పెళ్లికూతురు లేకుండా పెళ్లి... గుండెల్ని పిండేసే కథ

పెళ్లికూతురు లేని పెళ్లి కదా అని ఏదో మమ అనిపించలేదు. పెళ్లి వేడుక ఎంత ఘనంగా ఉంటుందో ఈ పెళ్లి కూడా అంతే గ్రాండ్‌గా జరిగింది. బంధువులు, అతిథులతో ఆ ఇల్లు కళకళలాడింది.

Santhosh Kumar S | news18-telugu
Updated: May 13, 2019, 5:18 PM IST
పెళ్లికూతురు లేకుండా పెళ్లి... గుండెల్ని పిండేసే కథ
పెళ్లికూతురు లేకుండా పెళ్లి... గుండెల్ని పిండేసే కథ (image: ANI)
  • Share this:
ఆ పెళ్లికి బంధుమిత్రులందర్నీ పిలిచారు. మెహెందీ దగ్గర్నుంచి సంగీత్ వరకు గుజరాతీ సంప్రదాయ పెళ్లిళ్లలో కనిపించే వేడుకలన్నీ జరిపించారు. విందు భోజనాలు ఏర్పాటు చేశారు. వినోద కార్యక్రమాలకు లోటే లేదు. ఘనంగా పెళ్లి చేశారు. అంతే ఘనంగా బారాత్ కూడా తీశారు. అసలు ఇంత గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలని ఆ పెళ్లికొడుకు ఎప్పట్నుంచో కలలు కంటున్నాడు. ఆ కల నిజమైంది. కానీ ఒక్కటే లోటు. ఆ పెళ్లిలో పెళ్లికూతురు లేదు. అవును... ఆ పెళ్లిలో పెళ్లికూతురు లేదు. పెళ్లి కూతురు లేకుండా జరిగిన పెళ్లి అది. అదేదో సరదా కోసం జరిగిన పెళ్లి కాదు. డబ్బులు ఎక్కువై జరిపించిన వేడుక కాదు. ఆ పెళ్లి వెనుక గుండెల్ని పిండేసే కథ ఒకటుంది.

ఆ యువకుడి పేరు అజయ్ బరోత్. గుజరాత్‌లోని హిమ్మత్‌నగర్‌వాసి. కొద్ది రోజుల క్రితం చుట్టాల్లో ఓ అబ్బాయికి ఘనంగా పెళ్లైంది. ఆ పెళ్లి చూసిన అజయ్... తను కూడా అలాగే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఆ విషయాన్ని తన తండ్రితో చెప్పాడు. కొడుకు మాట విన్న తండ్రి అవాక్కయ్యాడు. తన కొడుకుకు పెళ్లి సంబంధం ఎక్కడ చూడాలని ఆవేదన చెందాడు. ఆ తండ్రి ఆవేదనకు కారణం కొడుకులో ఉన్న లోపమే. అజయ్ చిన్ననాటి నుంచి బుద్ధి మాంద్యంతో బాధపడుతున్నాడు. అంటే శారీరకంగా ఎదిగినా మానసికంగా ఎదగని స్థితి అతనిది. అజయ్ వయస్సు 27 ఏళ్లు. అతనికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేందుకు ఎవరూ ముందుకు రారని కుటుంబ సభ్యులకు తెలుసు. కానీ అతనికేమో ఘనంగా పెళ్లి చేసుకోవాలని ఉంది. ఎంత ఖర్చయినా పర్లేదు అతని కోరిక నెరవేర్చాలని తండ్రి సంకల్పించాడు. మే 10న పెళ్లి వేడుక జరిపించాడు.

అజయ్ మానసిక వికలాంగుడు. అతనికి ఎవరూ పిల్లనివ్వరని తెలుసు. కానీ చిన్నప్పటి నుంచి అతనికి పెళ్లి చేసుకోవాలనుంది. చాలామంది పెళ్లిళ్లకు వెళ్లేవాడు. అక్కడ సంతోషంతో డ్యాన్సులు చేసేవాడు. అందుకే తనకు కూడా అలాగే పెళ్లి జరిపించాలని అడిగాడు.
కమ్లేష్ బరోత్, అజయ్ అంకుల్


పెళ్లికూతురు లేని పెళ్లి కదా అని ఏదో మమ అనిపించలేదు. పెళ్లి వేడుక ఎంత ఘనంగా ఉంటుందో ఈ పెళ్లి కూడా అంతే గ్రాండ్‌గా జరిగింది. బంధువులు, అతిథులతో ఆ ఇల్లు కళకళలాడింది. కార్డులు ప్రింట్ చేసి 800 మందికి పంచారు. రెండుమూడు రోజులు ఆ ఇంట్లో పెళ్లి సందడి కనిపించింది. మెహందీ, సంగీత్, గర్భా డ్యాన్సులు... గుజరాత్ సంప్రదాయ వేడుకలన్నీ కనిపించాయి ఈ పెళ్లిలో. సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేసి మరీ వేడుక జరిపించారు. అజయ్ తండ్రి గుజరాత్ ఆర్టీసీలో కండక్టర్. కొడుకు సంతోషం కోసం ఏకంగా రూ.2 లక్షలు ఖర్చు పెట్టి మరీ పెళ్లి వేడుక జరిపించడం విశేషం. ఇంత ఘనంగా పెళ్లి జరిగింది కాబట్టి ఇప్పుడు అజయ్ కూడా సంతోషంతో ఉన్నాడు.

తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఇక్కడ తెలుసుకోండి

ఇవి కూడా చదవండి:

ICC World Cup: ఊబెర్‌ బుకింగ్స్‌తో వరల్డ్ కప్‌కు వెళ్లే ఛాన్స్... కాంటెస్ట్ వివరాలివే

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 11 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

PAN Card: పాన్ కార్డు దరఖాస్తులో చేయకూడని 10 తప్పులివే...
First published: May 13, 2019, 5:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading