Home /News /trending /

LION CLIMBS TREE SAVE LIFE FROM BUFFALO VIRAL VIDEO PAH

Viral Video:  ద్యావుడా.. సింహానికే రివర్స్ లో షాక్...  ఇలాంటి వీడియోను ఎప్పుడు చూసుండరు..

భయంతో చెట్టేక్కిన సింహాం

భయంతో చెట్టేక్కిన సింహాం

Viral Video: అడవిలో ఒక సింహం వేట మొదలెట్టింది. దానికి ఒక గేదెల గుంపు కనిపించింది. మెల్లగా వాటిలోని తన టార్గెట్ ను ఎంచుకుంది. వాటిని పరిగెత్తించింది. కానీ ఇక్కడ గేదెలు ఏ మాత్రం భయపడలేదు.. సింహానికే రివర్స్ లో షాక్ ఇచ్చాయి.

Viral Video: అడవిలో ఒక సింహం వేట మొదలెట్టింది. దానికి ఒక గేదెల గుంపు కనిపించింది. మెల్లగా వాటిలోని తన టార్గెట్ ను ఎంచుకుంది. వాటిని పరిగెత్తించింది. కానీ ఇక్కడ గేదెలు ఏ మాత్రం భయపడలేదు.. సింహానికే (Lion)రివర్స్ లో షాక్ ఇచ్చాయి.

అడవికి ఎన్ని జంతువులు ఉన్న.. రాజు మాత్రం సింహామే. దానికున్న ప్రత్యేక జూలు, ఠీవి మరే ఇతర జంతువులలో కనిపించవు. సింహాం కనిపిస్తే చాలు.. చుట్టు పక్కన ఉన్న వేరే జంతువు దాని దరిదాపుల్లోకి వెళ్లడానికి సాహసించవు. ఇక పొరపాటున దాని దగ్గరకు ఏదైన జంతువు వెళ్లిందా.. దానికి ఆయువు తీరినట్టే. ఒక్కొసారి కొన్ని జంతువులు గుంపులుగా సంచరిస్తాయి.






ఈ క్రమంలో ఏవైన క్రూరమృగాలు దాడి చేస్తే.. అవన్ని కూడా యూనిటీగా ఎదిరిస్తాయి. దాడిచేసే జంతువులను ఎదిరిస్తాయి. ఇప్పటికే ఇలాంటి ఎన్నో వీడియోలను మనం సోషల్ మీడియాలో చూస్తునే ఉంటాం.

సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ (Viral Video) అవుతుంటాయి. వీటిలో జంతువుల కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఫన్నీగా ఉంటే... మరికొన్ని భయంకరంగా ఉంటాయి. నెటిజన్లు ఇలాంటి వీడియోలు చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా, ఈ కోవకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. అడవిలో ఒక సింహాం గేదెల గుంపును చూసింది. వాటిలో తన వేటను ఎంచుకుంది. మెల్లగా దాని దగ్గరకు వెళ్లింది. గేదెలపై దాడి చేసింది. అప్పుడు గేదెల నుంచి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. సాధారణంగా సింహాన్ని చూసి పారిపోవాల్సిన,గేదెలు (Buffalo) సింహనికే ఎదురుతిరిగాయి. అప్పుడు.. పాపం సింహం ఒక్కటే ఉంది. అవి ఏ మాత్రం భయపడకుండా.. సింహం పై దాడిచేసాయి.

సింహం భయంతో అటు ఇటు పరుగులు తీసింది. గేదెలు మాత్రం వెనక్కు వెళ్లడం లేదు. అక్కడ ఒక చెట్టు ఉంది. సింహం వెంటనే అమాంతం.. ఆ చెట్టుపైకి ఎక్కి కూర్చుంది. అక్కడి నుంచి గేదెల వైపుకు భయంగా చూస్తుంది. గేదెలు మాత్రం నువ్వు కిందకు దిగు.. నీ సంగతి చూస్తామన్నట్లు.. సింహన్ని గమనిస్తున్నాయి. ఇది ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. కానీ ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media)  తెగ వైరల్ అవుతుంది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Buffalo, Lions, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు