హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Shocking: జనాలకు చుక్కలు చూపించిన చిరుతపులి.. చివరికి ఏమైందో తెలుసా..?

Shocking: జనాలకు చుక్కలు చూపించిన చిరుతపులి.. చివరికి ఏమైందో తెలుసా..?

చెట్టు మీద ఉన్న చిరుత పులి

చెట్టు మీద ఉన్న చిరుత పులి

Assam: ఒక్కొసారి క్రూర మృగాలు అడవి నుంచి దారితప్పి మనుషుల ఆవాసాలలోకి వస్తాయి. అవి ఆహారం కోసం, నీళ్ల కోసం సమీపంలోని గ్రామంలోనికి ప్రవేశిస్తుంటాయి.

Leopard on The Loose in Guwahati: అడవులలో రకరకాల జంతువులు ఉంటాయి. వాటిలో కొన్నిక్రూర మృగాలతో పాటు, సాధు జంతువులు కూడా ఉంటాయి. సింహం, పులి, చిరుత పులి, ఎలుగుబంటి, మొసలి, నక్కలు, హైనాల వంటి రకరకాల క్రూర మృగాలు ఉంటాయి. ఇక .. జింకలు, జిరాఫీలు, విల్డర్ బీస్ట్, ఏనుగుల వంటి సాధు జంతువులు కూడా ఉంటాయి. సాధారణంగా క్రూర మృగాలు, సాధు జంతువులను వేటాడి తింటాయి. అదే విధంగా సాధు జంతువులు చెట్ల కొమ్మలు, ఆకులు తిని తమ ఆకలిని తీర్చుకుంటాయి. ఇదే ఆటవిక నియమం.

ఇక క్రూర మృగాలైన.. సింహాలు, పులులు.. జింకలు, విల్డర్ బీస్ట్, గేదెలను వేటాడి తింటుంటాయి. ఇప్పటికే జంతువుల వేటకు సంబంధించి అనేక వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయంకరంగాను ఉంటాయి. ఒక్కొసారి అడవిలోని జంతువులు దారితప్పి మనుషుల ఆవాసాలకు వస్తాయి.ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. అస్సాంలోని గౌహతిలో ఒక చిరుత పులి బీభత్సాన్ని స్రుష్టించింది. గౌహతిలోని పాండు లోకో కాలనీ వాసులు.. అడవికి దగ్గరలో ఉంటారు. ఈ క్రమంలో ఒక చిరుత పులి వారు ఉంటున్న ప్రాంతంలోకి ప్రవేశించింది. ఒక మహిళపై దాడిచేసి అక్కడి నుంచి పారిపోయింది. దీంతో గ్రామంలోని ప్రజలంతా అరుపులు,కేకలు పెడుతు అక్కడి నుంచి పారిపోయారు.

చిరుత పులి అక్కడే ఉన్న పెద్ద చెట్టుమీద ఎక్కి దాక్కుంది. వెంటనే స్థానికులకు అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. చిరుత పులికి మత్తు ఇంజకన్ ఇచ్చారు. ఆ తర్వాత... అది స్పృహ తప్పి పడి పోగానే వలలో దాన్ని బంధించారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. చిరుత పులిని పరీక్షించి సమీపంలోని అడవిలో వదిలేస్తామని అధికారులు తెలిపారు.

First published:

Tags: Assam, Leopard attack, VIRAL NEWS

ఉత్తమ కథలు