సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్గా మారుతాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలను చూసేందుకు చాలా మంది ఇష్టపడతారు. తాజాగా బావిలో పడిపోయిన చిరుతపులి, పిల్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాలు.. ఆకలితో ఉన్న చిరుత పులి పిల్లిని వేటాడసాగింది. దీంతో పిల్లి పరుగులు తీసింది. చిరుతపులి(Leopard) ఎలాగైనా పిల్లిని చంపి తినాలనే ఉద్దేశంతో పరుగులు పెట్టింది. మరోవైపు పిల్లి(Cat).. చిరుత పులి నుంచి తప్పించుకునే కంగారులో బావిలో పడిపోయింది. అయితే దాని వెంబడించిన పులి కూడా బావిలో పడిపోయింది. ఈ ఘటన మహారాష్ట్ర(Maharashtra) నాసిక్(Nashik)లోని సిన్నార్ తాలూకాలోని కంకోరి గ్రామంలో చోటుచేసకుంది.
రాత్రి పూట చిరుతపులి, పిల్లి బావిలో పడినట్టుగా గ్రామస్తులు తెలిపారు. బావి లోతుగా ఉండటం, పైకి రావడానికి ఎలాంటి ఆధారం లేకపోవడంతో అవి రెండు కూడా అక్కడే చిక్కుకుని పోయాయి. ఇక, తెల్లవారుజామున చిరుత పులి అరుపులు విన్న గ్రామస్తులు బావి వద్దకు చేరుకున్నారు. బావిలో చిరుత, పిల్లి పడి ఉండటం గమనించారు. బావిలోని(well) దృశ్యాలను కొందరు గ్రామస్తులు తమ ఫోన్లలో వీడియో తీయడం మొదలుపెట్టారు. మరోవైపు బావిలో చిరుత, పిల్లి పడిపోయినట్టుగా గ్రామస్తులు పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
Sad: చిన్నారి అల్లరి చూసి మురిసిపోయిన తల్లిదండ్రులు.. కానీ ఇంతలోనే ఎవరూ ఊహించని విధంగా..
ఇక, బావిలో నీళ్లలో పడిపోయిన పిల్లి బావిలోపలి గట్టుపైకి చేరింది. అక్కడి నుంచి వెళ్లే దారిలేకపోవడంతో భయపడుతూ కనిపించింది. ఇక, చిరుతపులి కూడా నీళ్లలోంచి బావిలోపలి గట్టుపైకి చేరింది. పిల్లిపై దాడి చేసేందుకు చూసింది. అయితే పిల్లి భయంతోనే చిరుత ముందు అమాయకంగా(Leopard Cat Come Face to Face) నిల్చుంది. అయితే చిరుత ఏమనుకుందో తెలియదు కానీ.. పిల్లిని ఏమి చేయకుండా వదిలేసింది. ఆ తర్వాత చిరుత, పిల్లి ఒకదానితో ఒకటి దగ్గరగా ఉండసాగాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో(Social Media) వైరల్గా మారింది. ఈ ఫన్నీ వీడియోను చూసేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు.
#WATCH | Maharashtra: A leopard and a cat come face-to-face after falling down a well in Nashik
"The leopard fell in the well while chasing the cat. It was later rescued and released in its natural habitat," says Pankaj Garg, Deputy Conservator of Forests, West Nashik Division pic.twitter.com/2HAAcEbwjy
— ANI (@ANI) September 6, 2021
Only a cat knows how to deal with a big cat ? https://t.co/SLY9Vv3QzN
— Pawan Dalal ?? (@_pd5) September 6, 2021
ఇక, ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు.. చిరుతను, పిల్లిని బావి నుంచి వెలికి తీశారు. అనంతరం చిరుతను సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. ‘పిల్లిని చిరుత వేటాడుతున్న సమయంలో.. రెండు బావిలో పడిపోయాయి. ఆ తర్వాత వాటిని రక్షించడం జరిగింది’అని పశ్చిమ నాసిక్ డివిజన్ డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పంకజ్ గార్గ్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cat, Leopard, Maharashtra, Viral Video