హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

హృదయ విదారక ఘటన.. కారు బానెట్ లో చిక్కుకుని విల విల్లాడిన చిరుత పులి.. వైరల్ గా మారిన వీడియో..

హృదయ విదారక ఘటన.. కారు బానెట్ లో చిక్కుకుని విల విల్లాడిన చిరుత పులి.. వైరల్ గా మారిన వీడియో..

రవీనా టాండన్ (ఫైల్)

రవీనా టాండన్ (ఫైల్)

Viral video: చిరుత పులి అకస్మాత్తుగా రోడ్డుమీదకు వచ్చింది. రోడ్డును దాటి మరో వైపుకు వెళ్లడానికి పరిగెత్తింది. ఇంతలో అనుకొకుండా అది కారుముందు భాగంలోని బానెట్ లో చిక్కుకుంది.

కొన్ని సార్లు అడవిలోని జంతువులు జనావాసాల్లోకి వస్తుంటాయి. మనం తరచుగా పులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు , ఏనుగులో జనవాసాల్లోకి వచ్చిన అనేక సంఘటనలు చూశారు. క్రూరజంతువులు.. ఆహారం, నీటి జాడను వెతుక్కుంటూ జనావాసాల్లోకి వస్తుంటాయి. ఈ క్రమంలో.. కొన్ని సార్లు.. అవి మనుషులపైన దాడిచేస్తుంటాయి. మరికొన్ని సార్లు.. అవి కూడా అనుకొని ప్రమాదాలలో చిక్కుకుంటాయి. ఇలాంటి ఎన్నో ఘటనలు గతంలో జరిగాయి. తాజాగా, ఒక చిరుత పులి జనావాసాల్లోకి వచ్చి ప్రమాదంలో చిక్కుంది.

పూర్తి వివరాలు.. చిరుత పులి (Leopard) అనుకొకుండా రోడ్డు మీదకు వచ్చింది. రోడ్డుకు మరోవైపున వెళ్లడానికి ప్రయత్నించింది. ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది. అది వేగంగా వస్తున్న కారు ముందు భాగంలో చిక్కుకుంది. చిరుతపులి కారు... ముందు భాగంలో ఉన్న బానెట్ లో చిక్కుకుని (Leopard Gets Stuck on Cars Bonnet) విల విల్లాడింది. అది కారులో ఇరుక్కుపోయింది. చిరుత ..కారు నుంచి విడిపించుకొవడానికి గిల గిల కొట్టుకుంటుంది. అయితే, ఇంతలో కారు నడిపే వ్యక్తి దాన్ని గమనించాడు. వెంటనే కారు ఆపాడు. మరోవైపు రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి దీన్ని గమనించాడు.


కారు డ్రైవర్ కు అనేక సూచనలు చేశాడు. కాసేపటి తర్వాత.. చిరుత పులి కారు నుంచి విడిపించుకుంది. అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు.  ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో(Twitter)  షేర్ చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో  (Social media) వైరల్ గా మారింది.

ఈ వీడియోను బాలీవుట్ నటి చూసి ఎమోషనల్ (Actress Raveena Tandon emotional on this video) అయ్యారు. తన ట్విటర్ అకౌంట్ లో వీడియోను పోస్ట్ (Tweet) చేశారు. చిరుత పులి కారులో చిక్కుకొని పెనుగులాడటం తనకు (Emotional)  బాధగా అనిపించిందని, అది తిరిగి క్షేమంగా అడవిలో వెళ్లిపోవాలని ప్రార్థిస్తున్నట్లు కామెంట్ జత చేశారు.

First published:

Tags: Bollywood heroine, Leopard, Raveena Tandon, Trending videos, Tweets, Viral Video

ఉత్తమ కథలు