హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఆర్టీసీ కార్మికులు సమ్మె.. రూ. 10 లక్షల పరిహారం కోరుతూ బీఎంటీసీకి లీగల్ నోటీసు పంపిన విద్యార్థిని.. రీజన్ మాత్రం మాములుగా లేదుగా..

ఆర్టీసీ కార్మికులు సమ్మె.. రూ. 10 లక్షల పరిహారం కోరుతూ బీఎంటీసీకి లీగల్ నోటీసు పంపిన విద్యార్థిని.. రీజన్ మాత్రం మాములుగా లేదుగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

KSRTC BMTC Employees Strike: కర్ణాటక‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని రూ. 10 లక్షల పరిహారం కోరుతూ బీఎంటీసీకి లీగల్‌ నోటీసులు పంపించారు.

  కర్ణాటకలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగులు బుధవారం నుంచి సమ్మె చేపట్టారు. దీంతో కర్ణాటకలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(BMTC) పరిధిలో కూడా రవాణా స్తంభించింది. అసలే కరోనా కాలం.. ఈ సమయంలో ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ భారీగా డబ్బులు వసూలు చేస్తుండటంతో.. ప్రజలు, ఉద్యోగులు ప్రయాణం కోసం భారీగా డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే బస్ పాస్ కలిగిన ఓ విద్యార్థిని.. తనకు బస్సు సేవల్లో ఇబ్బంది కలిగిందని, ఇందుకు రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని కోరుతూ బీఎంటీసీకి లీగల్ నోటీసు పంపారు. బీఎంటీసీ ఎండీతో పాటు, ఉద్యోగుల నిరసనకు పిలుపునిచ్చిన ఆర్టీసీ కార్మిక సంఘాల అధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్‌ తనకు పరిహారం చెల్లించాల్సిందిగా కోరారు.

  వివరాలు.. కెంగేరి జెఎస్ఎస్ అకాడమీ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న పవన ఈ నోటీసులు పంపించారు. తన లాయర్ రమేష్ నాయక్ ద్వారా ఈ నోటీసులు పంపారు. తాను బీఎంటీసీ వార్షిక బస్ పాస్ కలిగి ఉన్నట్టు చెప్పారు. బీఎంటీసీ గత రెండు రోజులుగా బసు సర్వీసులు కల్పించడంలో విఫలమైందని తెలిపారు. బస్ పాస్ హోల్డర్ల‌కు బస్సుల అందుబాటులో ఉంచకపోవడం సేవ లోపం కిందకు వస్తుందని పేర్కొన్నారు. ఈ రకమైన చర్యలు సరైన వ్యాపార పద్దతులు కావని అన్నారు. కావున తనకు రూ. 10 లక్షలు పరిహారం చెల్లించాల్సిందిగా లీగల్ నోటీసులు పంపారు.

  18 ఏళ్లు దాటితే నచ్చిన మతం ఎంచుకోవచ్చు.. స్పష్టం చేసిన సుప్రీం కోర్టు.. 

  Andhra Pradesh: ఆర్టీసీ బస్సులో రూ. 3 కోట్లు సీజ్.. చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో..

  Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందా?.. ప్రతి ఏడాది డోసులు తీసుకోవడం తప్పనిసరా?

  మరోవైపు కార్మికుల సమ్మె నేపథ్యంలో కేఎస్‌ఆర్టీసీ ప్రైవేటు బస్సులకు తాత్కాలికంగా అనుమతినిచ్చింది. ప్రైవేటు బస్సులో టికెట్ రేట్లను ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించినప్పటికీ.. అవి అమలు కావడం కాలేదు. బీఎంటీసీ, కేఎస్‌ఆర్‌టీసీ మాదిరిగానే టికెట్లు రేట్లు ఉండాలని ప్రభుత్వం సూచించినప్పటికీ.. ప్రైవేటు బస్సులలో టికెట్లు రేట్లు భారీగా ఉన్నాయి. ఇక, కార్మిక సంఘాలతో చర్చలకు ముఖ్యమంత్రి యడియూరప్ప ససేమిరా అన్నారు. నష్టాల్లో ఉన్న సంస్థను ఎలా కాపాడుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంటే నిరసనల పేరుతో కార్మికులు రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టడాన్ని క్షమించలేమన్నారు. రవాణా మంత్రి లక్ష్మణసవది కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించేలా సమ్మె సరికాదన్నారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Bangalore, Karnataka, RTC Strike

  ఉత్తమ కథలు