Home /News /trending /

KONIJETI ROSAIAH COMMENTS ON CHANDRABABU THEN CM YSR IN ASSEMBLY VIDEO GOES VIRAL AFTER AP FORMER CM ROSAIAH DEATH MKS

konijeti rosaiah : వైఎస్సార్‌ను కత్తితో పొడిచి సీఎం అయ్యేవాడిని -రోశయ్య సంచలన వ్యాఖ్యలు -viral video

రోశయ్య పార్థివదేహం, అసెంబ్లీలో వైఎస్సార్, రోశయ్య (ఫైల్)

రోశయ్య పార్థివదేహం, అసెంబ్లీలో వైఎస్సార్, రోశయ్య (ఫైల్)

వైఎస్ హయాంలో అటు ఆర్థిక మంత్రిగా, ఇటు శాసనసభా వ్యవహారాల మంత్రిగా కొణిజేటి రోశయ్య చూపించిన చతురత, చంద్రబాబు నేతృత్వంలోని ప్రతిపక్ష టీడీపీని ఒంటిచేత్తో ఆయన మేనేజ్ చేసిన తీరు అప్పట్లో ఓ సెన్సేషన్. ఒక సందర్బంలో చంద్రబాబు విమర్శలకు ఘాటుగా సమాధానమిస్తూ ఎన్టీఆర్ కు బాబు వెన్నుపోటును పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘నన్ను నమ్ముకున్న వైఎస్ ను కత్తితో పొడిచి సీఎం అయ్యేవాడినే..’అంటూ రోశయ్య చేసిన కామెంట్ల తాలూకు వీడియో ఇప్పటికీ వైరల్ గానే నిలిచింది.

ఇంకా చదవండి ...
రాజకీయాల్లో చాణక్యుడిగా పేరుపొందిన నేతలు.. చాతుర్యంగా మాట్లాడలేక తెరవెనుకే మంత్రాంగాలు చేస్తుంటారు. అయితే కొణిజేటి రోశయ్య మాత్రం ఇందుకు భిన్నం. అటు వ్యూహాల్లో చాణక్యుడిగా, ప్రత్యర్థుల్ని నేరుగానూ నిలువరించగలిగే మాటల మాత్రికుండిగానూ ఆయన గొప్ప పేరు పొందారు. ఆర్థిక నిపుణుడిగానే కాదు.. పొద్దికైన ప్రసంగాలతో, సందర్బానికి తగినట్లుగా చలోక్తులు విసురుతూ, శుద్ద తెలుగులో అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ మన చెవుల్లో రింగుమంటుంటాయి. సుదీర్ఘ పొలిటిక్ కెరీర్ లో ఎన్నెన్నో పదవులు చేపట్టిన ఆయన.. ఉమ్మడి ఏపీలో టంగుటూరి అంజయ్య మొదలుకొని వైఎస్సార్ హయాం దాకా కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. అనూహ్యరీతిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ హయాంలో అటు ఆర్థిక మంత్రిగా, ఇటు శాసనసభా వ్యవహారాల మంత్రిగా రోశయ్య చూపించిన చతురత, చంద్రబాబు నేతృత్వంలోని ప్రతిపక్ష టీడీపీని ఒంటిచేత్తో ఆయన మేనేజ్ చేసిన తీరు అప్పట్లో ఓ సెన్సేషన్. ఒక సందర్బంలో చంద్రబాబు విమర్శలకు ఘాటుగా సమాధానమిస్తూ ఎన్టీఆర్ కు బాబు వెన్నుపోటును పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘నన్ను నమ్ముకున్న వైఎస్ ను కత్తితో పొడిచి సీఎం అయ్యేవాడినే..’అంటూ రోశయ్య చేసిన కామెంట్ల తాలూకు వీడియో ఇప్పటికీ వైరల్ గానే నిలిచింది. రోశయ్య మరణం తర్వాత తెలుగు ప్రజలు మరోసారి ఆ వీడియోలో రోశయ్య వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటున్నారు..

shocking : Omicron భయంతో భార్య గొంతు నులిమి, ఇద్దరు పిల్లల పుర్రెలు పగలగొట్టిన ఫొరెన్సిక్ ప్రొఫెసర్అపర చాణక్యుడు, మాటల మాత్రికుడు
ప్రతిపక్షాలను దీటుగా నిలువరించగలిగే, అంతకంటే వివరంగా సమాధానాలు చెప్పగలిగే, అన్నిటికీ మంచి హుందాగా బదులివ్వగలిగే మంత్రి ఉండటం ఏ ముఖ్యమంత్రికైనా పెట్టని కోట లాంటిదే. నాటి సీఎం వైఎస్సార్ కు రోశయ్య ముమ్మాటికీ అలానే వ్యవహరించేవారు. హైదరాబాద్ గతిని మార్చేసిన ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కావొచ్చు, శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణం కావొచ్చు, ఆటంకాలు లేకుండా ఆరోగ్య శ్రీ అమలు కావడం కావొచ్చు, ఇంకా ఆ సమయంలో వైఎస్ సర్కారు తీసుకున్న అనేక ఆర్థిక పరమైన నిర్ణయాలు కావొచ్చు.. అన్నిటికి అన్నీ సక్సెస్ కావడం వెనుక రోశయ్యే ఉన్నారన్నది కాదనలేని వాస్తవం. కాగా, ఒక సందర్భంలో మాత్రం రోశయ్య గతానికి భిన్నంగా ఆగ్రహపూరిత వ్యాఖ్యలతో, అది కూడా హుందాగానే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కౌంటరిచ్చిన తీరు తెలుగు నాట రాజకీయాల్లో నిత్యం చర్చకు వస్తుంది..

Siddipet : పసిపాప కాలిగజ్జెలకు కరెంట్ షాక్ పెట్టి.. కన్నతండ్రి క్రూరత్వం.. భార్యపై అనుమానంతో ఇలా..ఎన్టీఆర్ డ్రామా కంపెనీ వివాదం
వైఎస్సార్ సీఎంగా, రోశయ్య ఆర్థిక మంత్రిగా ఉండిన రోజుల్లో ఓసారి అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల వాదనలోకి ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఎన్టీఆర్ ను డ్రామా ఆర్టిస్టుగా, ఆయన పార్టీ టీడీపీని డ్రామా కంపెనీగా కాంగ్రెస్ నేతలు వెక్కిరించారంటూ టీడీపీ ఆందోళనకు దిగింది. ఈ క్రమంలో టీడీపీ చంద్రబాబు.. అధికార కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభా వ్యవహారాల మంత్రిగా సభను అదుపు చేసే ప్రయత్నంగా రోశయ్య మాట్లాడుతూ.. చంద్రబాబు తీరును ఎండగట్టారు. సభలో కళ్లు ఉరమడం, కోపం చూడటమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రతిగా చంద్రబాబు మరోసారి మాట్లాడుతూ..

Konijeti Rosaiah Death : గాంధీ భవన్‌కు రోశయ్య పార్థివదేహం -ఆయన పేరిట అరుదైన రికార్డు.. అజాత శత్రువురోశయ్యకు కోపం పెరిగిపోయింది..
‘అధ్యక్షా.. రోశయ్య గారికి ఈ మధ్య తెలివితేటలు ఎక్కువయ్యాయి. గతంలో ఆయన కేవలం సైనింగ్ మిషన్(సంతకాలు పెట్టే యంత్రం)గా వ్యవహరించారు. ఈ మధ్య రోశయ్యగారికి కోపం కూడా బాగా పెరిగిపోతోంది. ఎందుకంటే చేతగానితనం వల్ల, ఎక్కువ ఆరోపణలొచ్చినప్పుడు ఏం చేయాలో తెలీక ఫ్రస్ట్రేషన్ తోనే రోశయ్య కోప్పడుతున్నారు.. ’అని చంద్రబాబు గర్జించారు. ఆ తర్వాత మళ్లీ మైక్ అందుకున్న మంత్రి రోశయ్య.. చరిత్రలో గుర్తుండిపోయేలా చంద్రబాబును మాటలతోనే చెడుగుడు ఆడేశారు..నన్ను నమ్మిన వైఎస్సార్‌ను కత్తితో పొడిచి..
‘అవును అధ్యక్షా.. చంద్రబాబు మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. నాకీ మధ్య కోపం ఎక్కువైంది. ఎందుకంటే సభలో ప్రతిపక్షం తీరు చూసి, ఈ సభకు ఏం ఖర్మ పట్టిందాని ఆవేదన ఉంది. ఎన్టీఆర్ ను అవహేళన చేయలేదు. టీడీపీ వాళ్లెవరో నేను డ్రామా చేస్తున్నానంటే, మావాళ్లు టీడీపీదే డ్రామా కంపెనీ అని బదులిచ్చారు. ఆ వ్యాఖ్యలను కూడా నేను తప్పుపట్టాను. అలా అనొద్దన్నాను. నేను ఏనాడూ డ్రామాల్లో నటించలేదు. ఎన్టీఆర్ తొలినాళ్లలో డ్రామాల్లో కనిపించారు. ఆ తర్వాత ప్రముఖ సినీ నటుడు అయ్యారని మాత్రమే చెప్పాను. ఎన్టీఆర్ పట్ల చంద్రబాబుకు మొదట్లో గౌరవం లేకున్నా తర్వాత పెరిగి, మళ్లీ తగ్గడం, అసలు ఎన్టీఆర్ ను చంద్రబాబు ఏం చేశాడో దేశమంతా చూసింది. ఇక నా తెలివితేటల గురించి కూడా చంద్రబాబు మాట్లాడారు. అవును, బాబుకు ఉన్నంత తెలివే నాకు ఉండేదుంటే.. నన్ను నమ్మిన వైఎస్సార్‌ను ఒంటరిగా ఉన్నప్పుడు కత్తితో పొడిచి నేను ముఖ్యమంత్రి అయ్యేవాడిని. అంతకుముందు చెన్నారెడ్డిని, భాస్కర్ రెడ్డినీ పొడిచేవాడిని..’ అంటూ రోశయ్య అసెంబ్లీలో చంద్రబాబుకు ఇచ్చిన డోసు మామూలుగా ఉండదుమరి.
Published by:Madhu Kota
First published:

Tags: AP Assembly, Chandrababu naidu, Congress, Rosaiah, YSR

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు