Lion Video : క్రూర మృగాలతో జాగ్రత్తగా ఉండాలి. మాంసం రుచి మరిగిన అవి.. మనుషులపై దాడి చేసేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ముఖ్యంగా జూలలోని ఎన్‌క్లోజర్లలో ఉన్న వాటికి.. స్వేచ్ఛ లేదనే కోపం బాగా ఉంటుంది. అందువల్ల ఛాన్స్ దొరికినప్పుడు దాడి చేయడానికి ఏమాత్రం వెనకాడవు. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇన్‌స్టాగ్రామ్‌లోని earth.reel పేజీలో ఈ వీడియోని జనవరి 16, 2023న అప్‌లోడ్ చేశారు. ఇప్పటివరకూ దీనికి 1400కి పైగా లైక్స్ వచ్చాయి. దీన్ని గమనిస్తే.. ఓ జూలో సింహాన్ని చూసేందుకు టూరిస్టులు వెళ్లారు. అక్కడ ఓ కుర్రాడు.. సింహం ఎన్‌క్లోజర్‌లో చెయ్యి దూర్చి.. సింహం జూలును ముట్టుకున్నాడు. వెంటనే సింహం.. అతని వేలును పట్టుకుంది. దాన్ని విడిపించుకునేందుకు అతను ఎంతగానో ప్రయత్నించాడు. ఆ సమయంలో ఇతర టూరిస్టులు.. తమ మొబైళ్లలో వీడియో రికార్డ్ చేశారే తప్ప.. అతన్ని కాపాడేందుకు ఏ ప్రయత్నమూ చెయ్యలేదు. చివరకు అతని వేలును సిహం లాగేసుకుంది.
ఆ వీడియో (viral video)ని ఇక్కడ చూడండి ( viewer discretion is advised)
View this post on Instagram
ఇది ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో తెలియకపోయినా... ఇప్పుడు వైరల్ అయ్యింది. ఈ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. "అద్భుతమైన వ్యక్తులు. వీడియోలు తీసుకుంటున్నారు. సాయం చెయ్యలేదు. బహుశా దీన్ని వాళ్లు నమ్మలేకపోయారేమో" అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా.. "ఆ వీడియో రికార్డ్ చేస్తున్న వాళ్లను చూడండి" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.
"క్రూరమృగాలతో ఆటలొద్దు. దాడి చెయ్యడమే వాటికి తెలుసు" అని మరో యూజర్ స్పందించారు. చాలా మంది నెటిజన్లు.. తోటి సందర్శకులు సాయం చేయకపోవడాన్ని తప్పుపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending video, VIRAL NEWS, Viral Video