సైన్సుకు అంతుచిక్కని అద్భుతం...అభిమన్యుడు పద్మవ్యూహంపై అమెరికాలో లక్షల కోట్ల వ్యాపారం...

అభిమన్యుడు పద్మవ్యూహం గురించి తన తండ్రి చెబుతుంటే వినడం సాధ్యమేనా...అంటూ కొందరు కొట్టి పారేస్తుంటారు. కానీ అది ముమ్మాటికి నిజమని ప్రస్తుతం శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు.

news18-telugu
Updated: October 20, 2020, 11:27 PM IST
సైన్సుకు అంతుచిక్కని అద్భుతం...అభిమన్యుడు పద్మవ్యూహంపై అమెరికాలో లక్షల కోట్ల వ్యాపారం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత దేశం దేవతల కర్మభూమి, పురాతన కాలంలోనే ఈ నేలపై సైన్స్ కొత్త పుంతలు తొక్కిందని, చాలామంది సైంటిస్టులు సమాధానమిస్తున్నారు. దేవతల కాలం నుంచే ఈ వేదభూమిలో సైన్స్ మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లింది. దీనికి అనేక కారణాలను చెబుతున్నారు. మరి వారు చెబుతున్న సైన్స్ టెక్నాలజీ మహాభారత కాలంలోనే ఎంతలా వర్ధిల్లిందో తెలుసుకునేందుకు...ఒక చిన్న ఉదాహరణ చూద్దాం... యుద్ధవ్యూహాల్లో ఎంతో ప్రత్యేకత ఉన్న పద్మవ్యూహం పెద్ద రహస్యం, మహా మహా యోధులకు సైతం అది ఒక చిక్కుముడి. ఎందుకంటే దాన్ని భేదించే నైపుణ్యం కేవలం ఆరుగురికి మాత్రమే తెలుసు, ఒకరు శ్రీ కృష్ణుడు కాగా, మరొకరు ద్రోణుడు, అర్జునుడు, కర్ణుడు, కృపాచార్యుడు, భిష్ముడికి మాత్రమే పద్మవ్యూహం ఛేదించడం.. తెలుసు. అయితే పద్మవ్యూహంలో ప్రవేశించటం మాత్రమే అభిమన్యుడికి తెలుసు. దీని వెనుక ఒక చరిత్ర ఉంది. ఓ రోజు అభిమన్యుడి తల్లి, కృష్ణుడి సోదరి అయిన సుభద్ర తన భర్త అర్జునుడిని పద్మవ్యూహం రహస్యం అడిగింది. అప్పటికే అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉన్నాడు. పద్మవ్యూహం గురించి అర్జునుడు చెబుతుండగా, సుభద్ర ‘ఊ కొడుతూ’ నిద్రపోయింది. అయితే, సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు మాత్రం శ్రద్ధగా వింటున్నాడు. అప్పటికే అర్జునుడు పద్మవ్యూహాంలోకి ఎలా వెళ్లాలో చెప్పేశాడు. ఏడు వలయాల్లో రథ, గజ, తురగ, పదాతి సైన్యాలతో శత్రుదుర్భేద్యమైన పద్మవ్యూహాన్ని గజ వధ ద్వారా లోపలికి ప్రవేశించాలని అర్జునుడు రహస్యం చెప్పాడు. ఈలోగా సుభద్ర నిద్రపోవటం గమనించిన అర్జునుడు సగం మాత్రమే చెప్పి వెళ్లిపోయాడు. దీంతో అభిమన్యుడికి పద్మవ్యూహంలో ప్రవేశించడం మాత్రమే తెలిసింది. కానీ బయటపడటం తెలియలేదు. ఫలితంగా అభిమన్యుడు పద్మవ్యూహం చేదించి బయటకు ఎలా రావాలో తెలియక కౌరవుల చేతిలో హతమయ్యాడు.

father gives poison to babies,mahabubnagar,father tries to kills girls,crime news,telugu news,పిల్లలకు విషమిచ్చిన తండ్రి,మహబూబ్ నగర్, క్రైమ్ న్యూస్
ప్రతీకాత్మక చిత్రం


అయితే దీన్ని మనం సైన్స్ కోణం నుంచి చూసినట్లయితే గర్భంలో ఉన్న అభిమన్యుడు పద్మవ్యూహం గురించి తన తండ్రి చెబుతుంటే వినడం సాధ్యమేనా...అంటూ కొందరు కొట్టి పారేస్తుంటారు. కానీ అది ముమ్మాటికి నిజమని ప్రస్తుతం శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. తన తండ్రి తల్లి సుభద్రకు చెబుతున్న యుద్ధరీతులపై గర్భంలోని అభిమన్యుడు నేర్చుకోవడంపై......... ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు పరిశోధనలు సాగుతు న్నాయి. నిత్యం ఇంట్లో వినియోగించే శబ్ధాల్ని పదివారాల గర్భస్థ పిండం గుర్తిస్తున్నట్లు శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. తల్లి చెబుతున్న మాటలను పిండ దశలోనే శిశువు గుర్తించగలుగుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ పిల్లల తెలివి తేటలపై ప్రభావానికి అద్దం పడుతున్నాయి. కడుపులో ఉన్న పిండానికి వినికిడి శక్తి ఏర్పడుతుందని, దాంతో తల్లితో ఇతరులు మాట్లాడే మాటలు, తల్లి ఇతరులతో చెప్పే సంగతులు విని గ్రహించగాలుగుతారని నిపుణులు, మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు.

baby boy sky, alaska, baby born in flight, rare incident, అరుదైన ఘటన, అలస్కా, విమానంలో పుట్టిన బిడ్డ, స్కైగా నామకరణం
ప్రతీకాత్మక చిత్రం


పురాణాల్లో ఇలాంటి మరో సంఘటన ఉంది. రాక్షస రాజు హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు కూడా తల్లి గర్భంలో ఉండగా నారదుడి మాటలు విని నారాయణ మంత్రం నేర్చుకున్నాడు. అందువల్ల అతడు పుడుతూనే విష్ణుభక్తుడు అయ్యాడని చెప్తారు. నారదుడు లీలావతికి చేసిన ఉపదేశం ఆమె కంటే కూడా ఆమె గర్భంలో పెరుగుతున్న ప్రహ్లాదునికే ఎక్కువ ఉపయోగపడిందని పురాణాలు చెబుతున్నాయి. తల్లి గర్భంలో ఉండగానే సమాజంలో జరిగేవి వింటూ అర్థం చేసుకోగలిగే సూపర్ కిడ్స్ ఉంటారని అలనాటి మన రుషులు గుర్తించారు.

అయితే ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్‌నే ఈ తరం శాస్త్రవేత్తలు అప్లై చేస్తున్నారు. ప్రీనాటల్ ట్రైనింగ్ స్కూల్స్‌ని స్థాపించి ఏకంగా గర్భస్థ శిశువులకు పాఠాలు చెబుతున్నారు. బిడ్డకు అతని లక్షాన్ని, ఆలోచనా విధానాన్ని తీర్చి దిద్దేందుకు ఈ స్కూల్స్ లో ఫీడ్ బ్యాక్ ఇస్తారు. అమెరికాలోని ఫిలడేల్ఫియాలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎచీవ్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ పొటెన్షియల్ ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ స్కూల్స్ నడుస్తున్నాయి.

మన దేశంలోకూడా ఇప్పటికే నెల తప్పగానే ఆడపిల్లని ఎంతో వేడుకగా పుట్టినింటికి తీసుకు రావటం, వేడుకలు చేయటం, ఆమెకు ప్రశాంత వాతావరణం కల్పించటం, పురాణ కాలక్షేపం, కథలు, మంచి సంగీతం, మంత్రోచ్ఛారణ, భక్తి సంగీతం వినిపించటం మొదటి నుంచి ఉన్న సాంప్రదాయమే...మంచి కథలు వింటే కడుపులో బిడ్డ మంచి లక్షణాలు పుణికి పుచ్చుకుంటాడని దృఢంగా మన పెద్దలు నమ్మేవాళ్లు. పుట్టాక కూడా పిల్లవాడికి మంచి పాటలు, పద్యాలు, కథలు చెబుతూ పిల్లల మానసిక స్థాయిని, పెంచే వాళ్లు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ కార్పొనేట్ ప్రపంచంలో పెద్ద వ్యాపారం అయింది. దీనిపై బడా సంస్థలు వేలాది కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. చైనా, జర్మనీ, రష్యా, జపాన్ లాంటి దేశాల్లోనూ ఈ ప్రీనాటల్ ట్రైనింగ్ స్కూల్స్‌లో పేరు నమోదు చేయించుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

కడుపులో ఉమ్మనీటిలో భద్రంగా తిరిగే బిడ్డ ఆ దశలోకే తన పాదాల స్పర్శతో తల్లిని తాకటం, ఆకలి వేస్తే అటూ ఇటూ కాస్త తిరగటం అనుభవంలోకి వచ్చే విషయమే. ఈ దశలోనే పాఠాలు నేర్పాలి అంటారు నిపుణులు. గర్భంలో ఉండగానే మెదడును ఉత్తేజ పరచటం ద్వారా వాళ్ల ఆలోచనా విధానాన్ని చర్యలను తల్లిదండ్రులు కోరుకునే విధంగా తీర్చి దిద్దగలుగుతారు. గర్భంలో ఉన్న తొమ్మిదినెలల కాలంలో బిడ్డ జీవితాన్ని ప్రభావితం చేస్తారు. ఈ శిక్షణతో బిడ్డ మెదడు కుడివైపు భాగం చురుగ్గా సమర్థవంతంగా పనిచేయడానికి మరింత బాగా అన్ని విషయాలు నేర్చుకునేట్లు ఎదుగుతోందని చెబుతారు. అందుకే గర్భంతో ఉన్న మహిళ శాస్త్రీయ సంగీతం, మంత్రాలు, శిక్షణతో చెప్పే ఉపన్యాసాల్ని వినాలి. కడుపులో ఉన్న బిడ్డతో తల్లిదండ్రులు ప్రతీరోజూ మాట్లాడాలి. బైట నుంచి బిడ్డతో నెమ్మదైన స్వరంతో ప్రశాంతంగా మాట్లాడుతూ ప్రోత్సాహం ఇవ్వాలి. బిడ్డ ఎంత ఉన్నత స్థితిలో ఉండాలని తాము భావిస్తున్నారో అదంతా చెప్పుకోవాలి.

ఆరవ నెలలో నుండి మనం చెప్పే మాటలు బిడ్డ ఐక్యూని ప్రభావితం చేస్తాయంటారు. ఈ దశలో బిడ్డలో ఉత్తేజం కలిగించగలిగితే, శరీరంలోని నరాలు, కండరాలు మిగిలిన పిల్లల కంటే శరవేగంలో సమన్వయం సాధించగలిగాయని, ఐక్యూ లెవల్స్ అత్యున్నత స్థాయిలో ఉంటాయని చెబుతున్నారు. గర్భంలో ఉన్న బిడ్డను చేతితో ముట్టుకుంటూ ఎంతో సంతోషంగా, ఒత్తిడి లేకుండా తన భావోద్వేగాలకు అనుగుణంగా బిడ్డకు విద్యాబుద్ధులు నేర్పించే ఈ పద్ధతి వల్ల బిడ్డ పుట్టాక కూడా చాలా తక్కువ ఏడుస్తారని, హాయిగా నిద్రపోతారని, అప్పటికే ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలు ఆ బిడ్డకు తెలిసి ఉంటాయి కాబట్టి చాలా సురక్షితంగా ఉన్నట్లు ఫీలవుతున్నారు. మరి ఇలాగైతే మహాభారతంలోని అభిమన్యుడి చరిత్ర కూడా నిజమే అని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు.
First published: October 20, 2020, 11:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading