కొన్ని సార్లు అడవి నుంచి క్రూర జంతువులు ఆహారం, నీటి జాడ కోసం సమీపంలోని గ్రామాలకు వస్తుంటాయి. ఈ క్రమంలో.. మనుషులపై దాడులు చేస్తుంటాయి. మరికొన్ని సార్లు.. మనుషులు చేతిలో గాయపడతాయి. సాధారణంగా అడవి నుంచి ఏనుగులు, చిరుతపులులు, పెద్ద పులులు, ఏనుగులు, ఎలుగు బంట్లు గ్రామాల్లోకి వస్తుంటాయి. కొన్ని సార్లు.. అవి వ్యవసాయ బావులలో, ఇంట్లో ఉండే బావుల్లో పడిపోతాయి. వీటిని ఫారెస్టు అధికారులు రెస్క్యూ చేసి కాపాడతారు. ఇలాంటి ఎన్నో వీడియోలు గతంలో వైరల్ గా (Viral video) మారాయి. తాజాగా, మరో ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. అడవిలోని చిరుతపులి జనావాసాల్లోకి ప్రవేశించింది. అప్పుడు అది.. అక్కడే ఉన్న బావిలో పడింది. దాని అరుపులు విన్న గ్రామస్థులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫారెస్టు అధికారులు రెస్కూ ఆపరేషన్ ప్రారంభించారు. చిరుత పులిని (leopard Rescue) సేవ్ చేయడానికి మొహెంజో దారో హరప్పన్ టెక్నాలజీని ఉపయోగించారు. దీనికోసం ఒక మంచానికి రెండు వైపులా తాడు కట్టి బావిలోకి దించారు. ఆ తర్వాత.. బావిలో పడిపోయిన పులిని మంచం మీదకు వచ్చేలా చేశారు. ఇరువైపులా తాడుతో గట్టిగా కట్టారు.
Another day.
Another rescue of leopard from open well using the Mohenjo Daro Harappan technology.
This will stop only when we close the open wells around animal habitat. pic.twitter.com/kvmxGhqWlf
— Susanta Nanda IFS (@susantananda3) June 25, 2022
ఆ తర్వాత.. మెల్లగా మంచాన్నిపైకి లాగారు. పైకి రాగానే చిరుతపులి వెంటనే బావిపైకి దూకింది. అక్కడి నుంచి అడవిలోకి పారిపోయింది. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం వివరాలు లేవు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నంద ఇటీవల తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్(Madhya pradesh)లోని ఇండోర్‌లో ఓ భర్త చేసిన పని తెలిసి భార్య ఆశ్చర్యపోయింది.
ఛోటా బంగార్డా ప్రాంతంలో నివసిస్తున్న రాజేష్ అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం బబిత అనే మహిళతో వివాహమైంది. 15 రోజుల క్రితం తండ్రి కూడా అయ్యాడు. అయితే భార్యను ప్రసవం కోసం ఆమె పుట్టింటికి పంపించిన భర్త తర్వాత ఖజ్రానా ప్రాంతానికి చెందిన మరో అమ్మాయితో కలిసి పారిపోయాడు. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని భార్యకు ఫేస్‌బుక్ ద్వారా తెలిసింది. దీంతో భర్తపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది బబిత. భర్త చాలా కాలంగా ముస్లిం అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య బబిత ఆరోపిస్తోంది. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. భర్త మోసం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని భార్య చెప్పింది. అంతే కాదు భర్త ఫోన్‌లో కూడా తనను బెదిరించాడని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Leopard attack, Trending video, Viral Video