900 ఏళ్ల తర్వాత తిరిగి నిలబడుతున్న పీసా టవర్

మధ్యయుగం నాటి టవర్. పీసాల శక్తిసామర్థ్యాలకు నిదర్శనం. 1173లో నిర్మాణం చేపట్టాక ఓ పక్కకు ఒరిగింది. దాన్ని నిలబెట్టేందుకు జరుగుతున్న ఇంజినీరింగ్ పనులు ఇప్పుడిప్పుడే సత్ఫలితాలనిస్తున్నాయి. పీసా టవర్ తిరిగి నిలబడుతోంది.

news18-telugu
Updated: November 24, 2018, 12:18 PM IST
900 ఏళ్ల తర్వాత తిరిగి నిలబడుతున్న పీసా టవర్
పీసా టవర్ (ఫైల్ ఫొటో)
  • Share this:
శతాబ్దాల నాటి అద్భుతమైన టవర్ కూలిపోతుందంటే ఎవరికైనా మనసొప్పదు. చరిత్రకు సాక్ష్యంగా నిలిచే పురాతన కట్టడాల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత.

ఇటలీలోని పీసా టవర్ మాత్రం నిర్మాణ దశ నుంచే ఓ పక్కకు ఒరుగుతూ ఉంది. కారణం ఏ భూకంపమో కాదు. దీని పునాదిలో ఓవైపు భూమి గట్టిగా లేదు. దీన్ని కొంతవరకూ నిర్మించిన తర్వాతే ఆ విషయాన్నిగ్రహించారు.

పీసా టవర్ (ఫైల్ ఫొటో)
పీసా టవర్ (ఫైల్ ఫొటో)


ఏం జరిగినా సరే, నిర్మించి తీరాలనే ఆదేశాలు రావడంతో నిర్మాణం కొనసాగింది. రెండు వందల ఏళ్ల తర్వాత, 14వ శతాబ్దంలో నిర్మాణం పూర్తైంది. అదే సమయంలో దీని వంపు కూడా ఎక్కువైంది. 14,500 మెట్రిక్ టన్నుల బరువు ఉండటం వల్ల, రాన్రానూ ఒంగిపోతుంటే, ఇంజినీర్లు దృష్టి సారించారు. మరింత పడిపోకుండా జాగ్రత్త పడ్డారు. 20, 21వ శతాబ్దంలో టెక్నాలజీ, ఈ ప్రాచీన కట్టడాన్ని నిలబెట్టేందుకు ఉపయోగపడుతోంది.నిజానికి పక్కకు ఒరగడం వల్లే, ఈ టవర్ ప్రపంచ గుర్తింపు పొందింది. లీనింగ్ పీసా టవర్‌గా దీన్ని పర్యాటకులు పిలుస్తున్నారు. 296 మెట్లు, ఏడు అంతస్థులతో అద్భుతంగా ఉంటుందీ నిర్మాణం. 1993 నుంచీ 2001 వరకూ ఈ టవర్‌ని కాపాడేందుకు ఓ అంతర్జాతీయ కమిటీ పనిచేసింది. 186 అడుగుల ఎత్తైన ఈ నిర్మాణాన్ని తిరిగి యథాస్థితిలో నిలబెట్టేందుకు ప్రయత్నించింది. ఈ కాలంలో 45 సెంటీమీటర్లు వంపును తగ్గించారు. ఇందుకు 18 వందల కోట్ల రూపాయలు ఖర్చైంది. ఆ తర్వాత 2001లో ఏర్పడిన సర్వేలెన్స్ గ్రూప్... ఈ అద్భుత కట్టడాన్ని 17 ఏళ్ల పాటూ పరిశీలించింది. తాజాగా మరో 4 సెంటీమీటర్లు సరిచేశారు.

పీసా టవర్ (ఫైల్ ఫొటో)
పీసా టవర్ (ఫైల్ ఫొటో)


ప్రస్తుతం ఈ టవర్ 15 అడుగుల దూరం ఒరిగిపోయి ఉంది. 1990 జనవరి నుంచీ దీని‌ దగ్గరకు పర్యాటకులను నిషేధించారు. దశాబ్దం తర్వాత 2001 నుంచీ దరిదాపుల్లోకి వెళ్లనిస్తున్నారు. రోజూ వేల మంది టూరిస్టులు దూరం నుంచే ఈ టవర్‌ని చూస్తూ, ఫొటోలు తీసుకుంటున్నారు. టెక్నాలజీ  పెరుగుతున్న కొద్దీ ఈ నిర్మాణాన్ని సరిచేయగలమన్న నమ్మకం ఇంజినీర్లలో పెరుగుతోంది. ఎప్పటికైనా దీన్ని తిన్నగా నిలబెట్టి, నైపుణ్యాన్ని చాటుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు.
First published: November 24, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు