news18
Updated: November 25, 2020, 9:17 PM IST
ప్రతీకాత్మక చిత్రం
- News18
- Last Updated:
November 25, 2020, 9:17 PM IST
కాకులు దూరడని కారడవులు.. చీమలు దూరని చిట్టడవులలో నివాసముండాల్సిన అడవి జంతువులు జన సంచారంలోకి అడుగుపెడుతున్నాయి. మనుషుల అవసరాల నిమిత్తం అడవుల నరికివేత.. కార్పొరేట్ కంపెనీల ధనదాహానికి అడవులు కుచించికుపోతున్నాయి. దీంతో కొద్దికాలంగా అడవుల్లోని వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. కోతులు, నక్క వంటి చిన్న జంతువులే కాదు.. పులి, ఏనుగు వంటి భారీ జంతువులు సైతం మనుషులు విరివిగా ఉండే నగరాల్లో సంచరిస్తూ జనాలను భయపెడుతున్నాయి. ఇటీవలే హైదరాబాద్ లో జూ నుంచి తప్పించుకుపోయిన ఓ చిరుత.. నగరంలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ లోనూ ఒక చిరుత పులి రోడ్ల మీద తిరుగుతూ జనాలను భయపెట్టింది.
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఒక చిరుత పులి రోడ్లమీద స్వేచ్ఛగా తిరిగింది. వీధుల గుండా వెళ్తూ.. జనాలను భయాందోళనకు గురి చేసింది. ఈ చిరుతపులిని చూసిన స్థానికులు ఇళ్లల్లోనే తలుపులకు గడియలు వేసుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. చిరుత.. ఘజియాబాద్ డెవలప్మెంట్ అథారిటీ (జీడీఏ) వైస్ చైర్ పర్సన్ ఇంట్లోని జనరేటర్ గదిలోకి ప్రవేశించింది. విషయం తెలియక అక్కడ పనిచేసే వ్యక్తి సరాసరి ఆ గదికి వెళ్లాడు. దీంతో పులి ఒక్కసారిగా అతడిపై పంజా విసిరింది.
ఇది చూసిన వారంతా కర్రలు, బడిసెలు తీసుకుని అక్కడికి వచ్చారు. దీంతో బెదిరిపోయిన పులి.. అక్కడ్నుంచి పారిపోయింది. ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక చెట్టు ఎక్కి... ఘజియాబాద్ క్యాంపస్ లోకి ప్రవేశించింది.
ఇందుకు సంబంధించిన దృశ్యాలను పలువురు వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటవీ శాఖ అధికారులు పులి కోసం గాలిస్తున్నారు.
Published by:
Srinivas Munigala
First published:
November 25, 2020, 9:17 PM IST