వనారణ్యంలో ఉండాల్సిన వన్య ప్రాణులు జనారణ్యంలోకి ప్రవేశిస్తున్నాయి. నగరాల్లో పెద్దపులులు సంచరిస్తున్నాయన్న వార్తలు ఈ మధ్య చదువుతున్నాం. తాజాగా.. కర్నాటకలో కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఒక చిరుత (leopard) లేడిస్ హాస్టల్ లోనికి ప్రవేశించడంతో అక్కడున్న విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. కర్నాటకలోని చామరాజ్నగర్ (chamarajanagar) లో ఈ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఓ మెడికల్ కాలేజీలో గల లేడిస్ హాస్టల్ లోకి ప్రవేశించిన పులి.. అక్కడ అటూ ఇటూ సంచరించింది. ఎవరూ కనిపించకపోయేసరికి అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చామరాజ్నగర్ లోని లేడిస్ హాస్టల్ లోకి బుధవారం రాత్రి ప్రవేశించిన చిరుత.. బిల్డింగ్ లో అటూ ఇటూ తిరుగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. అయితే రాత్రి సమయంలో చిరుత హాస్టల్ లోకి ప్రవేశించింది. ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్లిన చిరుత.. గదుల దగ్గరకు వెళ్ల చూసింది. ఆ సమయానికి విద్యార్థులంతా గదులకు తలుపులు వేసి పడుకున్నారు. బయట ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టైంది.
నానాటికీ అడవి కుచించుకుపోతుండటం.. అభివృద్ది పేరిట అరణ్యాలను నరికివేస్తుండటంతో అక్కడుండే జంతువులన్నీవేరే చోటకు తరలిపోతున్నాయి. దీంతో అడవిలో పెద్ద జంతువులైన పులి, సింహం వంటివాటికి ఆహారం కరువవుతున్నది. ఆకలికి తాళలేక అవి కూడా అడవిని వీడుతున్నాయి. జనారణ్యంలోకి వచ్చి ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇవి అడవుల పక్కనుండే గ్రామాల్లోనే గాక పట్టణాలకు కూడా వస్తుండటం గమనార్హం.
Published by:Srinivas Munigala
First published:January 07, 2021, 19:45 IST