వాటే టాలెంట్ అమ్మా... మరో మైకేల్ జాక్సన్ అందామా..?

KTR Tweet : మనందరిలోనూ ఏవో ఒక టాలెంట్స్ ఉంటాయి. కొందరు వాటితో అద్భుతాలు సృష్టిస్తారు. ఈ కార్మికుడు అదే చేశాడా?

Krishna Kumar N | news18-telugu
Updated: June 11, 2019, 7:30 AM IST
వాటే టాలెంట్ అమ్మా... మరో మైకేల్ జాక్సన్ అందామా..?
మెట్రో రైలు వర్కర్ అదిరే డాన్స్ (Image : Twitter / MD HMRL)
Krishna Kumar N | news18-telugu
Updated: June 11, 2019, 7:30 AM IST
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో కొన్ని వందల మంది కార్మికులు పనిచేస్తున్నారని మనకు తెలుసు. అలాంటి వారిలో ఓ నిర్మాణ కార్మికుడు... లంచ్ బ్రేక్‌లో తన తోటి వర్కర్ల ముందు డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశాడు. ఆ డాన్స్ చూస్తే... సినిమాల్లో హీరోలు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. దాదాపు మైకేల్ జాక్సన్ స్టెప్పుల్ని దించేశాడు. ఓ కర్రతో ఎంతో ఈజీగా అతను ఆ స్టెప్పులు వెయ్యడం చూస్తే... అతను మూవీ ఆర్టిస్టేమో అన్న డౌట్ రాక మానదు. తమ ప్రాజెక్టులో ఇలాంటి టాలెంటెడ్ వర్కర్లు ఉండటంపై ఎంతో సంతోషిస్తున్నామనీ, అతన్ని చూసి గర్వపడుతున్నామనీ చెబుతూ... మెట్రో రైల్ ఎండీ... ఆ డాన్స్ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... సూపర్ టాలెంట్ అని ప్రశంసించారు. రీట్వీట్ చేశారు.

ఈ వీడియో వైరల్ అవుతోంది. చాలా మంది దీనిపై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అతనికి శాలరీ పెంచాలని కొందరు అంటుంటే... అతనికి రిలీఫ్ ఇవ్వాలని మరికొందరు అంటున్నారు. అలా ఎవరైనా డాన్స్ చెయ్యగలరా అని మరికొందరు సవాల్ విసురుతున్నారు.
First published: June 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...