• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • LADDOO MAKING WITH MAGGI VIDEO GOES VIRAL IN SOCIAL MEDIA HERE IS NETIZENS COMMENTS SK GH

Maggi Laddoo: మ్యాగీ నూడిల్స్​తో లడ్డూ తయారీ.. ఇలా కూడా చేస్తారా? ఫొటోలు వైరల్

Maggi Laddoo: మ్యాగీ నూడిల్స్​తో లడ్డూ తయారీ.. ఇలా కూడా చేస్తారా? ఫొటోలు వైరల్

మ్యాగీ లడ్డూలు

ఇంటర్నెట్‌లో వైరల్​ అవుతున్న 'మ్యాగీ లడ్డూ' ను తయారు చేయడం చాలా సింపుల్​. సాధారణంగా లడ్డూ తయారీలో ఉపయోగించే బెల్లం, యాలకులనే దీని తయారీలో కూడా ఉపయోగిస్తారు

  • Share this:
మన దేశంలో మ్యాగీ అంటే ఎంతో మందికి అమితమైన ఇష్టం. కేవలం రెండు నిమిషాల్లో సిద్ధమయ్యే ఈ రుచికరమైన వంటకం క్షణంలో ఆకలి తీర్చగలదు. అందుకే సమయం లేనప్పుడు వెంటనే నూడిల్స్​ ప్రిపేర్​ చేసి లాగించేస్తుంటాం!. అయితే, ఎప్పుడూ ఒకే రకమైన వంటకం తింటే బోర్​ కొడుతుంది కాదా! అందుకే వెరైటీ వంటకాలను ప్రిపేర్​ చేస్తూ నెట్టింట్లో షేర్​ చేస్తున్నారు కొంతమంది. ముఖ్యంగా, కరోనాతో దాదాపు అంతా ఇంటికే పరిమితమవ్వడంతో వారికి దొరికిన ఖాళీ సమయాన్ని వెరైటీ వంటకాలను సిద్దం చేయడం కోసం ఉపయోగించుకుంటున్నారు. వీటిని, సోషల్​ మీడియాలో షేర్​​ చేస్తుండగా.. అవి క్షణాల్లో వైరల్​గా మారుతున్నాయి. గతేడాది మ్యాగీతో చేసిన వెరైటీ వంటకాలు గుర్తుండే ఉంటుంది. చాక్లెట్​ మ్యాగీ, మ్యాగీ ఐస్​క్రీమ్​ వంటి వెరైటీ వంటకాలు నెట్టింట్లో ఎంత వైరల్​ అయ్యాయో తెలిసిందే. ముఖ్యంగా, మ్యాగీ తయారీలో మసాలాకు బదులు జున్ను, కూరగాయలను వాడి అద్భుతమైన వంటకాలను తయారు చేసిన వీడియోలను చూశాం.

అయితే, ఇప్పుడు వీటికి కాస్త భిన్నంగా ఆలోచించి ‘మ్యాగీ లడ్డూ’ను సిద్దం చేశాడో వ్యక్తి​. అతడు మ్యాగీ లడ్డూను తయారు చేస్తుండగా తీసిన వీడియోను జెనియా ఇరానీ అనే ట్విట్టర్ యూజర్ తన పేజీలో పోస్ట్ చేసింది. ఇది సంతానోత్పత్తికి ఉపయోగపడే ఆహార పదార్థమని కూడా ఆమె చెబుతుంది. కాగా, ఈ వీడియో చూసిన వారంతా అవాక్కవుతున్నారు. మ్యాగీతో ఎన్నో రకాల వంటకాలను చూశాం.. కానీ, లడ్డూ వంటి తీపి వంటకాన్ని తయారు చేయడం ఇప్పుడే చూస్తున్నామని కామెంట్స్​ చేస్తున్నారు.

నెట్టింట్లో వైరల్​ అవుతున్న మ్యాగీ లడ్డూ..
కాగా, ఇంటర్నెట్‌లో వైరల్​ అవుతున్న 'మ్యాగీ లడ్డూ' ను తయారు చేయడం చాలా సింపుల్​. సాధారణంగా లడ్డూ తయారీలో ఉపయోగించే బెల్లం, యాలకులనే దీని తయారీలో కూడా ఉపయోగిస్తారు. నూడుల్స్ సహజంగా తీపి వంటకాలకు అనువైనవి ఎవ్వరూ భావించరు. కానీ, నూడిల్స్​తో కూడా లడ్డూ వంటి తీపి పదార్థాలను తయారు చేయవచ్చని ఈ వీడియోను చూస్తే తెలుస్తోంది. కాగా, ఈ వెరైటీ వంటకాన్ని జెనియా ఇరానీ ట్వీట్​ చేస్తూ.. ‘‘నేను ఈ వెరైటీ మ్యాగీ లడ్డూల తయారీని చూసి ఆశ్చర్యపోయాను. కానీ, కొన్ని ప్రాంతాల్లో మ్యాగీ నూడిల్స్​ను తీపి పదార్థాల తయారీకి కూడా ఉపయోగిస్తారని ఈ వీడియోతో తెలుసుకున్నాను. నెటిజన్లు కూడా ఈ వీడియో చూసి మొదట్లో ఆశ్చర్యపోక తప్పదు.”అని ట్వీట్​ చేసింది.



కాగా, ఈ వెరైటీ వంటకాన్ని చూసి చాలా మంది వెరైటీ కామెంట్లు చేస్తున్నారు. మేము కూడా ట్రై చేస్తామంటూ కొందరు కామెంట్స్​ చేస్తున్నారు. దీనిపై ఒక నెటిజన్​ స్పందిస్తూ "పిచ్చి కాంబినేషన్," అని వ్యాఖ్యానించగా.. మరొకరు "పాప్ లగేగా(పాపం తగులుతుంది)" అని కామెంట్​ చేశారు. ఏదేమైనప్పటికీ, ఈ వెరైటీ మ్యాగీ లడ్డూకు చాలా మంది నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇంకెందుకు ఆలస్యం ఖాళీ సమయంలో మీరు కూడా దీన్ని ట్రై చేసి తియ్యని లడ్డూలను లాగించేయండి.
Published by:Shiva Kumar Addula
First published:

అగ్ర కథనాలు