Viral thrilling video: కుందేలును చిరుతపులి వేటాడుతుంటే... ఆ వీడియో చూసేటప్పుడు మనం ఏమనుకుంటాం... కుందేలు తప్పించుకుంటే బాగుండు అనుకుంటాం... కానీ చిరుతపులి చాలా తెలివైనది. అందువల్ల అది వేటాడి వెంటాడి కుందేలును పట్టేస్తుంది. అప్పుడు ప్రకృతి ధర్మం కాబట్టి ఇక అంతే అనుకుంటాం. ఇలా ఒకే వీడియో మనల్ని రెండు రకాలుగా ఆలోచించేలా చేస్తుంది. అలాంటి మరో కిక్ ఫుల్ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది. ఇందులో బుజ్జిగా పెరిగిన ఓ కుందేలు (Rabbit)ని చిరుతపులి చూసింది. కుందేలుకు 5 అడుగుల దూరంలో చిరుతపులి (Leopard) ఉంది. ర్యాబిట్ని పట్టుకొని అమాంతం తినేయాలన్నది చిరుత ప్లాన్. ఐతే... కుందేలు తక్కువేమీ కాదు. అది కూడా వేగంగా పరుగెత్తగలదు. అందువల్ల దాన్ని పట్టుకోవడం ఈజీ కాకపోయినా... చిరుత తెగించింది. ఒక్కసారిగా కుందేలువైపు ఉరికింది.
తనవైపు చిరుత రావడాన్ని క్షణాల్లో గమనించిన కుందేలు... చెంగు చెంగున ఎగురుతూ... అటూ ఇటూ పరుగెడుతూ... ఆ తుప్పలూ... ఈ మొక్కల్లోంచీ తప్పించుకుంటూ... చివరకు తుర్రుమని పారిపోయింది. చేతిదాకా వచ్చిన ఆహారం... నోటికి అందకుండా పోయిందే అన్నట్లు చిరుత అప్పడం ముఖం పెట్టింది. ఆ వీడియో ఇప్పుడు సూపర్ వైరల్ అవుతోంది.
ఈ మొత్తం ఘటనలో కుందేలు అదృష్టవంతురాలు అనుకోవచ్చు. ఎందుకంటే... ఈ రెండింటికీ ఓ లక్షణం ఉంది. ఇవి ఎంత వేగంగా పరుగెడుతున్నా... సడెన్‌గా ఆగి మరోవైపుకి పరుగెత్తడం వీటికి సాధ్యమే. కుందేలు... తన శత్రువుల నుంచి తప్పించుకోవడానికి అదే చేస్తుంది. రకరకాల యాంగిల్స్వైపు పరుగెడుతూ... తన శత్రువుకి చుక్కలు చూపిస్తుంది. ఐతే... ఇక్కడ శత్రువైన చిరుతపులి కూడా అదే విధంగా పరుగెత్తగలదు. అందువల్ల కుందేలును పట్టుకోవడం చిరుతకు మ్యాటరేమీ కాదు. కానీ... చుట్టూ తుప్పలు, గడ్డి వంటివి ఉండటంతో... కుందేలు... చిరుతకు కనిపించీ, కనిపించకుండా వెళ్తూ... తప్పించుకోగలిగింది. ఆ వీడియో మీరూ చూడండి.
The rabbit has a skill in running away. pic.twitter.com/4W8P1MkZmm
— Life and nature (@afaf66551) March 25, 2021
ఇది కూడా చదవండి: Holi 2021: ఏ రాశి వారికి ఏ రంగు కలిసొస్తుంది? ఆర్థికంగా బలపడాలంటే ఏ రంగుతో ఆడాలి?
ఈ వీడియోలో గడ్డి తినేందుకు అడవిలోని ఓ రోడ్డువైపు కుందేలు వచ్చింది. అక్కడే చిరుతపులి మాటువేసి ఉంది. కుందేలును చూడగానే చిరుత దాడి చెయ్యవచ్చు. కానీ అలా చెయ్యకుండా కాసేపు ఆగింది. ఎందుకంటే... తాను దాడి చేస్తే... కుందేలు ఎటు పరుగెడుతుంది... ఎలా దాన్ని పట్టుకోవాలి అనేది చిరుత కాసేపు ఆలోచించుకుంది. సరిగ్గా అదే సమయంలో... చిరుత తనపై దాడి చేస్తే ఎలా తప్పించుకోవాలి అనేది కుందేలు ఆలోచించుకుంది. ఈ రెండు ప్లాన్లలో కుందేలు ప్లానే గెలిచింది. ఈ వీడియో బాగా నచ్చుతుంటే... నెటిజన్లు తమ ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Leopard attack, Viral Videos