సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. అందులో కొన్ని మాత్రమే వైరల్ మారి నెటిజన్ల మనసును దోచుకుంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వృద్ధ జంట చేసిన డ్యాన్స్ వీడియో అది. వివరాలు.. కోల్‌కతాలోని ఫేమస్ కెఫే.. హార్డ్ రాక్‌లో ప్రతి రోజు మంచి బ్యాండ్ మ్యూజిక్ ప్లే చేస్తుంటారు. ఇక్కడ ప్లే చేసే పాటలను విని కస్టమర్స్ మైమరిచిపోయేలా ఏర్పాట్లు చేశారు. ఇటీవల ఆ కేఫ్‌లో "వో చలీ వో చలీ దేఖో ప్యార్ కి గలీ" ప్లే చేయగానే కేఫ్‌లో ఉన్న ఓ వృద్ధ జంట అమాంతం లేచి డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. దీంతో కెఫేలో ఉన్న వారంతా చప్పట్లు కొడుతూ వారిని ప్రోత్సహించారు. ఈ వీడియోను thebohobaalika అనే ఇన్‌స్టా యూజర్ షేర్ చేశారు.
"హార్డ్ రాక్ కెఫే అన్నింటికన్నా భిన్నమైనది. ఇక్కడి బ్యాండ్ ప్లే చేసిన 1990ల నాటి పాప్ సాంగ్స్ నన్ను నా పాఠశాల రోజులకు తీసుకెళ్లాయి. మరెందరికో మరిచిపోలేని అనుభూతులను పంచిపెట్టిందని" ఆ ఇన్‌స్టా పేర్కొన్నారు. ఇక, ఈ వీడియో కొద్ది రోజుల్లోనే వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోకు 27వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.
ఇక, ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా అద్భుతమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వారి డ్యాన్స్ చాలా స్వీట్‌గా ఉందని, చాలా బ్యూటిఫుల్ డ్యాన్స్‌ను వీడియో తీశారని కామెంట్స్ పెడుతున్నారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.