కండక్టర్ లేకుండా వెళ్లిపోయిన బస్సు... ఆ తర్వాత ఏమైందంటే...

Muvattupuzha : కేరళలోని మువత్తుపుఝా నుంచీ కూతట్టుకులంకి వెళ్లే ఆ బస్సులో కండక్టర్ లేకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Krishna Kumar N | news18-telugu
Updated: June 10, 2019, 10:11 AM IST
కండక్టర్ లేకుండా వెళ్లిపోయిన బస్సు... ఆ తర్వాత ఏమైందంటే...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: June 10, 2019, 10:11 AM IST
ఈ రోజుల్లో చాలా లాంగ్ జర్నీ బస్సుల్లో డ్రైవర్లే ముందుగా టికెట్లు ఇచ్చేసి... బస్సు డ్రైవ్ చేస్తున్నారు. కానీ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల పని కండక్టర్‌దే. కేరళలో... మువత్తుపుఝా నుంచీ కూతట్టుకులంకి వెళ్లే ఆ బస్సును కండక్టర్ ఎక్కలేదు. ఆ విషయం తెలియని డ్రైవర్ బస్సును నడిపించాడు. బస్సు నిండా ప్రయాణికులు ఉండటంతో... వెనక ఉన్న ప్రయాణికులు... కండక్టర్ ముందు ఉన్నాడని అనుకున్నారు. ముందు ఉన్న ప్రయాణికులు... కండక్టర్ వెనక ఉన్నాడని అనుకున్నారు. అలా బస్సు బయల్దేరింది. ఒక్కో స్టాపూ దాటుకుంటూ వెళ్లిపోతోంది. కానీ టికెట్ తీసుకుందామంటే కండక్టర్ కనిపించట్లేదు. ప్రయాణికుల్లో చాలా మంది కండక్టర్ తమ దగ్గరకు రావట్లేదని అనిపించినా... ఆ విషయాన్ని లైట్ తీసుకుని... అలాగే ఊరుకున్నారు. డ్రైవర్ కూడా బిజీ ప్రయాణికుల వల్ల కండక్టర్ తన వైపు రావట్లేదని అనుకుంటూ బస్సును నడిపించేశాడు.

నిజానికి బస్సు బయల్దేరక ముందు కండక్టర్ ఓ ప్రయాణికుడికి చిల్లర ఇవ్వాల్సి వచ్చింది. ఆ చిల్లర కోసం బస్టాండ్ దగ్గర ఉన్న షాపుల చుట్టూ తిరగసాగాడు. మొత్తానికి ఆ ప్రయాణికుడికి చిల్లర ఇచ్చేసి... డిపోకి వెళ్లి... ఎంత మనీ కలెక్ట్ చేసిందీ ఆయా లెక్కలు చూపించాడు. ఆ తర్వాత తాపీగా బస్టాండ్‌కి వచ్చాడు. అప్పటికే బస్సు వెళ్లిపోయి పావుగంట అయ్యింది.

విషయం తెలిసి షాకైన కండక్టర్... మళ్లీ డిపోకి వెళ్లి జరిగింది చెప్పాడు. వెంటనే డిపో ఆఫీసర్లు... డ్రైవర్‌కి కాల్ చేస్తే... ఆయన డ్రైవింగ్‌లో మొబైల్ మాట్లాడకూడదన్న రూల్ ఉండటంతో... మొబైల్ కాల్ కట్ చేయసాగాడు. ఇక లాభం లేదనుకున్న కండక్టర్... మరో డ్రైవర్ పార్క్ చేసుకున్న బైక్ తీసుకొని... బస్సు వెళ్లిన రూట్‌లో వేగంగా బయలుదేరాడు.

బస్సు 18 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత... ఓ రైల్వే ట్రాక్ దగ్గర ఆగింది. అప్పటిదాకా సైలెంట్‌గా ఉన్న ప్రయాణికులు... కండక్టర్ ఏరీ అని డ్రైవర్‌ను అడగసాగారు. షాకైన డ్రైవర్... తల పట్టుకున్నాడు. అంతలోనే... కాస్త దూరంలో బైక్‌పై వస్తూ కండక్టర్ కనిపించాడు. హమ్మయ్య అనుకున్న డ్రైవర్... ప్రయాణికులందరికీ టికెట్లు తీసుకున్న తర్వాత బస్సును పోనిచ్చాడు.డిపో అధికారులు డ్రైవర్‌ని తప్పుపట్టారు. కండక్టర్ రైట్ రైట్ అనకుండా బస్సు ఎందుకు నడిపారంటూ ఫైర్ అయ్యారు. బస్సు బయల్దేరేటప్పుడే కండక్టర్ ఉన్నదీ, లేనిదీ చూసుకొని ఉంటే... ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని మండిపడ్డారు.

 

ఇవి కూడా చదవండి :
Loading...
చనిపోయిన కుర్రాడు మళ్లీ బతికాడు... ఆ తర్వాత మరో షాక్...

బిచ్చం డబ్బులతో ఆలయాల అభివృద్ధి... ఓ ముసలాయన ఔదార్యం...

ఆస్ట్రేలియా వరుడితో పెళ్లి... మధ్యలో ఎంటరైన యువకుడు... ఆ తర్వాత...

కేరళలో భారీ వర్షాలు... తుఫాను వచ్చే సంకేతాలు...


రూ.10కే చీర... తరలివచ్చిన మహిళలు... ఆ తర్వాతేమైందో తెలుసా...
First published: June 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...