మనకు ఆకలేస్తే.. ఇంట్లో వండిన భోజనాన్ని.. ప్లేటులో పెట్టుకొని ఎంచక్కా తింటాం. లేదంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకొని లాగించేస్తాం. మరి అడవుల్లో ఉండే జంతువల పరిస్థితేంటి? శాకాహారం తినే జంతువులు ఆకులో, పండ్లనో తిని బతుకుతాయి. కానీ మాంసాహార జంతువులు అలా కాదు. వాటి ఆకలి తీరాలంటే వేటాడం తప్పనిసరి. తమ కన్నా చిన్న జీవులను చంపుకు తినాలి. ఇలా జంతువులు ఒకదానిని మరోకటి వేటాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కొద్ది సమయంలోనే వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ సింహం, నిద్రిస్తున్న చిరుతపై దాడికి యత్నించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియోను లయన్ కింగ్ అనే యూట్యూబ్ చానల్ షేర్ చేసింది.
ఈ వీడియోలో.. చిరుత అడవిలో ఎత్తైన ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటుంది. అయితే అదే సమయంలో సింహం.. నెమ్మదిగా చిరుత ఉన్న చోటుకు చేరుకుంటుంది. చిరుతపై దాడి చేసేందుకు యత్నిస్తుంది. వెంటనే మేల్కొన్న చిరుత.. సింహంపై ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. అయితే సింహంపై గెలవలేని భావించిన.. అక్కడి నుంచి పరుగెత్తటం చేసింది. దీంతో సింహం కూడా చిరుతను వెంబడించడం ప్రారంభిస్తుంది.
అయితే అదే సమయంలో అటుగా ఓ ఎనుగుల గుంపు అటు వైపుగా వచ్చింది. అందులో పెద్ద ఎనుగుతో పాటు చిన్న ఎనుగులు కూడా ఉన్నాయి. అందులో ఓ ఎనుగు.. చిరుతను సింహం బారి నుంచి రక్షించడానికి ముందుకు వస్తోంది. సింహం వైపు ఎనుగు కదులుతోంది. దీంతో సింహం అక్కడి నుంచి పారిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Elephant, Leopard, Viral Video