ప్రపంచ అతిపెద్ద అణు విచ్చిత్తి ప్రాజెక్ట్ నిర్మాణం... ఇవీ విశేషాలు

భారత్, చైనా, అమెరికా, రష్యా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా కలిసి ఈ ప్రాజెక్టు చేపట్టాయి. నిర్మాణ ఖర్చును అన్ని దేశాలూ భరిస్తాయి.

news18-telugu
Updated: July 29, 2020, 8:09 AM IST
ప్రపంచ అతిపెద్ద అణు విచ్చిత్తి ప్రాజెక్ట్ నిర్మాణం... ఇవీ విశేషాలు
ప్రపంచ అతిపెద్ద అణు విచ్చిత్తి ప్రాజెక్ట్ నిర్మాణం... ఇవీ విశేషాలు (credit - twitter - Nazar Bruineman)
  • Share this:
ప్రపంచంలోనే అతి పెద్ద న్యూక్లియర్ ఫ్యూషన్ (అణు విచ్చిత్తి లేదా.... అణు సంలీనం లేదా అణు సమ్మేళనం) ప్రాజెక్టు ITER అసెంబ్లింగ్ దశ ప్రారంభమైంది. ఐదేళ్లపాటూ ఈ అసెంబ్లింగ్ కొనసాగనుంది. ఇది పూర్తైన తర్వాత... ఈ ప్రాజెక్టు నుంచి సూపర్ హాట్ ప్లాస్మా ఉత్పత్తి అవుతుంది. దీని ద్వారా అణు విద్యుత్తు తయారవుతుంది. ప్లాస్మా అనేది పదార్థానికి నాలుగో రూపం. సూర్యుడిపై ఉండే పదార్థం ఈ ప్లాస్మానే. అది అత్యంత వేడిగా ఉంటుందని మనకు తెలుసు. అలాంటి ప్లాస్మాను ఉత్పత్తి చేయడానికి ఈ భారీ ప్రాజెక్టును భారత్, చైనా, అమెరికా, రష్యా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా కలిసి చేపట్టాయి. నిర్మాణ ఖర్చును అన్ని దేశాలూ భరిస్తాయి. దక్షిణ ఫ్రాన్స్‌లోని... సెయింట్ పాల్ లెజ్ డ్యూరాన్స్ దగ్గర ఈ నిర్మాణం సాగుతోంది. ఇందుకు అయ్యే ఖర్చు రూ.1,75,909 కోట్లు.

ప్రస్తుతం ఉన్న విధానాలతో కరెంటు ఉత్పత్తి వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతోంది. అదే న్యూక్లియర్ పవర్ అయితే... చాలా పరిశుభ్రమైనది. అన్‌లిమిటెడ్ పవర్ వస్తుంది. తద్వారా వాతావరణ సమస్యలకు చెక్ పెట్టినట్లవుతుంది. ప్రస్తుతం అణు విద్యుత్‌ను న్యూక్లియర్ ఫిష్షన్ (Nuclear Fission లేదా అణు విభజన) ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. దీనికి పూర్తి విరుద్దమైనది అణువిచ్చిత్తి విధానం. ఇందులో తేలికపాటి మూలకాల్ని కలిపి... బరువైన మూలకాన్ని తయారుచేస్తారు. ఇందుకోసం అణువుల్ని కలుపుతారు. సూర్యుడిపై ఇదే జరుగుతోంది. చాలా తక్కువ రేడియో ధార్మికతతో... చాలా ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.


అణు విచ్చిత్తి రియాక్షన్లను తట్టుకోవడానికి తోకమార్క్ అనే భారీ నిర్మాణం చేపడుతున్నారు. అణు సంలీనం అనేది వాణిజ్యపరంగా కలిసొస్తుందా లేదా అనే అంశాన్ని ఈ ప్రాజెక్టు ద్వారా తెలుసుకోనున్నారు. ఈ ప్రయత్నం ద్వారా ప్రపంచ దేశాలన్నీ ఓ మంచి విషయం కోసం ఒక్కటవుతున్నాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూయెల్ మాక్రోన్ తెలిపారు. 2025లో నిర్మాణం పూర్తై... ప్లాస్మా ఉత్పత్తి మొదలవ్వనుంది. ఇది విజయవంతమైతే... ప్రపంచమే మారిపోతుందని అంటున్నారు. భవిష్యత తరాలకు క్లీన్ ఎనర్జీని ఇవ్వొచ్చంటున్నారు. ఐతే... సరిపడా ఎనర్జీని ఉత్పత్తి చెయ్యకపోతే... ఈ ప్రాజెక్టు వాణిజ్యపరంగా లాభసాటి కాదు. టెక్నికల్ సవాళ్లు కూడా ఉన్నాయి. అన్నింటినీ అధిగమిస్తామని నిపుణులు చెబుతున్నారు.
Published by: Krishna Kumar N
First published: July 29, 2020, 8:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading