Home /News /trending /

LESSONS UP TO FIFTH CLASS ON A SINGLE BLACKBOARD IN A CLASSROOM IN BIHAR SNR

Bihar:ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్‌ క్లాస్‌ వరకు ఒకే తరగతి గది..పాఠాలు కూడా ఒకే బ్లాక్‌ బోర్డ్‌పైన..

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Variety School:బిహార్‌లో ఓ ప్రాధమిక పాఠశాలకు ఒకే తరగతి గది ఉంది. ఇంకా విచిత్రం ఏమిటంటే ముగ్గురు ఉపాధ్యాయులున్న స్కూల్‌లో ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్‌ వరకు ఇద్దరు టీచర్లు ఒకే బ్లాక్‌ బోర్డ్‌పై పాఠాలు చెబుతున్నారు. ఇప్పుడు ఆ వీడియోనే వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...
విద్యావ్యవస్థపై బిహార్‌(Bihar)ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఎంతటితో ఆ స్కూల్‌ని చూస్తే అర్ధమవుతుంది. కతిహార్ (Kathihar)జిల్లా మణిహారి (Manihari)బ్లాక్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాల దుస్థితి ఏమిటంటే..స్కూల్‌లో ఒకే తరగతి గది ఉంది. అందులోనే ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇంకా విచిత్రమైన సమస్య ఏమిటంటే కనీసం క్లాస్‌ రూమ్‌లో రెండో బ్లాక్‌ బోర్డ్‌ కూడా లేకపోవడం రెండు హిందీ(Hindi),ఉర్ధు( Urdu)పాఠాలు ఒకే బ్లాక్‌బోర్డు(Single blackboard)పై ఒకే సారి చెబుతున్నారు అక్కడి ఉపాధ్యాయులు. ప్రాధమిక విద్య అంటేనే పిల్లలకు సరిగా అర్ధం చేసుకోలేని స్థాయిలో ఉంటారు. అలాంటిది ఇద్దరు టీచర్లు ఒకేసారి రెండు భాషలకు చెందిన పాఠాలు చెబుతుంటే స్టూడెంట్స్‌(Students)‌కి ఎంత డిస్టబెన్స్‌గా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది ఈ వీడియోVideo. విద్యాశాఖకు కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్న అక్కడి ప్రభుత్వాని(Government)కి ఇలాంటి పాఠశాలలు కనిపించడం లేదా అంటూ వైరల్(Viral) అవుతున్న వీడీయోని చూస్తున్న నెటిజన్లు(Netizens)బిహార్‌ సర్కారుని విమర్శిస్తున్నారు.

ఒక స్కూల్‌లో ఒకే తరగతి గది..
సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బిహార్‌లోని ఈ సింగిల్ క్లాస్‌రూమ్‌ స్కూల్. నేటి బాలలే రేపటి పౌరులు అన్న బాపూజీ మాటను ఆచరణలో పెడతామని చెప్పే ప్రభుత్వాలు కనీసం స్కూల్స్‌లో తరగతి గదులు, క్లాస్‌ రూమ్‌లలో బ్లాక్‌ బోర్డులు లేకుండా పాఠాలు చెప్పడం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీహార్‌లోని కతిహార్ జిల్లా నుండి ప్రాథమిక పాఠశాల దుస్థితి చూస్తుంటే విద్యావ్యవస్థకే అవమానం కలిగించే విధంగా ఉంది. ఇద్దరు టీచర్లు బ్లాక్‌ బోర్డుకు చెరోవైపు నిల్చొని ఒకరు హిందీ, మరొకరు ఉర్ధు పాఠాలు చెబుతుంటే విద్యార్ధులు ఎటు చూడాలో ..ఏది వినాలో తెలియక తికమక పడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఒకే బోర్డుపై రెండు తరగతుల పాఠాలు..
అయితే ఇది ఇప్పుడు కొత్తగా జరుగుతున్న తంతు కాదని..గత ఐదేళ్లుగా ఇదే విధంగా పాఠాలు చెబతున్నట్లుగా తెలుస్తోంది. మణిహరి బ్లాక్‌లోని ఉర్దూ ప్రైమరీ స్కూల్ 2017లో విశ్వనాథ్ చౌదరి ఆదర్శ్ మిడిల్ స్కూల్ అజంపూర్ గోలాకు మార్చబడింది. అప్పటి నుంచి తరగతి గది సమస్య కొనసాగుతోంది. ఇప్పటికే తమకు గదుల కొరత ఉందని, పరిపాలనా ఉత్తర్వుల తర్వాత 1 నుంచి 5వ తరగతి వరకు ఒక గది మాత్రమే ఇచ్చామని అజంపూర్ గోలాలోని విశ్వనాథ్ చౌదరి ఆదర్శ్ మిడిల్ స్కూల్ టీచర్ నీలం కుమారి తెలపారు. అందుకే అప్పటి నుంచి నేటి వరకు ఒకే గదిలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తున్నామని సమర్ధించుకుంటున్నారు.

ఈ వ్యవస్థ మారేదెప్పుడు..
ఒకేసారి రెండు భాషల పాటాలు చెప్పి విద్యార్ధులపై ఒత్తిడికి గురి చేయాలని కాదని ఉర్దూ ప్రాథమిక పాఠశాల హెడ్‌ మాస్టర్ మణిహరి ప్రఫుల్లిత్ మింజ్ చెప్పారు. స్కూల్‌లో ముగ్గురు టీచర్లు ఒకే క్లాస్‌ రూమ్‌ ఉండటం వల్లే ఇలా చేయక తప్పలేదన్నారు. ప్రాధమిక పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఒకే గదిలో ఒకే బ్లాక్‌బోర్డుపై పాఠాలు చెబుతున్న విషయం తమకు ఇప్పుడే తెలిసిందని జిల్లా విద్యాశాఖ అధికారులు సమర్ధించుకున్నారు. ఈ సమస్యకు పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తామన్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Bihar News, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు