చిరుత పక్కనే ఏనుగు... దర్జాగా గడ్డి తింటూ... వైరల్ వీడియో

జనరల్‌గా చిరుతల్ని చూడగానే... ఏనుగులు వామ్మో అనుకుంటూ పారిపోతాయి. ఇక్కడ మాత్రం చిరుతను చూసి కూడా ఏనుగు ఏమాత్రం భయపడలేదు.

news18-telugu
Updated: August 3, 2020, 2:49 PM IST
చిరుత పక్కనే ఏనుగు... దర్జాగా గడ్డి తింటూ... వైరల్ వీడియో
చిరుత పక్కనే ఏనుగు... దర్జాగా గడ్డి తింటూ... వైరల్ వీడియో (credit - twitter)
  • Share this:
అనగనగా అదో దట్టమైన అడవి. అక్కడో గుట్ట. దానిపై కొన్ని బండరాళ్లు. ఆ రాళ్లలో ఒకదానిపై సన్నటి చిరుతపులి. సేదతీరుతూ... దిక్కులు చూస్తూ... సైలెంట్‌గా ఉంది. ఇంతలో కొన్ని ఏనుగుల గుంపు అటుగా వచ్చింది. చిరుతపులిని చూసి... వామ్మో చిరుత... దానికి గానీ దొరికామంటే... చంపుతాది... వెళ్లిపోదాం పదండి పదండి... అని మిగతా ఏనుగులన్నీ మెల్లగా జారుకున్నాయి. ఓ ఏనుగు మాత్రం... చిరుతైతే నాకేంటి... నాకు కావాల్సిన గడ్డి అక్కడుంది. నేనది తింటాను అనుకుంటూ... చిరుత పక్కనే ఉన్న గడ్డి దగ్గరకు వెళ్లింది. తనను చూసి కూడా పారిపోలేదని చిరుత ఫీలవుతుందనుకుందో ఏమో... చిరుతను అసలు చూడనట్లే ఆ ఏనుగు గడ్డి తింటూ ఉంది. ఏనుగు అనుకున్నట్లే చిరుత దానివైపు గుర్రుగా చూసింది. ఏనుగు మాత్రం భయపడకుండా... "ఆ ఏంటి బిల్డప్ ఇస్తున్నావ్... రాయి మీద ఉన్నదానివి అలా ఉండు. నా తిండి నన్ను తిననియ్" అన్నట్లుగా ఓ చూపు చూసి... గడ్డిని పరపరా నమిలింది. ఈ వీడియో ఇప్పుడు అందరికీ తెగ నచ్చేస్తోంది.


ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సుశాంత నంద ఈ వీడియోని నెటిజన్లకు షేర్ చేశారు. జస్ట్ కొన్ని గంటల కిందటే పోస్టే చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 14వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 1.7 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇది వైరల్ అవుతోందని మనకు అర్థమవుతోంది.


చిరుతలకు రెండు ప్లస్ పాయింట్లు ఉంటాయి. అవి చాలా వేగంగా వేటాడగలవు. పైగా... చుట్టూ ఉన్న గడ్డి, తుప్పల్లో కలిసిపోగలవు. అందువల్ల అవి వెంటనే కనిపించవు. ఐతే.. చిరుతలు ఎప్పుడుబడితే అప్పుడు వేటాడవు. వాటికి ఆకలి వేసినప్పుడే వేటాడతాయి.


ఇక్కడ చిరుత సేదతీరుతోంది కాబట్టి... దానికి వేటాడే ఉద్దేశం లేదన్నమాట. అందుకే... ఆ ఏనుగులు ధైర్యంగా దాని దగ్గరకు వచ్చి ఆహారం తింటున్నాయి.


జంతు ప్రపంచంలో ఏన్నో వింతలు, ఆశ్చర్యాలు. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో... ఇలాంటివి మనం చూడగలుగుతున్నాం. ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తూ... ఆనందం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
Published by: Krishna Kumar N
First published: August 3, 2020, 2:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading