ఇంటికొచ్చి మరీ కుక్క మీద దాడి చేసిన చిరుత...

నిద్రపోతున్న కుక్కను గాండ్రించి లేపింది. చిరుతను చూసిన కుక్క దానిపై తిరగబడడానికి ప్రయత్నించింది.

news18-telugu
Updated: October 11, 2019, 6:02 PM IST
ఇంటికొచ్చి మరీ కుక్క మీద దాడి చేసిన చిరుత...
కుక్కమీద దాడి చేస్తున్న చిరుత
  • Share this:
అది హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా. తెల్లవారుజామున 4గంటలు అవుతుంది. ఓ ఇంటి బయట కుక్క నిద్రపోతోంది. పక్కనే మెట్లు ఉన్నాయి. ఓ చిరుత ఆ మెట్లు ఎక్కి కుక్క వద్దకు వచ్చింది. నిద్రపోతున్న కుక్కను గాండ్రించి లేపింది. చిరుతను చూసిన కుక్క దానిపై తిరగబడడానికి ప్రయత్నించింది. అయితే, చిరుత బలం ముందు కుక్క బలం సరిపోలేదు. వెంటనే చిరుతపులి.. ఆ కుక్క మెడ పట్టుకుని నొక్కిపట్టింది. గట్టిగా అరుస్తూ కుక్క విలవిల్లాడింది. అంతలోనే ఏదో అలికిడి అయినట్టు అనిపించడంతో ఆ కుక్క మెడను అలాగే పట్టుకున్న చిరుత.. వెంటనే మెట్లు దిగి పారిపోయింది. ఆ ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.

సిమ్లాలో చిరుతపులి ఎత్తుకెళ్లిన ఆ కుక్క యజమాని నరేంద్ర ఠాకూర్.. ఈ విషయంపై అటవీశాఖకు ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతంలో చిరుత సంచరిస్తూ ప్రజల మీద కూడా దాడి చేసింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నాయి. అయితే, కుక్క మీద చిరుత దాడికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు దాలేదని, జిల్లా అటవీ శాఖ అధికారి రాజేష్ కుమార్ తెలిపారు. అయితే, ఆ ప్రాంతంలో చిరుతలు వస్తూనే ఉంటాయన్నారు. దాన్ని పట్టుకోవడానికి పంజరం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Published by: Ashok Kumar Bonepalli
First published: October 11, 2019, 6:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading