపాటులో ప్రాణాలను మింగేస్తాయి. నీటి వద్ద వాటి దగ్గర నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. క్షణంలో దూకడమే కాదు.. ఇతర జీవిల రక్తం కళ్ల చూడకుండా వదలవు. అలాంటివి ఓ బాలుడు మొసళ్లు ఉన్న కొలనులో దిగాడు.. డైవ్ చేసుకుంటూ ఏదో స్విమ్మింగ్ ఫుల్‌లో ఏదీ లేనట్లే దూకాడు.. మొసళ్ల మధ్యే ఈదుకుంటూ స్వీమ్ చేశాడు. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు బాలుడికి ఏం జరుగుతుందోనని భయపడ్డారు.. అయితే అతనికి ఏం కాలేదు.. ఎంతో హ్యాపీగా, నార్మల్‌గా మొసళ్ల మధ్యే ఈదుకుంటూ అటు ఇటు ఆడుకున్నాడు బాలుడు. మధ్యలో మొసలి అతి మీద ఎక్కినా కూడా ఏం మాత్రం భయపడలేదు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో వైరల్‌గ్ మారింది. '@snagfish' అనే యూజర్ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ వీడియోకు లక్షల్లో లైకులు వచ్చి పడుతున్నాయి.
View this post on Instagram
బాలుడి ధైర్యానికి ఫిదా:
ఆన్‌లైన్‌లో షేర్ చేసిన తర్వాత ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్లిప్ చూసిన నెటిజన్లు కామెంట్స్ సెక్షన్‌లో బాలుడిని లక్కీగా అభివర్ణించారు.ఇక ఈ వీడియోపై నెటిజన్లు భిన్న కామెంట్లతో స్పందిస్తున్నారు. ఇలా చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని కొందరు వాదిస్తున్నారు. ప్రాణాలకు తెగించి ఈ ఫీట్లు అవసరమా.? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదైనా జరగకూడదని జరిగితే అందరూ బాధ పడాల్సి వస్తుందని.. బాలుడిని ఈ విధంగా మొసళ్ల మధ్య నీటిలోకి దింపడం ఏ మాత్రం మంచి ఆలోచన కాదంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crocodile, Trending videos, Viral Videos