హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: కాలువలో బాతుపిల్ల కష్టాలు.. సాయం చేసిన సింహం.. వైరల్ వీడియో

Viral Video: కాలువలో బాతుపిల్ల కష్టాలు.. సాయం చేసిన సింహం.. వైరల్ వీడియో

నీటి నుంచి బయటకి వచ్చి ఇబ్బందిపడుతున్న ఆ బాతుకు సహాయం చేయడానికి సింహం ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

నీటి నుంచి బయటకి వచ్చి ఇబ్బందిపడుతున్న ఆ బాతుకు సహాయం చేయడానికి సింహం ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

నీటి నుంచి బయటకి వచ్చి ఇబ్బందిపడుతున్న ఆ బాతుకు సహాయం చేయడానికి సింహం ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

  మనకు సింహం గుర్తుకురాగానే భయపడిపోతుంటాం. సింహాలు క్రూర మృగాలని, అవి అడవిలో ఇతర జంతువులను వేటాడి చంపి తింటాయని భావిస్తుంటాం. అయితే, అడవి జంతువులేవైనా ఆకలేస్తే తప్ప వేరే జీవులను చంపవు. దీన్నే నిరూపిస్తూ తమకు కూడా మంచి మనసు ఉంటుందని, అకారణంగా ఏ జంతువునూ చంపమని రుజువు చేసిందో సింహం. ఇంతకీ ఆ సింహం చేసిన పని తెలిస్తే వావ్ అనేస్తారు.. చెరువులో ఈదేందుకు కష్టపడుతున్న ఒక బాతు పిల్లకు సహాయం చేస్తూ కెమెరాకు చిక్కింది. ఆ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి (ఐఎఫ్​ఎస్​) సుశాంత నంద ట్విట్టర్​లో షేర్ చేశారు. ‘‘ఇంత పెద్ద మాంసాహార జంతువుకు కూడా సున్నితమైన హృదయం ఉందని మీలో ఎంత మందికి తెలుసు? అవి అడవి మృగాలే.. కానీ క్రూరమైనవి కాదు. ఆహారం కోసం లేదా వాటిని మనం రెచ్చగొట్టినప్పుడు మాత్రమే అవి ఇతర జంతువులను వేటాడి చంపుతాయి. వాటిపై ఉన్న వ్యతిరేక భావనను తొలగించి, వాటిని గౌరవించి ఆదరించండి.’’ అంటూ వీడియోను ట్విట్టర్​లో షేర్​ చేశారాయన.

  ఆ వీడియోను నిశితంగా పరిశీలిస్తే.. కాలువలో ఈదేందుకు కష్టపడుతున్న ఒక బాతు పిల్లను పెద్ద సింహం గమనించింది. వెంటనే బాతు పిల్ల వద్దకు వచ్చిన సింహం తన కాళ్లతో పలుమార్లు తడుతూ దానిని నీటిలోకి నెట్టివేసింది. నీటి నుంచి బయటకి వచ్చి ఇబ్బందిపడుతున్న ఆ బాతుకు సహాయం చేయడానికి సింహం ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. కాగా, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్​ అవుతోంది. దీన్ని ఇప్పటివరకు 10 వేల మందికి పైగా వీక్షించారు. అయితే, దీనికి నెటిజన్ల నుండి మిశ్రమ స్పందనలను వస్తోంది. కొంతమంది సుశాంత నంద చెప్పిన విషయానికి సపోర్ట్​ చేయగా.. మరికొంతమంది మాత్రం సింహం ఆ బాతును కాపాడినట్లే కాపాడి తర్వాత తింటుందని అభిప్రాయపడ్డారు. ఒక నెటిజన్​ స్పందిస్తూ ‘‘ఈ వీడియో చాలా గందరగోళంగా ఉంది. బాతు పిల్లను కాపాడిన సింహం తర్వాత దాన్ని ఏమి చేస్తుందో కచ్చితంగా చెప్పలేము!. ఏమేమైనా, బాతును కాపాడినందుకు సింహాన్ని మెచ్చుకోవాల్సిందే. " అంటూ వ్యాఖ్యానించాడు.


  చాలా మంది నెటిజన్లు మనిషికి, అడవి జంతువులకు మధ్య పోలికలను ప్రస్తావించారు. మనుషుల కన్నా అడవి జంతువులు ఎంతో మంచివని అభిప్రాయపడ్డారు. ఇక, జంతువుల మధ్య ప్రేమకు సంబంధించిన మరో వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఒక అందమైన నల్ల కుక్కపిల్ల, తెల్ల రంగులోని రామ చిలుకకు మధ్య ప్రేమానురాగాలను ఈ వీడియోలో చూడవచ్చు. రామ చిలుక తనకు కొత్తగా పరిచమైన కుక్క పిల్లను ఎంత ప్రేమగా ముద్దాడుతుందో ఈ వీడియో చూపిస్తుంది. నెటిజన్ల హృదయాలను గెలుచుకున్న ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెండి మేరీ అనే జంతు ప్రేమికుడు పంచుకున్నారు.​ ఈ క్లిప్ ఇప్పటికే టిక్‌టాక్‌లో 12.5 మిలియన్ల వ్యూస్​ను సాధించింది.

  First published:

  Tags: Viral Video

  ఉత్తమ కథలు