పాకిస్థాన్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుగా... తినడానికి తిండి లేదు.. చేద్దామంటే పనిలేదు.. ధరలేమో ఆకాశంలో.. ప్రజలు ఆగ్రహావేశాలతో... అంతా అల్లకల్లోలం. ఆర్థిక తిరోగమనం ఆ దేశాన్ని పాతాళానికి నెట్టేస్తోంది. అలాంటి దేశంలో ఎవరైనా ఎంతకాలం ఉండగలరు? ఛాన్స్ దొరికితే... భారత్ లాంటి దేశంలోకి వచ్చేయాలని ఆశగా చూస్తూ ఉంటారు. మనుషులకే కాదు.. జంతువులకూ ఇలాగే అనిపిస్తోంది. అందుకే.. ఓ చిరుతపులి.. పాకిస్థాన్ నుంచి భారత్‌లో ప్రవేశించింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రిపోర్టుల ప్రకారం.. శనివారం రాత్రి 7 గంటలకు... భారత్, పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులో భాగమైన... సాంబాలోని రామ్‌ఘర్ సబ్ సబ్ సెక్టార్ దగ్గర... ఓ చిరుతపులి పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి చొరబడింది. పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి వచ్చేటప్పుడు నీరసంగా వచ్చిన ఆ చిరుత.. సరిహద్దు దాటి భారత్‌లో అడుగు పెట్టగానే జన్మ ధన్యమైనట్లు తెగ ఆనందపడిపోయింది. పరుగులు పెడుతూ.. హుషారుగా అడవిలోకి వెళ్లింది. చిరుత రాకను BSF జవాన్లు కనిపెట్టారు. ఓ వైపు ఆనందపడుతూనే.. మరోవైపు సరిహద్దు దగ్గర్లోని ప్రజలను అలర్ట్ చేశారు.
ఆ చిరుతపులికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి
#WATCH | A leopard was spotted entering Indian territory by crossing the International Border from Pakistan side in Ramgarh Sub Sector of Samba today around 7pm. Police issued an alert for the locals residing near the border. (Source: BSF) pic.twitter.com/Zii349MdW4
— ANI (@ANI) March 18, 2023
ఈ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. "జాగ్రత్త అది చిరుత బాంబు కావచ్చు" అని ఓ యూజర్ స్పందించగా... "తెలివైన చిరుత" అని మరో యూజర్ స్పందించారు. "చివరకు చిరుతలు కూడా పాకిస్థాన్‌లో ఉండాలనుకోవట్లేదు" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.
"ఆహార కొరత ఎంత తీవ్రంగా ఉందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ" అని మరో యూజర్ స్పందించగా... "ఇది ఆనందకరమైన చొరబాటు" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. ఆ చిరుతను జవాన్లు పట్టుకునే అవకాశాలు లేవనుకోవచ్చు. ఎందుకంటే... అది అడవిలోకి పారిపోయి ఉంటుంది. దాన్ని పట్టుకున్నా తిరిగి పాకిస్థాన్‌కి అప్పగించడం వేస్ట్. ఎందుకంటే.. అక్కడ మనుషులకే ఆహారం లేదు. ఇక చిరుతలను ఏం చేసుకుంటారనే ప్రశ్న వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BSF, India pakistan, India pakistan border, Pakistan