కుంభమేళాకు పోటెత్తిన భక్తులు.. కోటి మంది వస్తారని అంచనా.. ఇప్పటికే మూడు రికార్డులు నమోదు..

ప్రయాగ్‌రాజ్‌లో అర్ధ కుంభమేళా తుది ఘట్టానికి చేరుకుంది. జనవరి 14న ప్రారంభమైన ఈ కుంభమేళాలో ఇప్పటివరకూ 22 కోట్ల మంది పాల్గొన్నారు.

Amala Ravula | news18-telugu
Updated: March 4, 2019, 11:39 AM IST
కుంభమేళాకు పోటెత్తిన భక్తులు.. కోటి మంది వస్తారని అంచనా.. ఇప్పటికే మూడు రికార్డులు నమోదు..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 4, 2019, 11:39 AM IST
నేడు చివరి రోజు కావడంతో సుమారు కోటి మంది భక్తులు కుంభమేళాలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. పోలీస్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.
మహాశివరాత్రి పర్వదినం కావడంతో కుంభమేళాకు భక్తులు తరలివస్తున్నారు. దీంతో.. త్రివేణి సంగమం వద్ద రద్దీ పెరిగింది. గంగా, యమున, సరస్వతి పవిత్ర సంగమంలో సాన్నం చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు, యాత్రికులూ, సాధువులూ ప్రయగరాజ్ చేరుకుంటున్నారు. శివరాత్రి, శివుడికి ఇష్టమైన సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు. దీంతో.. ప్రయాగ్‌రాజ్ భక్తజన సందోహంలా మారింది.

ఇక ఇప్పటికే కుంభమేళాలో మూడు గిన్నిస్ రికార్డులు నమోదు అయ్యాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 10వేల మంది పారిశుద్ధ్య కార్మికలుు నాలుగురోజుల పాటు పాల్గొని పరిశుభ్రతా చర్యలు చేపట్టడం..ఫిబ్రవరి 28న 503 షటిల్ బస్సులలో యాత్రికులు కుంభమేళాకు చేరుకోవడం, మార్చి 1న జరిగిన పెయింటింగ్‌లో అత్యధిక కళాకారులు పాల్గొనడం ఇలా మూడు రికార్డులు నమోదయ్యాయి. దీంతో.. గిన్నీస్ వరల్డ్ రికార్డుకు చెందిన ముగ్గురు సభ్యుల బృందం ప్రయాగ్‌రాజ్‌కి చేరుకుని కార్యక్రమాలను పరిశీలించి ధ్రువీకరించారు.

మునుపెన్నడూ లేని విధంగా పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. కుంభామేళాను తొమ్మిది జోన్లుగా విభజించి ప్రతీ చోట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతీచోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు. 20వేల మంది పోలీసులు, ఆరు వేల మంది హోంగార్డులు, 80 కంపెనీల రాష్ట్ర రిజర్వు పోలీస్ బలగాలు, 20 కంపెనీల కేంద్రబలగాలతో భద్రతా చర్యలు చేపట్టారు. అదేవిధంగా.. 40 ఫైర్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించేందుకు నిఘా విభాగాలను పటిష్టం చేసినట్లు డీజీపీ సింగ్ తెలిపారు.


ఇవి కూడా చదవండి..హరతిని కళ్ళకి అద్దుకుంటున్నారా.. అలా చేయకండి..
Loading...

First published: March 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...