Home /News /trending /

LAWYER KICKED SLAPPED ON ROAD IN KARNATAKA NO ONE COMES TO HELP HER VIDEO GOES VIRAL PAH

OMG: నడిరోడ్డు మీద మహిళ లాయర్ ఉరికించి తన్నాడు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..

మహిళ లాయర్ పై దాడి

మహిళ లాయర్ పై దాడి

Karnataka: ఒక వ్యక్తి నడిరోడ్డుమీద బీభత్సం సృష్టించాడు. మహిళా లాయర్ ను పట్టుకుని విచక్షణ రహితంగా కొడుతూ, తన్నుకుంటూ దారుణంగా ప్రవర్తించాడు.

    ఒక వ్యక్తి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ప్రవర్తించాడు. మహిళ అని కూడా చూడకుండా చెంపదెబ్బలు కొడుతూ.. కాలితో తన్నుకుంటూ, ఆమెపై విచక్షణ రహితంగా దాడిచేశాడు.ఈ ఘటన కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లాలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

    పూర్తి వివరాలు.. కర్ణాటకలోని (Karnataka) బాగల్ కోట్ జిల్లాల వినాయక్ నగర్ ప్రాంతంలో దారుణం జరిగింది. మహేంతేష్ అనే వ్యక్తి, తన సంగీత అనే మహిళ లాయర్ (Lawyer attack) మీద నడిరోడ్డుమీద దాడిచేశాడు. ఆమెను చెంపల మీద కొడుతూ.. కాలితో తన్నుతూ అమానుషంగా ప్రవర్తించాడు. ఆమె వద్దని వారిస్తున్న,  ఆపడానికి ప్రయత్నిస్తున్న ఏమాత్రం వెనక్కు తగ్గట్లేదు. మహిళ.. స్టూల్ తో అతడిని ఆపడానికి ప్రయత్నించిన అది సాధ్యపడలేదు.


    అతగాడి పశుబలం ముందు మహిళ, అచేతనంగా మారింది. అక్కడున్న వారు ఎవరు అతగాడిని ఆపే సాహసం మాత్రం చేయడం లేదు. కాగా, లాయర్ సంగీత, మహంతేష్ ను సివిల్ కేసులో ఇబ్బందులకు గురిచేసిందని అతను కోపం పెంచుకున్నాడు. అదను కోసం ఎదురు చూసి దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.

    షాపులో మహిళా దొంగతనం చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

    ఒక షాపులో (Shop counter)  కొందరు కౌంటర్ దగ్గర బిల్ కడుతున్నారు. ఒక మహిళ మెడలో బ్యాగ్ వేసుకుని కౌంటర్ దగ్గర నిలబడి, షాపు యజమని తో మాట్లాడుతుంది. ఇంతలో మరోక మహిళ బయట నుంచి గాబరాగా వచ్చింది. షాపులోకి వస్తూనే కౌంటర్ దగ్గర ఉన్న మహిళను ఢీకొట్టింది. ఆమెకు తెలియకుండానే బ్యాగు జీప్ తెరచింది. పాపం.. ఇది తెలియని మహిళ ఏదో.. తోపులాటలో మహిళ దూసుకొచ్చిందని అనుకుంది.

    ఆ తర్వాత.. షాపు యజమానితో ఏదో అడుగుతున్నట్లు మాట్లాడుతూ.. మరో చేతితో మహిళ బ్యాగులోనుంచి (Woman steals money) డబ్బును మెల్లగా తీసి, మహిళ తన బ్యాగులో వేసుకుంది. ఆ తర్వాత.. మెల్లగా అక్కడి నుంచి చెక్కెసింది. అయితే, మహిళ నిర్వాకం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో (cc camera)  రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ఆంటీ క్యా బాత్ హై.. నీది మాములు తెలివి కాదుగా అంటూగా కామెంట్ లు పెడుతున్నారు.
    Published by:Paresh Inamdar
    First published:

    Tags: Karnataka, Viral Video

    తదుపరి వార్తలు