జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం ఎంత గొప్ప విషయమో బిహార్ (Bihar)మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ (Lalu prasadyadav)పెద్ద కుమార్తెను చూస్తేనే అర్ధమవతుంది. తండ్రికి తన కిడ్నీ దానం చేసిన కూతురుగానే కాకుండా సమాజంలో బాధ్యత కలిగిన మహిళగా అందరికి ఆదర్శంగా నిలిచారు రోహిణి ఆచార్య(Rohini acharya). వృద్ధాప్యంలో ఉన్న తండ్రికి తన కిడ్నీ (Kidney)దానం చేసి ప్రేమానురాగానికి చక్కని నిదర్శనమిచ్చిన రోహిణి ఆచార్య అందరికి ఆదర్శమే కాదు ఆమె చేసిన త్యాగాన్ని అభినందిస్తూ సోషల్ మీడియా(Social media)లో ప్రశంసిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు రోహి ఆచార్య సోషల్ మీడియాలో ట్రెండింగ్ పర్సన్(Trending person)గా నిలిచారు.
లాలూజీ బేటీ..
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేజీ నేత లాలూ ప్రసాద్ గత కొంతకాలంగా యాదవ్ కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. వైద్యులు ఆయన్ని పరీక్షించి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని సూచించారు. అయితే ఈవిషయంలో లాలూ ప్రసాద్ యాదవ్‌కి కిడ్నీ దానం చేయడానికి ఆయన పెద్ద కుమార్తె రోహిణి ఆచార్య ముందుకొచ్చారు. సింగపూర్‌లో నివసిస్తున్న రోహిణి ఆచార్య వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రికి కిడ్నీ దానం చేయడానికి నిర్ణయించుకోవడం గొప్ప విషయంగా ఆర్జేడీ నేతలు, లాలూ అభిమానులు, సోషల్ మీడియా ఫాలోవర్స్ భావించారు.
ట్రెండింగ్‌లో నిలిచిన రోహిణి ఆచార్య..
లాలూప్రసాద్ యాదవ్‌కి సోమవారం కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్ డాక్టర్లు రోహిణి ఆచార్య కిడ్నీని తీసి..ఆమె తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కి అమర్చారు. ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. కిడ్నీ డోనార్ రోహిణి ఆచార్యతో పాటు ఆమె తండ్రి లాలూ ప్రసాద్ ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో తన తండ్రికి కొత్త జీవితాన్ని ప్రసాధించిన కూతురు అంటూ రోహిణి ఆచార్యను పొగిడేస్తున్నారు. అంతే కాదు సోషల్ మీడియాలో ట్రెండింగ్ పర్సన్‌గా నిలిచారు రోహిణి ఆచార్య.
తండ్రికి కిడ్నీ దానం చేసిన తనయ..
సింగపూర్‌లోనే ఉంటున్న రోహిణి ఆచార్య ఈ ఆపరేషన్‌కి ముందు కూడా బీహార్ రాజకీయాలను పర్యవేక్షించడం, సమస్యలను సోషల్ మీడియా ద్వారానే ప్రశ్నించడం వంటివి చేస్తూ వచ్చారు. బీజేపీ పాలకులపై పలుమార్లు విమర్శలు కూడా చేశారు రోహిణి ఆచార్య. అయితే ఇంతకాలం ఆమె ఓ సోషల్ మీడియా ఫాలోవర్‌గానే ఉన్నారు తప్ప ఎప్పడూ అంతగా గుర్తింపు రాలేదు. కాని ఇప్పుడు తన తండ్రికి కిడ్నీ దానం చేసిన కూతురుగా అందరికి పరిచయం కావడమే కాకుండా ...ట్రెండింగ్ పర్సన్‌గా నిలిచారు రోహిణి ఆచార్య.
త్యాగం ఆదర్శప్రాయమని కితాబు..
లాలూ ప్రసాద్ యాదవ్ కోసం కూతురు రోహిణి ఆచార్య చేసిన త్యాగాన్ని భోజ్‌పూరి యాక్టర్ ఖేసరి లాల్‌యాదవ్ అభినందించారు. తండ్రికి కిడ్నీ దానం చేసి రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచిందంటూ కితాబిచ్చారు. బీజేపీ నాయకుడు, అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ సైతం రోహిణి ఆచార్య సేవను ప్రశంసించారు. రోహిణి తన తండ్రి కంటే గొప్ప పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. లాలూజీ దేశ్‌కి నేత అని ఆయన త్వరగా కోలుకోవాలంటూ దేవుడ్ని ప్రార్ధిస్తున్నట్లుగా ట్వీట్ చేశారు. ఇక సోషల్ మీడియా ఫాలోవర్స్, ఆర్జేడీ నాయకులు రోహిణి ఆచార్య భేటీ బచావో భేటీ పడావో ప్రచారానికి ఉదాహరణగా నిలిచారంటూ ట్వీట్లు చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ అభినందనలు తెలుపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar News, Lalu Prasad Yadav, National News