ఊళ్లోకి వచ్చిన చిరుతపులి... ఉరుకులు పరుగులు... వైరల్ వీడియో

సాధారణంగా పులులు ఊళ్లలోకి రావు. అది ఎక్కువగా తిరిగేందుకు ఇష్టపడవు. చిరుతపులులు మాత్రం కుదురుగా ఉండవు. అలా వచ్చిన ఆ చిరుత చుక్కలు చూపించింది.

news18-telugu
Updated: July 25, 2020, 10:06 AM IST
ఊళ్లోకి వచ్చిన చిరుతపులి... ఉరుకులు పరుగులు... వైరల్ వీడియో
ఊళ్లోకి వచ్చిన చిరుతపులి... ఉరుకులు పరుగులు... వైరల్ వీడియో (credit - twitter)
  • Share this:
అది ఉత్తరాఖండ్‌... దేవప్రయాగ్. అర్థరాత్రి సమయం. ఎప్పుడూ అడవిలో తిరిగే ఆ చిరుతపులికి... సరదాగా అలా దగ్గర్లోని ఊళ్లోకి వెళ్దామని అనిపించింది. రాత్రి ఎప్పుడవుతుందా అని ఎదురుచూసింది. చీకటి పడింది. ఓకే... అనుకుంటూ... చెట్లు, తుప్పలు, పొలాలూ... అన్నీ దాటుకుంటూ... ఊళ్లోకి వెళ్లింది. అక్కడో పోలీస్ స్టేషన్ ఉంది. దానివైపు చూసింది. "ఏంటిది... ఏమో... అనుకుంటూ ముందుకు వెళ్లింది. ఆ టైంలో... ఓ గేదె... చిన్నగా అరవడం చిరుతకు వినిపించింది. మంచి మెలోడీ సాంగ్ విన్నట్లుగా ఫీలైంది. నాకు దగ్గర్లోనే ఆహారం ఉంది. అది ఎక్కడుందో కనిపెడతా... తినేస్తా అనుకుంది. అటూ ఇటూ తిరగ్గా... అక్కడ ఓ పశువుల పాక కనిపించింది. ఆవులూ, గేదెలూ... విశ్రాంతి తీసుకుంటున్నాయి.

పాక దగ్గరకు వెళ్లిన చిరుత... నేను వచ్చినా ఇవి భయపడట్లేదేంటి? ఓసారి అరిస్తే సరి అనుకుంటూ... గాండ్రించింది. అంతే... నిద్రలోంచీ లేచిన గేదెలు, ఆవులూ... పీడకలలా భావించాయి. ఆకాశంలో చుక్కలు చక్కగా కనిపించాయి. బాబోయ్... అనుకుంటూ... ఒకటే పరుగు. అదీ లెక్క అనుకుంటూ... చిరుత వాటి వెనకాలే పరుగెత్తింది. ఆవులు, గేదెలూ... తలో దిక్కుకూ పారిపోయాయి. వాటి వెంట చిరుత పరుగెత్తిన దృశ్యాన్ని అక్కడి పోలీస్ స్టేషన్ సీసీటీవీ కెమెరా షూట్ చేసింది. గేదెల అరుపులు విని... ఓ పోలీస్... బయటకు వచ్చాడు. చిరుతను చూడగానే... మళ్లీ పోలీస్‌స్టేషన్‌ లోపలికి వెళ్లిపోయాడు.




ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి వైభవ్ సింగ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు ఒకింత ఎంటర్‌టైన్‌మెంట్ ఫీలవుతూ... ఒకింత భయపడుతున్నారు కూడా. ఇలా వన్యమృగాలు ఊళ్లలోకి వచ్చేస్తే ఎలా అన్నది వారి ప్రశ్న.



అడవుల పరిణామం తగ్గిపోతుండటం వల్లే ఆహారం కోసం వన్యమృగాలు పల్లెల్లోకి వస్తున్నాయనే వాదన కూడా ఉంది.
Published by: Krishna Kumar N
First published: July 25, 2020, 10:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading