సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్గా మారుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలపై నెటిజన్లు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా చిరుతపులికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ ఆ చిరుత పులి ఏం చేసిందంటే.. ఓ ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న పెంపుడు కుక్కను ఎత్తుకెళ్లింది. ఈ ఘటన మహారాష్ట్ర నాశిక్ సమీపంలోకి భుసె గ్రామంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
ఆ వీడియోలో ఏముందంటే.. రాత్రి సమయంలో చిరుతపులి నిశ్శబ్దంగా ఇంటి ఆవరణలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న పెంపుడు కుక్క వద్దకు చేరుకుంటుంది. వెంటనే చాలా తెలివితో కుక్కపై దాడి చేసింది. పూర్తిగా కుక్కపై పడుకుంది. అనంతరం కుక్కను నోటిలోకి తీసుకున్న చిరుత.. అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో వైరల్గా మారడంతో.. భుసె గ్రామంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చిరుత ఎప్పుడు, ఏటు వైపు నుంచి వస్తుందో అని ఆందోళ చెందుతున్నారు.
#WATCH | Maharashtra: A leopard hunts a pet dog sleeping outside a house in Bhuse village of Nashik.
(Source: CCTV footage) pic.twitter.com/sHZ1O6VUEE
— ANI (@ANI) June 11, 2021
ఇందుకు సంబంధించిన వీడియోను ANI వార్త సంస్థ ట్విట్టర్లో షేర్ చేసింది. 36 సెకన్ల నిడివి గల ఈ వీడియోకు ఇప్పటివరకు 30 వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఇక, ఇటీవలి కాలంలో మహారాష్ట్రలోని అనేక జిల్లాల్లో చిరుతపులుల సంఖ్య పెరిగింది. చిరుత పులులు జంతువులపై మరియు మానవులపై కూడా దాడి చేసినట్లు నివేదికలు కూడా ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dog, Leopard, Viral Video