హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Vasectomy On Lion: సింహానికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసిన వైద్యులు.. ఎందుకో తెలుసా?

Vasectomy On Lion: సింహానికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసిన వైద్యులు.. ఎందుకో తెలుసా?

(Image-Reuters)

(Image-Reuters)

మగవాళ్లకు పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్‌ ని వ్యాసెక్టమీ అంటారు. పిల్లలు పుట్టిన తరువాత.. ఇకమీదట సంతానం అవసరం లేదనుకున్న మగవాళ్లు ఈ సర్జరీ చేయించుకుంటారు.

మగవాళ్లకు పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్‌ ని వ్యాసెక్టమీ అంటారు. పిల్లలు పుట్టిన తరువాత.. ఇకమీదట సంతానం అవసరం లేదనుకున్న మగవాళ్లు ఈ సర్జరీ చేయించుకుంటారు. సాధారణంగా ఈ తరహా ఆపరేషన్లు మనుషుల్లోనే ఎక్కువగా చూస్తుంటాం. కానీ మనుషులతో పాటు కొన్ని జంతువులకు కూడా వ్యాసెక్టమీ చేస్తుంటారు. కుక్కలు, కోతులు వంటి సంఖ్య ఎక్కువగా ఉన్న జంతువులకు ఇలాంటి ఆపరేషన్లు చేసి వాటి సంఖ్యను అదుపులో ఉంచేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు ప్రభుత్వాధికారులు. కానీ తాజాగా నెదర్లా౦డ్స్‌లోని రాయల్ బర్గర్స్ జూలో ఒక మగ సింహానికి వ్యాసెక్టమీ సర్జరీ చేశారు వైద్యులు. ఆ జూలో ఎక్కువ సంఖ్యలో సింహాలు ఉండటంతో.. కొత్తగా సంతాన వృద్ధి అవసరం లేదని సిబ్బంది భావించారు. దీంతో 11 సంవత్సరాల వయసున్న థోర్ అనే మగ సింహానికి గురువారం వ్యాసెక్టమీ ఆపరేషన్ చేశారు.

హెంక్ లూటెన్ అనే వైద్యుడి ఆధ్వర్యంలో సింహానికి విజయవంతంగా సర్జరీ చేశారు. రాయల్ బర్గర్స్ జూలో థోర్ DNA అవసరమైనంత ఉందని ఆయన చెప్పారు. గత సంవత్సరం థోర్ ద్వారా రెండు ఆడ సింహాలు ఐదు పిల్లలకు జన్మనిచ్చాయి. ఇక్కడి జూలో సింహం పిల్లలు తగినన్ని ఉన్నాయి. ఇప్పటికే థోర్ DNA అవసరమైనంత మేరకు విస్తరించి ఉంది. ఇక జూలోని సింహాల జన్యుక్రమం మారాల్సిన అవసరం ఉందని హెంక్ తెలిపారు. అందుకే థోర్‌కు వ్యాసెక్టమీ చేశామని చెప్పారు.

* అరుదుగా సర్జరీ.. సింహాలకు చాలా అరుదుగా వ్యాసెక్టమీ చేస్తారు. హెంక్ ఇక్కడి జూలో గత 35 సంవత్సరాలుగా పశువైద్యుడిగా పనిచేస్తున్నారు. కానీ ఆయన ఈ గురువారం మొదటిసారి ఒక సింహానికి వ్యాసెక్టమీ సర్జరీ చేయడం విశేషం. సింహానికి క్యాస్ట్రేషన్‌కు (వృషణాలను తొలగించడం) బదులుగా వ్యాసెక్టమీ చేయాలని సిబ్బంది నిర్ణయించారు. క్యాస్ట్రేషన్ చేస్తే హార్మోన్ల లోపం వల్ల మగ సింహాల జూలు ఊడిపోయే ప్రమాదం ఉంది. అందుకే వ్యాసెక్టమీని ఎంచుకున్నారు.

కానీ అడవుల్లో సహజంగా జీవించే సింహాల జనాభా భారీగా తగ్గిపోతోంది. గత 20 ఏళ్లలో అడవుల్లో ఉండే సింహాల జనాభా 30-50 శాతం తగ్గిందని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ చెబుతోంది. వాటి సంరక్షణకు ప్రపంచ దేశాలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆ సంస్థ సూచిస్తోంది.

Published by:Sumanth Kanukula
First published:

Tags: VIRAL NEWS

ఉత్తమ కథలు