చిల్డ్ బీర్ రూ.140, ఠండీ బీర్ రూ.150... ఆఫర్ చూసి షాకవుతున్న నెటిజన్లు

ఇండియన్స్ చాలా తెలివైన వాళ్లు. తాము ఏం చెయ్యాలో పక్కా ప్లాన్ వేసుకొని చేస్తుంటారు. మరి ఈ ఆఫర్ సంగతేంటి?

news18-telugu
Updated: July 8, 2020, 1:52 PM IST
చిల్డ్ బీర్ రూ.140, ఠండీ బీర్ రూ.150... ఆఫర్ చూసి షాకవుతున్న నెటిజన్లు
చిల్డ్ బీర్ రూ.140, ఠండీ బీర్ రూ.150... ఆఫర్ చూసి షాకవుతున్న నెటిజన్లు (credit - twitter)
  • Share this:
భారతీయులకు డిస్కౌంట్లు, ఆఫర్లంటే చాలా ఇష్టం. వస్తువు కొనేటప్పుడు బేరం ఆడుతారు. అలాగే... దానికి ఏదైనా ఫ్రీ ఉందేమోనని చూస్తారు. కంపెనీలు కూడా వస్తువులకు ఆఫర్లు, ఫ్రీలూ పెట్టడం ద్వారా... సేల్స్ పెరిగేలా చేసుకుంటాయి. ఐతే... తాజాగా ఆ లిక్కర్ షాపు ముందు కనిపించిన ఆఫర్ మాత్రం ఎక్కడా, ఎప్పుడూ చూసి ఉండరు. అక్కడ చిల్డ్ బీర్ (చల్లని బీర్) రూ.140 అని రాశారు. అదే ఠండీ బీర్ (చల్లని బీర్) కావాలంటే మాత్రం రూ.150 అని రాశారు. రెండూ ఒకటే టైపు బీర్లు అయినప్పటికీ... ధరలో తేడా ఎందుకన్నది నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. చాలా మంది ఈ బ్యానర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీన్ని పోస్ట్ చేసిన యూజర్లలో ఒకరు... దీని అర్థమేంటో చెప్పండి అని అడిగారు. ఈ పోస్టుతో 430 మంది లింకై ఉన్నారు.


ఇంగ్లీష్ వచ్చిన వారికి రూ.10 డిస్కౌంట్ లభిస్తుంది. అదే రాని వారికి లభించదు అని ఓ నెటిజన్ కామెంట్ రాశారు.


మరో యూజర్... ఈ ఫొటోను ఎడిట్ చేసి... ఇంగ్లీష్ మాట్లాడితే.. రూ.140, అదే హిందీ మాట్లాడితే రూ.150 అని మార్పు చేశారు.




కొద్దిగా చల్లగా ఉన్నా పర్లేదు అనుకునేవారికి రూ.140కి బీర్ అమ్ముతూ... ఎక్కువ కూలింగ్‌తో... గడ్డకట్టినట్లుగా ఉండేలా కావాలంటే రూ.150 తీసుకుంటూ ఉండొచ్చని కొంతమంది యూజర్లు అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ఇలాంటి వింత ఆఫర్లు... ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి.
Published by: Krishna Kumar N
First published: July 8, 2020, 1:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading