అర్థరాత్రి గోడదూకి ఇంటికొచ్చిన చిరుత... ఎంత పని చేసిందంటే...

అర్థరాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించింది చిరుత. ఇంటి గేటు వేసి ఉండటంతో పక్కనే ఉన్న కాంపౌడ్ వాల్ ఎక్కి ఇంట్లోకి ప్రవేశించింది.

news18-telugu
Updated: September 17, 2019, 11:20 AM IST
అర్థరాత్రి గోడదూకి ఇంటికొచ్చిన చిరుత... ఎంత పని చేసిందంటే...
ఇంట్లోకి ప్రవేశించిన చిరుత
  • Share this:
ఈ మధ్య చిరుత పులులు ఇళ్లలోకి, ఏటీఎంలలోకి ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణ విషయంగా మారింది. తాజాగా కర్నాటకలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. శివమొగ్గ జిల్లా తిరుతాహల్లిలో అర్థరాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించింది చిరుత. ఇంటి గేటు వేసి ఉండటంతో పక్కనే ఉన్న కాంపౌడ్ వాల్ ఎక్కి ఇంట్లోకి ప్రవేశించింది. ఇంటి చుట్టూ ఉన్నా ఫ్రాంతంలో సంచరించింది. ఆ తర్వాత అక్కడున్న ఓ కుక్కపిల్లను నోటితో కరుచుకుంటూ... మళ్లీ గోడదూకి అక్కడ్నుంచి వెళ్లిపోయింది. సెప్టెంబర్ 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిరుత వచ్చిన విషయం అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో ఇప్పుడు ఈ న్యూస్ కూడా వైరల్‌గా మారింది.

ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ ఈ వీడియో తన ట్విట్టర్ ఎకౌంట్లో పోస్టు చేసింది. దీంతో ఇప్పుడు నెటిజన్లు ఈ ఘటనపై  రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ‘చిరుతపులి ఇంట్లోకి ప్రవేశించలేదు. మానవులు చిరుతపులి నివాస స్థలంలోకి ప్రవేశించి వారి ఇంటిని నిర్మించారు’ అని ట్వీట్ చేశారు. "చాలా విచారంగా ఉంది, కానీ దాని స్వభావం" అని చాలామంది నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.First published: September 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...