Viral Video: బస్తీ మే సవాల్.. జింకతో మహిళా ఉద్యోగి కుస్తీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

Photo Credit : You Tube

Viral Video: జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోకి అడవి జంతువులు వస్తే ఏం చేస్తారు. క్రూర మృగాలైతే భయంతో పరుగులు తీస్తారు. అటవీ అధికారులకు సమాచారమిస్తారు. సాధారణ సాధు జంతువులైతే గద్దించి పారద్రోలుతారు.

  • Share this:
జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోకి అడవి జంతువులు వస్తే ఏం చేస్తారు. క్రూర మృగాలైతే భయంతో పరుగులు తీస్తారు. అటవీ అధికారులకు సమాచారమిస్తారు. సాధారణ సాధు జంతువులైతే గద్దించి పారద్రోలుతారు. కానీ ఓ వాల్‌మార్ట్ ఉద్యోగి మాత్రం.. దుకాణంలోకి వచ్చిన జింకను రక్షించడమే కాకుండా.. కొంత సేపు దానితో కుస్తీ పట్టింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని విస్కాన్సిన్ బరాబులో ఉన్న వాల్‌మార్ట్‌ షోరూంలోకి ఒక జింక వచ్చింది. దీంతో దాన్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది లీసా అనే ఉద్యోగి. అది పరుగెత్తే అవకాశం లేకుండా.. అమాంతం జింకను రెజ్లింగ్ పొజిషన్ మాదిరిగా నేలకు అదిమి ఉంచింది. చివరకు షోరూం లోపల ఉన్నత ఇతర వర్కర్లు వచ్చి.. జింకను బయటకు తరిమేశారు. మొత్తానికి అది దుకాణం వెనుకవైపు ఉన్న మరో ఎంట్రన్స్ నుంచి బయటకు వెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. జూన్ 23న ఈ ఘటన జరిగింది. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు. తన రెజ్లింగ్ నైపుణ్యాలను ఉద్యోగి జింకపై చూపించిందని చాలామంది వీడియోకు కామెంట్ పెట్టారు. మరికొంత మంది మాత్రం సదరు ఉద్యోగి ధైర్యాన్ని మెచ్చుకుంటూ పోస్టులు పెడుతున్నారు.

భవనం వెనుక వైపు ఉన్న మార్గం నుంచి జింక దుకాణంలోకి ప్రవేశించిందని సిబ్బంది తెలిపారు. ఇక్కడ పెంపుడు జంతువులు, అటవీ జంతువులు.. దుకాణాలు, బహిరంగ ప్రదేశాల్లో తిరగడం సాధారణమే. ఈ విధంగా చాలా సార్లు స్టోర్లలోకి జంతువులు ప్రవేశించిన సందర్భాలు ఉన్నాయి. గత ఏప్రిల్‌లో థాయ్ లాండ్‌లోని సూపర్ మార్కెట్లో ఓ భారీ అడవి బల్లి దుకాణదారులను భయపెట్టింది. థాయ్ లాండ్ లోని 7 ఎలెవన్ స్టోర్ వద్ద అల్మారాల్లో ఉన్న వస్తువులను అది పడగొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. ట్విట్టర్ నుంచి ఈ వీడియో తొలగించడానికి ముందే 10 లక్షల వీక్షణలు అందుకుంది.

బ్యాంకాక్, ఇతర దేశాల్లో అడవి బల్లులు జనావాసాల్లోకి రావడం సాధారణమని థాయ్ ట్రావెల్ ఏజెన్సీ ముండో నోమడా వివరించింది. ఇటీవలే థాయ్ లాండ్ లోనే జరిగిన మరో ఘటనలో ఓ స్టోర్ లోకి పాము వచ్చింది. దుకాణం యజమాని తన పనిలో తాను చేసుకుంటుండగా, అకస్మాత్తుగా పాము బయట నుంచి దుకాణంలోకి వచ్చింది. దీంతో ఇంకేముంది భయంతో ఆమె అక్కడి నుంచి పరుగులు తీసింది.
Published by:Sridhar Reddy
First published: