news18-telugu
Updated: November 29, 2020, 11:48 AM IST
నగరంలో చిరుత పులి (credit - twitter - ᴀʙʜɪꜱʜᴇᴋ ᴘʀᴀꜱᴀᴅ)
ఆ మధ్య హైదరాబాద్... రాజేంద్రనగర్‌లో ఓ చిరుతపులి... 2 నెలలపాటూ చుట్టుపక్కల తిరుగుతూ... ఒకట్రెండు సార్లు రోడ్డు పైకి వచ్చి... ఓసారి లారీ డ్రైవర్లకు కనిపించి... ఇలా చాలా హంగామా చేసింది. 2 నెలల తర్వాత దాన్ని పట్టుకోగలిగారు. సేమ్ ఇలాగే... ఉత్తరప్రదేశ్... ఘజియాబాద్‌లో ఓ చిరుతపులి... సిటీలో దర్జాగా తిరుగుతోంది. అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లో... వీధుల్లో తిరిగే దాని కదలికలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. అ చిరుత చాలా పెద్దగా ఉంది. అది దాడి చేస్తే తప్పించుకోవడం కష్టం. ఈ విషయం వెంటనే సిటీ మొత్తం పాకింది. 12 సెకండ్ల ఆ వీడియో... ట్విట్టర్లో వైరల్ అయ్యింది. ఆ చిరుత... రాజ్ నగర్ ఏరియాలో... తిరిగినట్లు ప్రభుత్వ అధికారులు గుర్తించారు.
ఘజియాబాద్ డెవలప్మెంట్ అథార్టీ భవన జనరేటర్ రూం దగ్గరకు ఆ చిరుత పులి వెళ్లింది. జనరేటర్ ఆన్ చెయ్యగానే... అక్కడి నుంచి పారిపోయింది. ఆ తర్వాత అది ఓ చెట్టు ఎక్కింది. అక్కడి నుంచి దిక్కులు చూసింది. వెంటనే కిందకు దిగింది. కొందరు అథార్టీ ఉద్యోగులు కర్రలతో హడావుడి చెయ్యగానే... దగ్గర్లో ఉన్న ఓ ఇన్స్టిట్యూట్ క్యాంపస్ వైపు వెళ్లింది. ఆ తర్వాత చిరుత ఎటు వెళ్లిందో, ఎక్కడ దాక్కుందో తెలియలేదు.
ఇప్పడు దాని కోసం ఫారెస్ట్ అధికారులు ఘజియాబాద్ అంతా వెతుకుతున్నారు. ప్రజలను ఇళ్లలోంచీ బయటకు రావొద్దని కోరారు. మొత్తం ఐదు బృందాలు దాని కోసం గాలిస్తున్నాయి. అయినా అది దొరుకుతుందో లేదో తెలియట్లేదు. కారణం... అది ఎక్కడికి వెళ్లిందో తెలియకపోవడమే. అది పెద్ద చిరుత కాబట్టి... దానికి తెలివి తేటలు ఎక్కువగా ఉన్నాయనీ... దానితో జాగ్రత్తగా ఉండాలని ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Gold Jewellery: బంగారు నగలు కొనాలనుకుంటున్నారా... ఇదే సరైన టైమ్... త్వరపడండి
మొత్తానికి ఇలా చిరుతపులి జనావాసాల్లోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది.
Published by:
Krishna Kumar N
First published:
November 29, 2020, 11:48 AM IST