Home /News /trending /

LADY DOCTOR COLLECTS DONATIONS OF CRORES OF RUPEES FOR MATERNAL INJECTION IN AGRA SNR

ఆ లేడీ డాక్టర్‌కి కోటి రూపాయలు కావాలంట..అంత డబ్బుతో ఏం చేస్తుందో తెలుసా..

Photo Credit:Youtube

Photo Credit:Youtube

AGRA: ఆగ్రాలో ఓలేడీ డాక్టర్‌ అందరి సాయం కోరుతోంది. తన తల్లికి రొమ్ము క్యాన్సర్‌ని నయం చేసే ఇంజెక్షన్‌ కోసం కోటి రూపాయలను పోగు చేస్తోంది. ప్రధాన మంత్రి మొదల్కొని ప్రతి ఒక్కరిని తోచిన ఆర్ధిక సాయం చేయమని వేడుకుంటోంది. ఇప్పటి వరకు 22లక్షల రూపాయలు దాచి పెట్టిన అంజలీగుప్తా మిగిలిన డబ్బు కోసం విరాళాలు సేకరిస్తోంది.

ఇంకా చదవండి ...
ఆమె ఓ లేడీ డాక్టర్. మెడికల్‌ కాలేజీ (Medical college)లో జాబ్ చేస్తోంది. అయినా ఆమెకు డబ్బు కావాలి. వేలు, లక్షలు కాదు కోటి రూపాయలు కావాలి. అది కూడా అర్జెంట్‌గా కావాలంటోంది. ఎవరైనా పెద్ద మనసు చేసుకొని సాయం చేయమని వేడుకుంటోంది. రెండు చేతులు జోడించి ప్రతి ఒక్కరిని అడుగుతోంది. డాక్టర్‌ ఉద్యోగం చేస్తున్న మహిళకు అంత డబ్బు ఎందుకని ఆశ్చర్యపోతున్నారా. అర్జెంట్‌గా ఇవ్వమని వేడుకోవడం వెనుక ఏం జరిగి ఉంటుందో అని ఆలోచిస్తున్నారు కదూ. ఆమెకు ఏం జరగలేదు. లేడీ డాక్టర్‌ (Lady doctor)సాయం చేయమని కోరుతున్న కోటి రూపాయలు(1 Crore)తన కోసం కాదు. గత రెండేళ్లుగా ప్రాణాంతక క్యాన్సర్‌ (Breast cancer)తో బాధపడుతున్న తన తల్లిని రక్షించుకునేందుకే ఇవ్వమని విజ్ఞప్తి చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌ (Uttar pradesh) ఆగ్రా (Agra)కు చెందిన డాక్టర్ అంజలీ గుప్తా (Doctor Anjali Gupta)ధీనగాధ ఇది. ఆగ్రాలోని ఎస్‌ఎన్‌ మెడికల్‌ కాలేజీ(Sn medical college)లో జూనియర్‌ డాక్టర్‌గా పనిచేస్తోంది అంజలీ గుప్తా. ఆమె తల్లి దయాగుప్తా (Daya gupta)రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. 2019 నుంచి తన తల్లిని ప్రాణాంతక క్యాన్సర్‌ వ్యాధి వెంటాడుతోంది. కన్నతల్లికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ అంజలీ గుప్తా నిర్ణయించున్నారు. అందుకోసం తన ప్రతి నెల జీతం మొత్తాన్ని భద్రపరుస్తూ వస్తున్నారు. తల్లి దయాగుప్తాను ఎందరో డాక్టర్లకు చూపించారు అంజలీ. అయితే ఆమెకు ససితుజుమాబ్ (Sacituzumab)అనే ఇంజక్షన్‌ (Injection)వేస్తే రొమ్ము క్యాన్సర్‌ నుంచి బయటపడే అవకాశం ఉందని సూచించారు.

కోటి రూపాయలు ఉంటేనే వైద్యం..
డాక్టర్‌లు సూచించిన ససితుజుమాబ్ అనే ఇంజక్షన్‌ ఖరీదైనది. కోటి రూపాయలు విలువ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ మన దేశంలో దొరకడం లేదని..అమెరికా నుంచి తెప్పించుకోవాలని చెప్పడంతో విరాళాల సేకరకు సిద్ధమైంది. తల్లి వ్యాధిని నయం చేయించుకునేందుకు ఇప్పటి వరకూ 22లక్షల రూపాయలు కూడబెట్టింది. అయితే ఇంజెక్షన్‌ కోసం మరో 75లక్షల రూపాయలకుపైగా అవసరం ఉంది. దీంతో డాక్టర్ అంజలీ గుప్తా..దేశ ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌కు లేఖ రాశారు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతోందని ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించాలని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం సాయం చేయలేని పరిస్థితుల్లో కనీసం ఆర్ధిక సాయం చేసి తన తల్లి ప్రాణాలు నిలబెట్టమని కోరారు అంజలీ గుప్తా.

మా అమ్మను బతికించండి..
రోగుల ప్రాణాలు కాపాడే వైద్యురాలికే కష్టం వచ్చింది. తన తల్లి ప్రాణాలు ఖరీదైన ఇంజెక్షన్‌తో ముడిపడి ఉందని తెలిసి తీవ్ర మనోవేదనకు గురవుతోంది. అంత మొత్తం ఖర్చు చేసే ఆర్ధిక స్తోమత లేకపోవడంతో సాయం చేయమని మనసున్న మనుషులను కోరుతోంది. కష్టకాలంలో ఆర్ధిక సాయం చేసి ఓ ప్రాణాన్ని నిలబెట్టమని..ఓ ఆడపిల్ల పడుతున్న తపన అందర్ని కంట తడిపెట్టిస్తోంది. ఆగ్రాలో ఉన్న డాక్టర్ అంజలీగుప్తాకు వచ్చిన కష్టం తొలగిపోవాలని ఆమె సహుద్యోగులు, సన్నిహితులు కోరుతున్నారు.

కన్నతల్లి రుణం తీర్చుకోవాలని..
ఏం చేస్తే కన్నతల్లి రుణం తీర్చుకోవచ్చు. ఏం చేసినా జన్మనిచ్చిన మాతృమూర్తి రుణం తీర్చుకోలేము. కానీ డాక్టర్ అంజలీ గుప్తా మాత్రం ప్రాణపాయస్థితిలో ఉన్న తన అమ్మ దయాగుప్తాకు మెరుగైన వైద్యం చేయించి పునర్జన్మను ఇవ్వాలని పరితపిస్తోంది. ఆమె లక్ష్యం నెరవేరాలని కోరుకుందాం.
Published by:Siva Nanduri
First published:

Tags: Agra, Breast cancer, Doctors

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు