హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Liquor Scandal: అక్రమ మద్యం కేసులో పట్టుబడ్డ ఎద్దులు.. చివరకు వాటిని పోలీసులు ఏం చేశారో తెలుసా..

Liquor Scandal: అక్రమ మద్యం కేసులో పట్టుబడ్డ ఎద్దులు.. చివరకు వాటిని పోలీసులు ఏం చేశారో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రెండు ఎద్దులకు ఓ చట్టం శాపంలా మారింది. వాటి ఆలనా పాలనా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులుపై పడింది. అయితే  వాటిని పోషించలేక పోలీసులు చేతులెత్తేశారు. చేసేది లేక నిందితులకు అప్పగించారు. వేలం వేస్తే ఎవరూ కొనుగోలు చేయడం లేదు. ఇది ఓ రెండు ఎద్దుల కథ.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Bihar, India

రెండు ఎద్దులకు(Two Bulls) ఓ చట్టం శాపంలా మారింది. వాటి ఆలనా పాలనా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులుపై పడింది. అయితే వాటిని పోషించలేక పోలీసులు(Police) చేతులెత్తేశారు. చేసేది లేక నిందితులకు అప్పగించారు. వేలం వేస్తే ఎవరూ కొనుగోలు చేయడం లేదు. ఇది ఓ రెండు ఎద్దుల కథ. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ(Story) చదవాల్సిందే..  ఈ రెండు ఎద్దుల వ్యవహారం నిజానికి మద్యం కుంభకోణానికి సంబంధించినది. ఈ ఏడాది జనవరి 25న బీహార్‌లోని జాదోపూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు, రాంపూర్ టెంగ్రాహి గ్రామ సమీపంలో తనిఖీలు చేపడుతుండగా పశువుల మేతను తరలిస్తున్న ఎద్దుల బండిలో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నట్లు పోలీసులు(Police) గుర్తించారు. పశువుల మేతలో దాచిన 960 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఎద్దుల బండిని సీజ్ చేసి ఎద్దులను స్టేషన్‌కు(Station) తరలించారు. ఈ మద్యం కేసులో ఓంప్రకాష్ యాదవ్ సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఎద్దుల యజమాని ప్రకాష్ యాదవ్.

ఎద్దులు అప్పగించడంపై విమర్శలు

చట్టం ప్రకారం.. ఈ ఎద్దులను వేలం వేయాల్సి ఉంది. అయితే కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో మద్యం కేసులోని నిందితుల్లోని ఓం ప్రకాష్ యాదవ్‌‌కు వాటిని అప్పగించారు. అయితే ఆ రెండు ఎద్దులపై అతనికి ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవు. కేవలం వాటి నిర్వహణ బాధ్యతను చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే తిమ్మిది నెలల గడిచిపోయింది. ఇప్పటి వరకు ఓం ప్రకాష్ భార్య వాటి నిర్వహణ చూసుకుంది.

TSPSC Halltickets: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాలకు పరీక్ష తేదీ ఖరారు.. వివరాలిలా..

ఈ రెండు ఎద్దులను నిందితుడికి అప్పగించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో జాదోపూర్ ఎస్‌హెచ్‌ఓ విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.. ఎద్దులను సంరక్షించేందుకు ఓంప్రకాష్ కు ప్రతినెలా రూ.10 వేలు ఇస్తున్నట్లు వెల్లడించారు. ‘పోలీస్ స్టేషన్ ద్వారా డబ్బులు ఇస్తున్నాం. ఎద్దులను వేలం వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.’ అని సదరు పోలీసు అధికారి చెప్పుకొచ్చారు.

తలలు పట్టుకుంటున్న పోలీసులు

అయితే ఓం ప్రకాష్ యాదవ్ వాదన మరోలా ఉంది. ఎద్దుల పోషణకు తనకు ఇప్పటివరకు పోలీసులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని వాపోయాడు. తన సొంత ఖర్చులతో వాటిని పోషిస్తున్నాని తెలిపాడు. ఇక తన దగ్గర కూడా డబ్బులు లేవని ఎద్దుల నిర్వహణ చాలా భారంగా మారిందని చెప్పుకొచ్చాడు. ‘మద్యం కేసులో భాగమైన ఈ ఎద్దులతో వ్యవసాయం చేయకూడదు. వీటికి ఏమైనా అయితే నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది. నాపై జంతువుల క్రూరత్వ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎద్దుల పోషణకు పోలీసులు ఎలాంటి ఆర్థిక సాయం చేయడం లేదు.’ అని ఓంప్రకాష్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

Jobs In NAL: బీటెక్(B Tech), బీఎస్సీ(B.Sc) విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ 75 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండిలా.. 

తొమ్మిది నెలల్లో ఎద్దుల పోషణకు రూ.50 వేలకు పైగా ఖర్చు చేశామని ఓం ప్రకాష్ తెలిపాడు. తనకు పోలీసుల నుంచి డబ్బు వచ్చేలా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశాడు. మరోపక్క వేలంలో ఈ ఎద్దులను ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

Published by:Veera Babu
First published:

Tags: Bihar, Bulls, Jadopur, Police Case, Trending news

ఉత్తమ కథలు