Shocking: అడవిలో అత్యంత ప్రమాదకర జంతువులలో సింహాలు ముందు వరుసలో ఉంటాయి. వీటిని చూసి ఇతర జంతువులు భయంతో వణికి పోతుంటాయి. కానీ ఒక్కొసారి వేరే జంతువులు కూడా సింహాలపై దాడి చేసిన సంఘటనలు కొకొల్లలు.
Elephants attacks On lions: సాధారణంగా అడవిలో అనేక రకాలు జంతువులు ఉంటాయి. ఇవి ఆహారం కోసం ఇతర జంతులపై ఆధారపడతాయి. అడవిలో ప్రతి ఒక జంతువు మరోక జీవిపై ఆధారపడి జీవిస్తుంది. అడవులలో, సింహాలు, పులులు, ఏనుగులు, జింకలు, గేదెలు, జీబ్రాలు, దుప్పిలు, దున్నపోతుల వంటి రకరకాల జీవులు ఉంటాయి. ఇక సింహాలు, పులులు,చిరుత పులులు,నక్కలు మాంసాహార జీవులు. ఇవి శాఖాహార జంతువులను వేటాడి తింటాయి.
ఈ క్రమంలో.. సింహాలు గుంపులుగా ఆహారం కోసం వేటడతాయి. సింహాలు.. దున్నపోతులు, విల్డర్ బీస్ట్, రకరకాల జంతువులను వేటాడతాయి. అయితే, ఒక్కొసారి దున్న పోతులు, ఏనుగులు.. సింహాల గుంపుపై దాడికి చేసిన సంఘనలు అనేకం జరిగాయి. దున్నపోతులు, గుంపులుగా వెళ్లి సింహాలపై దాడిచేస్తాయి. పొరపాటున సింహాం వాటికి చిక్కిందా.. కొమ్ములతో పొడిచి.. గాలిలో ఎగిరిపడేస్తాయి. ఇలాంటి ఎన్నో వీడియోలు ఇది వరకే వైరల్ అయ్యాయి. ఇక ఏనుగులు కూడా.. అదే మాదిరిగా సింహాలపై ఘీంకరిస్తు దాడులు చేస్తాయి. ఇలాంటి వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
సింహాల గుంపు చెట్లలో కూర్చుని సేద తీరుతున్నాయి. రెండు పెద్ద సింహాలు, వాటి పిల్లలతో సహా అడవిలో కూర్చొని ఉన్నాయి. అప్పుడు.. ఒక్కసారిగా ఏదో పెద్ద అలజడి వచ్చింది. పెద్ద శబ్దాలు చేసుకుంటు ఏనుగులు.. సింహాల గుంపు వైపు దూసుకొని వచ్చాయి. తమ తొండంతో ఘీంకరించుకుంటూ... సింహాలవైపు వేగంగా వచ్చాయి. మరి సింహాలు ఏనుగుల ఆవాసంలోకి వచ్చాయో.. మరేంటో కానీ.. సింహాలను చూడగానే ఏనుగులు కోపంతో వాటివైపు దూసుకొచ్చాయి. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన సింహాలు.. భయంతో అక్కడి నుంచి పారిపోయాయి. ఏనుగులు.. దొరికారా.. మీకు ఉందిలే.. అన్నట్లు సింహాల గుంపు వైపు వచ్చాయి. పాపం.. సింహాలు భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు సింహాలనే పరుగులు పెట్టించాయిగా.. అంటూ కామెంట్ లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.