మనకు ఆకలేస్తే.. ఇంట్లో వండిన భోజనాన్ని.. ప్లేటులో పెట్టుకొని ఎంచక్కా తింటాం. లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని లాగించేస్తాం. మరి అడవుల్లో ఉండే జంతువల పరిస్థితేంటి? శాకాహారం తినే జంతువులు ఆకులో, పండ్లనో తిని బతుకుతాయి. కానీ మాంసాహర జంతువులు అలా కాదు. వాటి ఆకలి తీరాలంటే వేటాడం తప్పనిసరి. తమ కన్నా చిన్న జీవులను చంపుకు తినాలి. ఇక, నీటిలో మొసళ్లు రారాజులైతే, భూభాగంలో చిరుతలు ఇతర ప్రాణులను వేటాడంలో దిట్ట. అయితే ఓ భారీ మొసలిని చిరుతపులి వేటాడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆ వీడియోలో.. ఓ నది ఒడ్డున మొసలి హాయిగా నిద్రిస్తోంది. దీనిని గమనించిన చిరుత మొసలిని వేటాడేందుకు బయలుదేరింది. నీళ్లలో నుంచే నెమ్మదిగా.. శబ్దం చేయకుండా ఒడ్డున నిద్రిస్తున్న మొసలి వద్దకు చేరింది. వెంటనే దాని వెనకాల నుంచి పట్టుకుంది. మొసలి నీళ్లలోకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. చిరుత భారీ నుంచి తప్పించుకుని నీళ్లలోకి దూకాలని చూసింది. అయతే చిరుత మాత్రం పట్టువిడవలేదు. మొసలిని నోటితో బలంగా పట్టుకుని ఒడ్డుకు తీసుకువచ్చింది. ఆ తర్వాత మొసలిని నోటిలో పెట్టుకునే అవతలి నది అవతలి వైపు వెళ్లడానికి బయలు దేరింది.
شاهد كيف الجاكوار يصطاد التمساح حيث انقض الجاكوار بكل خفة و تسديد على التمساح فلم يعد الاخير قادرا على ان يحرك ساكناً.
قوة و شجاعة و ثقة في الهجوم#غرائب_الحيوانات pic.twitter.com/e1YalSenTM
— غرائب الحيوانات (@aw_206) February 10, 2021
Hyderabad: పదిరోజుల్లో పెళ్లి.. కుటుంబం మొత్తం పెళ్లి పనుల్లో బిజీ.. పాపం అంతలోనే..
@aw_206 ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. 32 సెకండ్ల నిడివి గల ఈ వీడియోలో చిరుత చాలా ధైర్యంగా మొసలిపై విరుచుకుపడింది. ఇప్పటికే చాలా మంది ఈ వీడియోను వీక్షించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Leopard, Viral Video