హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Trending news: కబడ్డీ కలిపిన ప్రేమజంట .. పెళ్లి చేసుకునేందుకు ఆ ఇద్దరు ఆడవాళ్లు ఏం చేశారో తెలుసా..?

Trending news: కబడ్డీ కలిపిన ప్రేమజంట .. పెళ్లి చేసుకునేందుకు ఆ ఇద్దరు ఆడవాళ్లు ఏం చేశారో తెలుసా..?

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Trending news:ఆమె ఓ లేటీ టీచర్. కాని స్కూల్‌లో చదువుతున్న యువతితో ఫ్రెండ్‌షిప్ చేసింది. వీళ్లద్దరి మధ్య కబడ్డీ ఆట ప్రేమను పుట్టించింది. అంతే ఎలాగైనా స్టూడెంట్‌ని పెళ్లిచేసుకోవాలని లేడీ టీచర్‌ లింగమార్పిడి చేసుకొని..పెళ్లాడింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Rajasthan, India

అదో విచిత్రమైన ప్రేమజంట. వాళ్లద్దరూ అమ్మాయిలే. అయినా ప్రేమించుకున్నారు. ఆ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి కబడ్డీ ఆట ఆజ్యం పోసింది. రాజస్థాన్‌ (Rajasthan) భరత్‌పూర్‌(Bharatpur) జిల్లాలోని నాగ్లా(Nagla)లోని ప్రభుత్వ పాఠశాలలో స్టోర్ట్స్ టీచర్‌గా పనిచేస్తోంది మీరా(Meera). అదే స్కూల్‌లో చదువుకుంటున్న కల్పనా ఫౌజ్దార్ (Kalpana Fauzdar)అనే విద్యార్ధిని స్పోర్ట్స్‌లో చాలా చురుకుగా ఉండేది. ముఖ్యంగా కబడ్డీ ఆట(Kabaddi game)లో కల్పన రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడాకారిణి. దుబాయ్ (Dubai)లో జనవరిలో జరిగిన అంతర్జాతీయ కబడ్డీ టోర్నమెంట్ (International Kabaddi Tournament)లోనూ పాల్గొంది. కల్పన, మీరా మధ్య ఈ కబడ్డీ ఆట కారణంగా సాన్నిహిత్యం పెరిగింది. అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో రెండేళ్ల పాటు వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.

DAHINI | Film news : ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో కాంతారగా మారిన దహిణి మూవీ .. ప్రాంతీయ చిత్రానికి అంతర్జాతీయ గుర్తింపు

కబడ్డీ ఆటలో పుట్టిన ప్రేమ..

మీరా స్వతహాగా మహిళ అయినప్పటికి చూడటానికి అబ్బాయి పోలీకలతో ఉండటంతో ఎలాగైనా కల్పనతో జీవితం పంచుకోవాలని భావించింది. అందుకోసం లింగ మార్పిడి చేయించుకొని పురుషుడిగా మారింది మీరా. పురుషుడిగా మారి ఆరవ్‌గా పేరు మార్చుకుంది. గత కొంత కాలంగా తన స్టూడెంట్ కల్పనతో ప్రేమలో ఉన్న ఆరవ్‌ లింగమార్పిడి ఆపరేషన్‌ సక్సెస్ అయిన తర్వాత వివాహం చేసుకుంది.

స్టూడెంట్‌కి భర్తగా మారిన లేడీ టీచర్ ..

తనకు నచ్చిన అమ్మాయి కోసం ఓ యువతి యువకుడిగా మారిన సంఘటన అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మీరా 2019లో లింగమార్పిడి చేయించుకోవాలని నిర్ణయం తీసుకుంది. అనేక సార్లు లింగమార్పిడి ఆపరేషన్ కోసం ప్రయత్నించింది. చివరకు తన ప్రేయసి సహకారం, పెద్దల అంగీకారంతో విజయం సాధించింది.

' isDesktop="true" id="1496740" youtubeid="fMKIy-6JG78" category="national">

ఇద్దరు మహిళల మధ్య ప్రేమ..

టీచర్, స్టూడెంట్స్‌గా ఉన్న సమయంలోనే వీరిద్దరి మధ్య కబడ్డీ ఆట బలమైన ప్రేమను నింపింది. ఆ సమయంలోనే వీళ్లిద్దరూ ఏ టోర్నమెంట్స్‌కి వెళ్లినా కలిసి వెళ్లేవారు. చివరకు ఈసంవత్సరం నవంబర్ నెల 4వ తేదిన ఆరవ్‌గా మారిన మీరా టీచర్ స్టూడెంట్ కల్పనను గ్రాండ్‌గా వివాహం చేసుకుంది.

Viral News: టీచర్ రిక్రూట్‌మెంట్‌ హాల్‌ టికెట్‌పై సన్నీలియోన్ ఫోటో ..కర్నాటక సర్కారుపై విమర్శల వెల్లువ

లింగ మార్పిడి ఆపరేషన్‌తో ..పెళ్లి

అయితే తాను పుట్టడం అమ్మాయిగా పుట్టినప్పటికి ఎప్పటికైనా అబ్బాయిగా మారాలని అనుకునేవాడ్ని లింగమార్పిడి ఆపరేషన్ చేసుకున్న తర్వాత చెప్పాడు ఆరవ్. అయితే ఇందులో భాగంగానే మొదటిసారి 2019సర్జరీ చేయించుకున్నానని చెప్పాడు. ఇక లింగమార్పిడి చేసుకున్న ఆరవ్‌ని పెళ్లాడిన కల్పన కూడా తమది స్వచ్ఛమైన ప్రేమ అని అంటోంది. ఒకవేళ ఆరవ్‌ లింగ మార్పిడి ఆపరేషన్‌ చేయించుకోకపోయినప్పటికి అతడినే పెళ్లి చేసుకునేదాన్నని తెలిపింది. అన్యోన్యంగా జీవిస్తామన్న భరోసా ఉన్న ఈ వెరైటీ ప్రేమజంట పెళ్లి రెండు వైపుల కుటుంబ సభ్యులు ఆమోదించడంతో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది.

First published:

Tags: Rajastan, Trending news, Viral Video

ఉత్తమ కథలు