Video: బరితెగించిన మొసలి.. చికెన్ వేస్తుంటే ఏం చేసిందో తెలుసా?

Video: బరితెగించిన మొసలి.. చికెన్ వేస్తుంటే ఏం చేసిందో తెలుసా? (image credit - facebook)

Viral Video: మొసళ్లకు ఓ ప్రత్యేక అలవాటు ఉంటుంది. అవి ఏ ఆహారాన్నైనా ప్రశాంతంగా తీసుకోవు. చటుక్కున పట్టుకుంటాయి. ఎందుకంటే... అవి వేటాడుతున్నట్టుగా... పారిపోతుంటే పట్టుకున్నట్టుగా ఫీలవుతాయి.

  • Share this:
    Viral Video: మనం రకరకాల షాకింగ్ వీడియోలు చూస్తుంటాం. ఇది కొద్దిగా అలాంటిదే. మరీ భయపెట్టేది కాదు. నెక్ట్స్ ఏం జరుగుతుంది అని అనుకునేలా ఉంది ఈ 4 నిమిషాల వీడియో. ఇది కాలిఫోర్నియాలోని... ఫౌంటేన్ వ్యాలీ రెప్టైల్ జూ. ఈ జూలో మొసళ్లను ఎన్‌క్లోజర్లలో ఉంచి.. వాటికి రోజూ మాంసాన్ని ఆహారంగా పెడతారు. ఐతే... మొసళ్లు ఏ రోజూ ఆ ఎన్‌క్లోజర్ దాటి వచ్చేవి కావు. తాజాగా ఓ మొసలి తెగించింది. ఎప్పుడూ ఇందులోంచే తీసుకోవాలా... బయటకు వెళ్తే ఏమవుతుంది అనుకుందేమో... ఎన్‌క్లోజర్ లోంచీ కిందకు దూకేసింది. అనుకుంది. జూ స్టాఫ్‌లోని ఓ మహిళ ఆహారం వెయ్యడానికి రాగానే... నాకే ముందు అంటూ ముందుకు ఉరికి... కిందకు దూకేసింది.

    అది చిన్న మొసలి కాదు 8.5 అడుగులది. పేరు డార్త్ గేటర్. చాలా తెలివైనది. ఆమెపై దాడి చేసేందుకు అది రెడీ అయ్యింది. దీనికి మూడు పూజలా మూడు కోళ్లను పెడతారు. దీని బరువు.. 45 కేజీలు.

    ఇందులో ఆహారం వేయడానికి వచ్చిన మహిళ ఎవరో కాదు జూ ఓనర్ కూతురే. ఆమె పేరు జూలియట్ బ్రూవెర్. ఆకలితో నకనకలాడుతున్న మొసళ్ల దగ్గరకు వెళ్లిన ఆమె ఎంతో ధైర్యంగా వాటికి ఆహారం పెట్టింది. గ్లాస్ స్లైడ్ విండో తెరిచి... చికెన్ పెట్టబోతే... లోపలున్న 2 మొసళ్లు ఆవురావురు మంటూ ఎగబడ్డాయి. చికెన్ పెట్టేలోపే డార్త్ గేటర్ చాలా ముక్కలు లాగేసుకుంది.

    ఆ వీడియోని ఇక్కడ చూడండి.

    ఇది కూడా చదవండి: Death Clock: డెత్ క్లాక్.. ఇచ్చట మరణం ఎప్పుడో చెప్పబడును!

    ఇదంతా జరిగాక... జూలియట్ తండ్రి జే బ్రూవర్ ఎంటరై... మొసలిని తెలివిగా పట్టుకొని తిరిగి ఎన్‌క్లోజర్‌లో పడేసారు. దాంతో ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. జూ అధికారులు ఈ వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడీ బరితెగించిన మొసలిని చూసేందుకు పర్యాటకులు బాగా వస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: