హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

దేశంలోనే తొలిసారి.. డాగ్ ఫ్రెండ్లీ దుర్గాపూజ.. ఎక్కడో తెలుసా..?

దేశంలోనే తొలిసారి.. డాగ్ ఫ్రెండ్లీ దుర్గాపూజ.. ఎక్కడో తెలుసా..?

దుర్గా దేవీ విగ్రహం ముందు జాగీలాలు

దుర్గా దేవీ విగ్రహం ముందు జాగీలాలు

West bengal: పెంపుడు శునకాలను నవరాత్రి వేడుకల్లో తీసుకొచ్చారు. అమ్మవారి ముందు అవి గౌరవంగా వంగి నమస్కరించాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • West Bengal, India

శునకాలను మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. ఇంట్లోని ఫ్యామిలీ మెంబర్ గా దాన్ని ట్రీట్ చేస్తుంటారు. ఎక్కడికి వెళ్లిన శునకాలను తీసుకెళ్తుంటారు. యజమానులతో కుక్కలు కూడా ఎంతో విశ్వాసంగా ఉంటాయి. ఇదిలా ఉండగా.. పోలీసులకు కూడా తమ విధినిర్వహణలో దొంగలను పట్టుకొవడానికి శునకాలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ జాగీలాలకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తుంటారు. కొన్ని సందర్భాలలో కుక్కలు.. తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ దొంగలను కాపాడతాయి. కాగా, అలాంటి జాగీలాలు ప్రస్తుతం దుర్గాపూజలో (Durgapuja)  పాల్గొన్నాయి. ఈ ఘటన వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు... వెస్ట్ బెంగాల్ లో (West bengal) నవరాత్రి (Navratri) దుర్గాపూజ ఎంతో వేడుకగా జరుగుతుంది. ఇక్కడ జరిగే దుర్గాపూజను చూడటానికి అనేక ప్రాంతాలనుంచి తరలి వెళ్తుంటారు. ఇదిలా ఉండగా కోల్‌కతా పోలీసుల డాగ్ స్క్వాడ్‌కు చెందిన నలుగురు బృందం రాష్ట్ర 'మొట్టమొదటి' పెంపుడు జంతువుల దుర్గాపూజ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. కోల్‌కతా పోలీసులు పంచుకున్న ఫోటోలో నాలుగు కుక్కలు దేవత ముందు వంగి ఉన్న ఫోటోలు వైరల్‌గా (Viral)  మారాయి.

దీనిలో మెయిన్ గా.. డాగ్ స్క్వాడ్ సభ్యులు.. కుక్క యజమానులు, జాగీలాలను తీసుకొచ్చారు. లాబ్రడార్స్ మోలీ, కర్పూరం, జర్మన్ షెపర్డ్‌లు లిజా, డింకీలు హాజరై పండల్‌ను అలంకరించారు. మరొక చిత్రంలో, దుర్గాదేవి పాదాల దగ్గర రెండు కుక్కల శిల్పాలను కూడా మనం గుర్తించవచ్చు.

ఇదిలా ఉండగా ఇంగ్లండ్ లో (England) వింత ఘటన జరిగింది.

బ్రిస్టల్ కు చెందిన అమండా గొమ్మో (51) అనే మహిళ నిద్రపోతున్నప్పుడు ఆమె పెంపుడు ముఖంమీద ఏదో ద్రవం పడినట్లు అనిపించింది. దీంతో ఆమె ఉలిక్కిపడి లేచింది. అయితే.. కొంత ద్రవం ఆమె నోటిలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో.. మహిళకు మెళకువ వచ్చింది. ఆమె పెంపుడు శునకం.. ఆమె ముఖంమీద మూత్ర విసర్జన చేసింది. శునకం కొన్ని రోజులుగా తీవ్ర మైన జీర్ణకోశ ఇన్ఫెక్షన్‌ ఏర్పడింది. ఈ క్రమంలో అది తన యజమాని ముఖంమీద మలమూత్రవిసర్జన చేసింది. దీంతో మహిళకు వాంతులు అయ్యాయి.

ఆ తర్వాత.. ఆమెలో కొన్ని మార్పులు కన్పించాయి. దీంతో ఆమె వెంటనే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఆమెను టెస్ట్ చేసిన వైద్యులు శునకం వలన ఏదో చెడు బ్యాక్టిరియా ఆమె కడుపులో వెళ్లిందని నిర్దారించారు. దీంతో మహిళను ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. దాదాపు మూడు రోజుల పాటు ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందించారు. కాగా, ఇప్పుడు ఆమె ఆరోగ్యం కుదుట పడటంతో డాక్టర్ లో డిశ్చార్జ్ చేశారు. తన ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందని, తన పెంపుడు శునకం అంటే కోపంలేదని మహిళ అమండా గొమ్మో తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా (Viral news)  మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Kolkata, VIRAL NEWS, West Bengal

ఉత్తమ కథలు